అతడో బ్యాంకు ఉద్యోగి.. కానీ ప్రవృత్తి మహిళలను లోబరుచుకోవడం.. రుణాల పేరుతో మహిళలకు గాలం వేయడం.. ఇలా ఏకంగా 40మందికి పైగా మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలలను ఫొటోలు వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. ఇందులో అత్తింటివారూ భాగస్వాములయ్యారు. దీంతో అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.
ఈ దారుణాలు చేసింది తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36). ఇతడిది పుదుక్కొట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు.
క్యాషియర్ జయకుమార్ తంజావూరు జిల్లా వల్లం సమీపం రెడ్డిపాళయానికి చెందిన యువతి(32)తో గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచి జయకుమార్ ప్రత్యేక గదిలో గంటల తరబడి ఉంటూ మహిళలతో ఆశ్లీలంగా మాట్లాడడం.. తనతో సఖ్యతతో ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో భర్త గదిలో వెళ్లి పరిశీలించగా.. 15 సెల్ ఫోన్లు వాటిల్లో జయకుమార్ 40మందికి పైగా మహిళలతో బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా నగ్నంగా ఉన్న చిత్రాలు బాత్ రూమ్ లో వీడియోలు ఎస్ఎంఎస్ లు చూసింది. ఈ ఘోరాలను తన అత్తగారు భర్త సోదరి అత్తవారింటి ఇతర మహిళలకు చెప్పుకొని విలపించింది. వాళ్లు పట్టించుకో లేదు. భర్తకు తెలిసి భార్యను బెదిరించాడు. నీ నగ్న వీడియో కూడా తీశానని.. ఈ విషయాలు బయటకు చెబితే సోషల్ మీడియా లో పెడుతానని జయకుమార్ హెచ్చరించారు.
అయితే జయకుమార్ ఆగడాలపై ఆయన భార్య తల్లిదండ్రులకు చెప్పింది. వారు నిలదీయడంతో భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. రెండు సార్లు తప్పించుకుంది. ఈ ఆగడాల వెనుక తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు జయకుమార్ తో సంబంధం పెట్టుకొని ఈ దుర్మార్గాలు చేసిన బ్యాంకు ఉద్యోగి ని తోపాటు కుటుంబ సభ్యులు బంధువులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలైన భార్య.. తన భార్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు వీడియో ఆధారాలను మధురై కోర్టు కు అప్పగించి విడుదల చేసింది. దీంతో అతడి బండారం బయట పడింది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
