సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్ [Photos]

0

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలిండియా కృష్ణ మహేష్ బాబు ప్రజాసేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణ హాజరైన కేక్ కట్ చేసారు. ఆయన సతీమణి విజయ నిర్మల కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ.! ఈయన 1942వ సంవత్సరం మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు. సినీరంగంలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న మనసున్న మనిషిగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు.

దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షించండి….

super-star-krishna-birthday-celebrations-01