పుట్టు మచ్చలు మరియు వాటి రహస్యాలు

0

పుట్టు మచ్చలు మరియు అవి ఉండే ప్రదేశాలు మన జీవితం యొక్క రహస్యాలను తెలుపుతాయి. ఇవి మన లక్ష్యం మరియు మన భవిష్యత్తు గురించి ఆధారాలను తెలుపుతాయి.
1:సంకేతాలు
జ్యోతిషశాస్త్ర ప్రకారం, దవడ లేదా గడ్డంపై ఉండే పుట్టు మచ్చలు అందాన్ని పెంచటమే కాకుండా మన భవిష్యత్తును కూడా నిర్దేశిస్తాయి. పుట్టు మచ్చలు శరీరంపై ఏ భాగంలో అయిన కలగవచ్చు మరియు ప్రతి పుట్టుమచ్చ ఒక రహస్యాన్ని కలిగి ఉంటుంది. మీ జీవితం గురించి ఇవేం చెప్తాయో ఇపుడు తెలుసుకుందాం.

2:నుదుటి భాగంలో
నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉందా? అయితే మీరు సంపన్న వ్యక్తి అవుతారని సూచిస్తుంది. ఒకవేళ నుదుటి ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే మీరు అదృష్టవంతులు కారు అని మరియు జీవితాంతం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తాయి. ఒకవేళ నుదుటి మధ్య భాగంలో పుట్టు మచ్చ ఉంటే, సంపద ఉండదు కానీ కీర్తివంతులు అవుతారని సూచిక.

3:గడ్డంపై పుట్టుమచ్చ
గడ్డంపై పుట్టుమచ్చ ప్రమాదానికి సూచిక. అనగా వివాహం అనంతరం మీ భాగస్వామితో సమస్యలు ఎదురోవాల్సి వస్తుందని దీనికి సూచిక.

4:కంటిపై పుట్టుమచ్చ
కుడికన్నుపై పుట్టు మచ్చ ఉంటే, మీ తుది శ్వాస వరకు జీవిత భాగస్వామితో ప్రేమలో ఉంటారని అర్థం మరియు ఎడమ కన్ను పై భాగంలో ఉంటే లక్ష్య సాధన కోసం మీరు చాలా కష్టపడాలని అర్థం.

5:చెంపలపై పుట్టుమచ్చ
కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే మీరు ఆరోగ్యవంతులని అర్థం, ఎడమ వైపు ఉంటే ధన నష్టం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం.

6:పెదాలపై పుట్టు పచ్చ
మీ పెదాలపై పుట్టుమచ్చ ఉంటే మీకు లైంగిక కోరికలు అధికమని అర్థం.

7:మెడపై పుట్టుమచ్చ
మెడ భాగంలో మచ్చ ఉంటే- సంపదతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అర్థం. అంతేకాకుండా, మీ జీవిత కాలం కూడా అధికంగా ఉంటుందని అర్థం.