గర్భంతో ఉన్న ఆడవారు ముందు నుండి ఆరోగ్యవంతమైన ఆహరం తీసుకునేలా ప్రణాలికను రూపొందించుకోవాలి. ముందు నుండే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవటం వలన గర్భ సమయంలో వచ్చే ఇబ్బందులను సులభంగా ఎదుర్కొనవచ్చు. తయారు చేసుకున్న ప్రణాళికలో కావలసిన పోషకాలను సరైన మోతాదులో ఉండేలా మరియు ఆహారాన్ని తగిన సమయంలో తీసుకోవాలి.
సరైన ఆహరం తీసుకోక పోవటం వలన కలిగే నష్టాలు
గర్భంతో ఉన్న ఆడవారు వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా వారి కడుపులో పెరుగుతున్న పిండం యొక్క ఆరోగ్యం మరియు పిండ పెరుగుదలకు కావలసిన ఆహారాన్ని తీసుకోవాలి. మీరు ఆహారాన్ని సరిగా తీసుకోకపోతే, పిండ పెరుగుదలలో లోపాలు మరియు పిండం తక్కువ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. మీ ఆహార ప్రణాళిక మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఫిట్’గా ఉంచుకోవటం చాలా అవసరం. మీరు చెక్ చేపించుకొనే వైద్యుడితో మీ శరీరానికి అనుగుణంగా ఆహార ప్రణాలికను తయారు చేసుకొని, వాటిని అనుసరిస్తూ, వైద్యుడి సలహాలను పాటించటం చాలా మంచిది.
ఆహారంలో ఉండవలసిన పోషకాలు
ఒకవేళ మీరు పొగత్రాగటం, ఆల్కహాల్, నికోటిన్ వాటిని తీసుకునే అలవాట్లు ఉంటే వాటిని త్వరగా మానేయటం మంచిది. దీని వలన మీ కడుపులో పెరుగుతున్న పిండానికి ప్రమాదం జరిగి పెరుగుదల లోపాలు ఇతర లోపాలు కలుగవచ్చు. మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా కాల్షియం, ప్రోటీన్స్, ఐరన్, విటమిన్ ‘C’, మరియు ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఆడవారు మాములుగా తీసుకునే దాని కంటే గర్భంతో ఉన్న సమయంలో ప్రతి రోజు 300 నుండి 400 క్యాలోరీలను ఎక్కువ తీసుకోవాలని ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన వైద్యులు అందరు తెలిపారు, ముఖ్యంగా ప్రసవానికి ముందుగా తప్పకుండా తీసుకోవాలి అని తెలిపారు.
మినరల్స్ ప్రాముఖ్యత
గర్భంతో ఉన్నన్న ఆడవారు ముఖ్యంగా తీసుకోవలసిన ఇంకొక మూలకం మినరల్స్. గర్భ సమయంలో వారి శరీరం లోపల మరియు బయట వచ్చే మార్పులకు తట్టుకొని, ఆరోగ్యవంతమైన ప్రసవం జరగాలి అంటే మినరల్స్ తప్పని సరిగా అవసరం. ఆక్సిజన్, పోషకాలను శరీర అన్ని భాగాకు అందేలా చేసే ఎర్ర రక్తకణాల ఎక్కువన్ ఉత్పత్తి అయ్యేలా మినరల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
మీరు తీసుకునే ఆహరంలో అవసరం మేరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ మరియు సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. గర్భ సమయంలో వారి జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. కావున మీరు త్వరగా జీర్ణం కానీ ఆహారాన్ని తినటం వలన శరీరంలోని విసర్జక పదార్థాలు బయటికి పంపటంలో విఫలం అవటం వలన రక్తం చెడి పోయి ఇతరేతర ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. కావున త్వరగా జీర్ణమయ్యే ఆహరాన్ని తీసుకోండి.
తీసుకోవలసిన ఆహరం
గర్భంతో ఉన్న ఆడవారు ఎక్కువగా పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, మరియు రోజు తీసుకునే ఆహారంలో 5 రకాల రంగులు ఉన్న పండ్లను తప్పకుండా తీసుకోవాలి. మీకు ఆకలిగా అనిపించకున్నను తినటానికి ప్రయత్నించండి. ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండే అరటిపండ్లను తినండి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు మరియు పాల పదార్థాలను తినటానికి ప్రయత్నించండి. మీ వైద్యుడిని సలహాలను పాటించి, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. రోగ నిరోధక శక్తిని పెంచుకోటానికి రోజు ఒక గ్లాసు అన్ని పండ్లు కలిపిన పండ్ల రసాన్ని తీసుకోండి.
*గర్భంతో ఉన్న సమయంలో ప్రతి రోజు 300-400 క్యాలోరీలను ఎక్కువ తీసుకోవాలి.
*ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మినరల్స్ ప్రముఖ పాత్రని పోషిస్తాయి.
*పొగత్రాగటం, ఆల్కహాల్, నికోటిన్ వంటి వాటికి దూరంగా ఉండండి.
*పచ్చని ఆకుకూరలు మరియు ఫోలేట్ ఎక్కువగా ఉన్న పండ్లని ఎక్కువగా తీసుకోవాలి.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
