విడుదల తేదీ : ఫిబ్రవరి 21, 2020
నటీనటులు : నితిన్, రష్మిక మండన, నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు.
దర్శకత్వం : వెంకీ కుడుముల
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశి
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్
ఎడిటర్ : నవీన్ నూలి
‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘భీష్మ’. సినిమాలోని పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
భీష్మ (నితిన్) డిగ్రీని సగంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తూ తనకు నచ్చినట్టు లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరో పక్క వ్యవసాయ రంగానికి చెందిన “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ భీష్మ (అనంత్ నాగ్) ఉంటాడు. దాని కోసం తన తరువాత ఆ కంపెనీని ముందుకు తీసుకుని వెళ్లే సీఈవో కోసం చూస్తుంటాడు. ఈ మధ్యలో చైత్ర (రష్మిక)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడుతూ ఆమెను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు. అంతలో కొన్ని ఊహించని పరిణామాల ద్వారా బీష్మ (నితిన్) తనకు ఏ సంబంధం లేని ఆ భీష్మ ఆర్గానిక్ కంపెనీ భాద్యతలు చేపడతాడు. ఆ తరువాత అతను ఆ కంపెనీని ఎలా కాపాడాడు ? అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈవో అయ్యాడు ? చివరికి నితిన్ రష్మిక ఒక్కటవుతారా ? లేదా ? మొత్తం ఈ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నితిన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో పాటు తన టైమింగ్ తో కూడా బాగా నవ్వించాడు. ముఖ్యంగా కార్ సీన్స్ లో మరియు ఫోన్ లో మెసేజ్ చేసే సీక్వెన్స్ లో అలాగే మిగిలిన కామెడీ అండ్ లవ్ సీన్స్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంటర్వెల్ సీన్ లో కూడా చాలా బాగా చేశాడు. కథానాయకిగా నటించిన రష్మిక తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టంట్ రోల్ లో కనిపించిన అనంత్ నాగ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. మరో కీలక పాత్రలో కనిపించిన హెబ్బా పటేల్ స్క్రీన్ షోకే పరిమితం అయింది.
తండ్రి పాత్రలో నటించిన సంపత్ రాజ్ తన నటనతో మెప్పించారు. ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు వెంకీ ఫస్ట్ హాఫ్ ని సరదాగా నడిపాడు. అలాగే సెకండాఫ్ లో కూడా సరదాగా నడుపుతూనే ఆర్గానిక్ సంబంధించి మంచి మెసేజ్ ఇస్తూ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేసారు. సినిమాలో ఆర్గానిక్ పాయింట్ తో కొత్తదనం తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లేలో కామెడీ చూపించిన విధానం బావుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా మొదటి భాగం ఎంటర్టైన్ గా సాగినా రెండువ భాగం మాత్రం అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. అలాగే దర్శకుడు రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం కొంత వరకు లోపించిన ఫీలింగ్ కలుగుతుంది.
ఆర్గానిక్ ట్రాక్ కి సంబంధించి మరింతగా డిటైల్డ్ గా చూపించి ఉంటే బాగుండేది. సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉన్నా, సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలకి స్కోప్ ఉన్నా, దర్శకుడు మాత్రం తన శైలిలోనే కథనాన్ని కామెడీగా నడిపాడు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వెంకీ రాసుకున్న కథను స్క్రీన్ మీద మంచి ఫన్ తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కాకపొతే ఆయన కథనం పై ముఖ్యంగా రెండువ భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు :
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. డీసెంట్ కామెడీతో అండ్ కొన్ని లవ్ సీన్స్ తో మరియు ఆర్గానిక్ కి సంబంధించి మంచి మెసేజ్ తో యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని బాగానే అలరిస్తుంది(కొన్ని చోట్ల సిల్లీ సీన్స్ ఉన్నా). అయితే ఆ సిల్లీగా అనిపించిన సీన్స్ కి క్లైమాక్స్ లో క్లారిటీ ఇవ్వడం బాగుంది. ఇక నితిన్ నటన, హీరోయిన్ రష్మిక స్క్రీన్ ప్రజెన్స్ అండ్ గ్లామర్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీయడం, ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా మంచి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘భీష్మ’ : లైవ్ అప్డేట్స్:
-
ఓ ఫన్ నోట్ తో సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.
Date & Time : 07:15 AM February 21, 2020 -
ఇపుడు నితిన్ మినిష్టర్ అజయ్ సహాయంతో జిష్షు కంపెనీల లైసెన్స్ లను రద్దు చేసి అన్ని సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
Date & Time : 07:10 AM February 21, 2020 -
భీష్మ ఆర్గానిక్ కంపెనీకు పోటీగా విలన్ ఇప్పుడు తన ఎరువుల కంపెనీను స్థాపించాడు.పలు ఆసక్తికర సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:05 AM February 21, 2020 -
ఇప్పుడు మాస్ సాంగ్ వాట్ ఎ బ్యూటీ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 07:00 AM February 21, 2020 -
ఇప్పుడు నితిన్ మరియు అనంత్ నాగ్ ల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:50 AM February 21, 2020 -
ఇప్పుడొక పోరాట సన్నివేశానికి రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 06:45 AM February 21, 2020 -
ఇప్పుడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM February 21, 2020 -
ఇప్పుడు మూడో సాంగ్ సూపర్ క్యూట్ మొదలయ్యింది.
Date & Time : 06:30 AM February 21, 2020 -
కథనంలో మరింత హిలేరియస్ కామెడీ చోటు చేసుకుంటుంది.
Date & Time : 06:25 AM February 21, 2020 -
ఇప్పుడు వెన్నెల కిషోర్ మరియు నితిన్ ల మధ్య మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:16 AM February 21, 2020 -
ఇంటర్వెల్ అనంతరం ఇప్పుడు మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:07 AM February 21, 2020 -
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సినిమా పలు కామెడీ సీన్స్ మరియు ఇతర అంశాలతో డీసెంట్ గా సాగింది.ఇంటర్వెల్ లో చోటు చేసుకున్న ట్విస్ట్ సెకండాఫ్ కు కీలకంగా మారబోయేలా ఉంది.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:55 AM February 21, 2020 -
కథనంలో ఓ చిన్న ట్విస్ట్ చోటు చేసుకోడంతో సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 05:52 AM February 21, 2020 -
నితిన్ మరియు రష్మికాల మధ్య మరిన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:48 AM February 21, 2020 -
ఓ కాన్ఫిరెన్స్ మీటింగ్ లో అనంత్ నాగ్ మరియు జిష్షు గుప్తాలు వ్యవసాయానికి సంబంధించి డిబేట్ చేస్తున్నారు.
Date & Time : 05:44 AM February 21, 2020 -
ఇప్పుడు నితిన్ మరియు సంపత్ ల మధ్య మరిన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:36 AM February 21, 2020 -
నితిన్ రష్మికాను ఫ్లర్ట్ చేస్తున్నాడు.కాస్త అర్ధ రహిత కామెడీ సీన్స్ ఇపుడు వస్తున్నాయి.
Date & Time : 05:30 AM February 21, 2020 -
ఇప్పుడు “అశ్వథ్థామ” ఫేమ్ బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్త ఓ కార్పొరేట్ కంపెనీ హెడ్ గా పరిచయం అయ్యాడు.తనకి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:25 AM February 21, 2020 -
ఇప్పుడు రెండో సాంగ్ సరా సరి పాట మొదలయ్యింది.
Date & Time : 05:18 AM February 21, 2020 -
ఇప్పుడొక గ్యాంగ్ హీరోయిన్ ను టీజ్ చేస్తున్న సన్నివేశాలు చిన్న ఫైట్ సీన్ వైపుగా తీసుకెళ్లాయి.
Date & Time : 05:15 AM February 21, 2020 -
ఇప్పుడు హీరోయిన్ రష్మికా మందన్నా ఎంటర్ అయ్యింది.ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:13 AM February 21, 2020 -
పోలీస్ గా సంపత్ మరియు నితిన్ తండ్రిగా నటుడు నరేష్ ఇప్పుడు పరిచయం అయ్యారు.ఇప్పుడు కొన్ని ఈ ముగ్గురు మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:09 AM February 21, 2020 -
పాట పూర్తయ్యింది,విజువల్ గా ఒకే అని చెప్పాలి.ఇప్పుడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఒక టీవీ రిపోర్టర్ గా పరిచయం అయ్యారు.
Date & Time : 05:05 AM February 21, 2020 -
హీరోయిన్ హెబ్బా పటేల్ చిన్న క్యామియో రోల్ లో ఇప్పుడే ఎంటర్ అయ్యింది.ఇప్పుడు హిట్ ట్రాక్ సింగిల్స్ యాంథం మొదలయ్యింది.
Date & Time : 05:00 AM February 21, 2020 -
ఓ సింపుల్ ఎంట్రీతో నితిన్ పరిచయం అయ్యాడు.అలాగే సీన్స్ లో కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా జాయిన్ అయ్యాడు.ఇప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:57 AM February 21, 2020 -
నటుడు అనంత్ నాగ్ ను పరిచయం చేస్తూ సినిమా ఇప్పుడే మొదలయ్యింది.ఆయన పలు ఆహారపు అలవాట్లు అలాగే సేంద్రియ వ్యవసాయ విధానం కోసం స్పీచ్ ఇస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:55 AM February 21, 2020 -
హాయ్..151 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:50 AM February 21, 2020
భీష్మ రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25
3.2
భీష్మ రివ్యూ
భీష్మ రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

