ఫ్యామిలీతో సినిమా చూసిన అల్లు అర్జున్ [Photos]

0

ఇద్దరమ్మాయిలతో చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వందలాది థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. అమలా పాల్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.

హీరో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో వీక్షించారు. ఆయన భార్య స్నేహారెడ్డి, తల్లిదండ్రులు అరవింద్, నిర్మలతో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఈ షోకు హాజరయ్యారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో సినిమా చూస్తూ అల్లు అర్జున్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.

మరో వైపు దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోయిన్ అమలా పాల్ తో కలిసి తన సొంత ఊరు నర్సీపట్నంలో సినిమా చూసారు. అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్, బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.

allu-arjun-family-watching-iddarammayilatho-01