ప్రపంచంలో ఇవే టాప్-10.. పదోస్థానంలో ‘ఆ’ వెబ్ సైట్!

0

అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేశాక ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చినట్లు అయిపోయింది. దీంతో ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా నిమిషాల్లో తెలిసిపోతుంది. దీనికి తగ్గట్లే ఇంటర్నెట్ రంగంలో కూడా రేస్ మొదలైంది. ఈ రేస్ లో ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో నిలిచిన వెబ్ పైట్లను సిమిలర్ వెబ్ హైలెట్స్ అనే సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ జాబితాలో ఉన్న 10 వెబ్ సైట్లను నెటిజన్లు ప్రతినెలా 167.5 బిలియన్ సార్లు ఓపెన్ చేశారు. మరి గత సంవత్సరం నెటిజన్లు ఎక్కువగా చూసిన వెబ్ సైట్లపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

​1. గూగుల్

గూగుల్ గురించి తెలియంది ఎవరికి? దాన్ని ఓపెన్ చేయనిది ఎవరు? ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ను ఉపయోగిస్తూనే ఉంటారు. కాబట్టి గూగుల్ ఈ జాబితాలో టాప్ లో ఉండటంలో వింతేముంది చెప్పండి!

​2. యూట్యూబ్

మనం ఇంటర్నెట్ లో ఏం సెర్చ్ చేయాలన్నా గూగుల్ కి ఎలా వెళ్తామో.. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ను ఆశ్రయించకతప్పదు. అందుకే ఈ జాబితాలో యూట్యూబ్ రెండోస్థానంలో ఉంది. యూట్యూబ్ కూడా గూగుల్ పేరెంటల్ సంస్థకే చెందింది కావడం విశేషం.

​3. ఫేస్ బుక్

రెండిటి తర్వాత ఈ జాబితాలో ఫేస్ బుక్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 200 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారందరూ దాదాపు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఉపయోగించడం లేదంటే.. వారు డీటాక్స్ కోసం దాన్ని పక్కనపెట్టి ఉంటారు.

​4. బైదు

బైదు అంటే మనకు పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే చైనాకు చెందిన సెర్చింజన్. అంటే మరో మాటలో చెప్పాలంటే చైనాకు ఇదే గూగుల్ అన్నమాట. చైనా జనాభా ఎలాగో అధికం కాబట్టి బైదు ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.

​5. వికీపీడియా

మనకు దేని గురించి అయినా పూర్తిస్థాయిలో వివరాలు కావాలంటే.. మనం ముందుగా ఆశ్రయించేది వికీపీడియానే. ఒకే అంశానికి సంబంధించి వికీపీడియా పూర్తిస్థాయిలో వివరాలను అందిస్తుంది. అందుకే ఈ జాబితాలో వికీపీడియా ఐదో స్థానంలో ఉంది.

​6. అమెజాన్

అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో పేరు పొందిన ఈ-కామర్స్ వెబ్ సైట్. మనకు కావాల్సిన వస్తువులు ఏవైనా సరే ఇందులో ఆర్డర్ చేయవచ్చు. కాబట్టే ఈ జాబితాలో అమెజాన్ ఆరోస్థానంలో ఉంది.

​7. ట్వీటర్

ఫేస్ బుక్ తర్వాత ఈ జాబితాలో చోటు చేసుకున్న రెండో సోషల్ మీడియా వెబ్ సైట్ ఇదే. ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్ల కారణంగా ట్వీటర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్లను సంపాదించుకుంది. కాబట్టి ఈ జాబితాలో ట్వీటర్ ఏడో స్థానంలో ఉంది.

​8. ఇన్ స్టాగ్రాం

ఈ జాబితాలో ఉన్న మూడో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్. ఇదే జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఫేస్ బుక్ కు చెందిన సంస్థే ఇది కూడా. దీంతో ఈ జాబితాలో ఇన్ స్టాగ్రాం ఎనిమిదో స్థానంలో ఉంది.

​9. యాహూ

ఒకప్పుడు గూగుల్ కు, యాహూకు మధ్య తీవ్రంగా పోటీ నడిచింది. కాలక్రమంలో యాహూ ఈ రేస్ లో వెనకబడింది. అయినప్పటికీ ఇప్పటికీ టాప్ వెబ్ సైట్ల జాబితాలో యాహూ నిలిచింది. ఈ జాబితాలో తొమ్మిదోస్థానంలో యాహూ ఉంది.

​10. ఎక్స్ వీడియోస్

ఈ జాబితాలో పదో స్థానంలో పోర్న్ వెబ్ సైబ్ ఎక్స్ వీడియోస్ నిలిచింది. అంతేకాకుండా ఈ జాబితాలో ఉన్న ఏకైక పోర్న్ వెబ్ సైట్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్న్ ప్రియులందరూ ఎగబడి చూసేయడంతో ఈ జాబితాలో ఎక్స్ వీడియోస్ పదో స్థానంలో నిలిచింది.
Please Read Disclaimer