విడుదలకు ముందే ఎంఐ ఏ3 ఫీచర్లు లీక్‌!

0

స్మార్ట్‌ఫోన్‌ రంగంలో దూసుకుపోతున్న చైనాకు చెందిన షావోమీ నుంచి గతంలో ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద ఏ1, ఏ2 ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఏ3 పేరిట మరో ఫోన్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది షావోమీ. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. దీనిబట్టి ఈ ఫోన్‌ మూడు రంగుల్లో లభ్యం కానుంది.

ఒక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ రానుంది. 6 అంగుళాల ఫుల్‌హెచ్‌ ప్లస్‌ సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో అలరించనుంది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా ఉండనుందని లీకేజీ ద్వారా స్పష్టమవుతోంది. వెనుకవైపు 48+8+2 ఎంపీ సెన్సర్లు అమర్చి ఉంటాయి. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌.. ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌, టైప్‌సీ పోర్ట్‌ ఉండనున్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో రానుందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారికంగా మొబైల్‌ విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.