Home / LIFESTYLE / రక్తపోటు సమస్య? ఈ 5 యోగాసనాలు ప్రయత్నించండి

రక్తపోటు సమస్య? ఈ 5 యోగాసనాలు ప్రయత్నించండి

బీపీ, మధుమేహం (డయబెటీస్) వంటి దీర్ఘకాలిక రోగాలు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. బిజీ లైఫ్.. మారుతున్న జీవన శైలి వల్ల చిన్న వయస్సులోనే ఈ వ్యాధులు దాడి చేస్తున్నాయ్. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పకుండా శ్రద్ధ చూపాలి. ఒక వేళ ఆయా వ్యాధులు మిమ్మల్ని వెంటాడుతున్నా.. ఆందోళన చెందవద్దు. ఎందుకంటే.. ఆందోళన అనారోగ్యానికి పెట్టుబడి. శరీరాన్ని కుంగదీసే మహమ్మారి. ఇది దరిచేయకూడదంటే ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం 30 నిమిషాలు యోగా లేదా వ్యాయామం చేయడం తప్పనిసరి. ముఖ్యంగా రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ఈ కింది ఐదు యోగాసనాలు ప్రయత్నించండి. తప్పకుండా మీ మంచి ఫలితాలను పొందుతారు.

విపరీతకరణి
ఈ ఆసనాన్ని.. ‘లెగ్ అప్ వాల్’ అని అంటారు. ఈ ఆసనంలో నేలపై పడుకొని రెండు కాళ్ళూ పైకెత్తాలి. అరచేతులతో పిరుదులను పైకి లేపండి. శరీర బరువు చేతులు, భుజాల పైన ఉండేలా చూడండి. అనంతరం నెమ్మదిగా కాళ్ళను వెనక్కి వంచండి. ఈ ఆసనంలో కొద్ది సేపు కదలకుండా ఉండండి. అనంతరం రెండు కాళ్ళ మోకాళ్ళను మడచి, పిరుదులను నెమ్మదిగా నేలకు తాకిస్తూ యథాస్థికి రావాలి. ఉపయోగం: ఈ ఆసనం వల్ల కళ్ళలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

శ్వాస వ్యాయామం
ఈ ఆసనంలో వేలుతో ఎడమ/కుడి నాసికా (ముక్కు) రంధ్రాన్ని మూసి, ఒకే నాసికా రంధ్రంతో శ్వాస పీల్చాలి. ఇలా రెండు నాసిక రంధ్రాలను మార్చి మార్చి చేయాలి. మందుగా ఎడమ చేతిని, ఎడమ మోకాలిపై ఉంచి.. కుడి చేతి ఉంగరపు వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని మూయండి. ఇప్పుడు లోతైన శ్వాసను తీసుకోండి. కొద్ది సేపటి తర్వాత.. ఎడమ చేతి ఉంగరపు వేలుతో, ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి, లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఇలా కనీసం 5 నిమిషాలు చేయండి. ఉపయోగం: ఈ ఆసనం వలన గుండె సంబంధిత అవయవాలు, నాడీ వ్యవస్థ, ఆరోగ్యం మెరుగుపడతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. మెదడు, గొంతు భాగాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కళ్లు, ముక్కు, చెవులు, నాలుక భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. ఈ ఆసనం వల్ల వాపు, శోధ వంటి రుగ్మతల నుంచి బయటపడవచ్చు. టాన్సిల్స్‌ను కూడా నివారించవచ్చు.

నమస్తే భంగిమ
ఈ ఆసనాన్ని చాలా సులభంగా చేయొచ్చు. ఈ ఆసనంలో ముందుగా కాళ్ళను మడచి కూర్చోవాలి. రెండు చేతులను నమస్తే భంగిమలో చాతికి దగ్గరగా ఉంచాలి. ఇదే సమయంలో, నెమ్మదిగా గాలిని పీలుస్తూ, వదలాలి. ఉపయోగం: దీని వల్ల చేతుల్లోని రక్త ప్రసారం మెరుగవుతుంది. శ్వాస వ్యవస్థ మెరుగవుతుంది.

చిన్నారుల భంగిమ
ఈ భంగిమలో మోకాళ్ళను మడచి నేలపై కూర్చోవాలి. గాలిని పీలుస్తూ, తలను నేలకు తాకించాలి. ఈ భంగిమలో ఉన్న తర్వాత మూడుసార్లు శ్వాసను బయటకు వదలండి. అనంతరం గాలిని పీలుస్తూ పూర్వ స్థితికి రండి. ఉపయోగం: ఈ ఆసనం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ మెరుగువుతుంది. 

వృక్ష భంగిమ
రెండు కాళ్ళు ఒకదాన్ని ఒకట తాకేలా నిటారుగా నిలబడండి. అనంతరం కుడి కాలును పైకెత్తి, పాదాన్ని, నెమ్మదిగా ఎడమ కాలు తోడ వద్ద ఉంచండి. ఇలా చేస్తూనే రెండు చేతులను పైకెత్తి, నమస్కారం భంగిమలో నిలుచోండి. ఇలా కొన్ని నిమిషాల పాటూ నిలబడి, లోతుగా శ్వాస తీసుకుని వదలండి. తిరిగి సాధారణ స్థితికి రండి. ఈసారి ఎడమ కాలితో పైన చెప్పిన విధంగా చేయండి. ఉపయోగం: ఈ ఆసనాన్ని రోజు చేయడం వల్ల బలంతో పాటూ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగవుతుంది. ఊపిరిత్తిత్తుల పని తీరు కూడా మెరుగవుతుంది. శరీరంలో రక్త పీడనం అదుపులో ఉండి.. శ్వాస వ్యవస్థ, శరీరం ఫిట్‌గా ఉంటుంది.

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top