Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> మీ రాశి ఆధారంగా ఏ ఉద్యోగం మీకు సూటవుతుందో తెలుసా..?

మీ రాశి ఆధారంగా ఏ ఉద్యోగం మీకు సూటవుతుందో తెలుసా..?


ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్కరికి విద్య అనేది ఎంతో ముఖ్యమైన అవసరం. ఎందుకంటే విద్య అనేది అవగాహనతో పాటు జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది. ఎక్కువ మంది వారు ఎంచుకునే రంగంలో పనిచేయాలని కలలు కంటారు. అయితే వీరిలో చాలా మంది చదువుకున్న చదువుకు ఎంచుకున్న రంగానికి సంబంధం లేకుండా పనిచేస్తుంటారు. మరికొంతమంది పెద్ద ఉద్యోగాల్లో మంచి జీతానికి పనిచేస్తారు. ఏదిఏమైనప్పటికీ వారికి ఆ ఉద్యోగాలు అంత సంతృప్తికరంగా ఉండవు. ప్రస్తుతం తరంలో చాలా మంది మంచి ఉద్యోగంతో పాటు సంతృప్తికరమైన జీతాన్ని కోరుకుంటున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం వారి వారి రాశుల ఆధారంగా ఏ వృత్తి అయితే సరిగ్గా సరిపోతుందో అది ఎంచుకుంటే వారి జీవితంలో సంతృప్తి సాధిస్తారు. మరి రాశిచక్రం ఆధారంగా ఏ రాశుల వారికి ఏ వృత్తులు సరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం..
స్వభావ రీత్యా యుద్ధాన్ని సూచే అంగారకుడు.. మేష రాశికి అధిపతి. ఫలితంగా వీరు ఎల్లప్పుడూ శక్తిమంతంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ విధంగా చురుకుగా ఉండే ఈ రాశివారు ఆటల్లో విశేషంగా రాణిస్తారు. ఏదైన క్రీడ లేదా అథ్లెటిక్స్ ను కెరీర్ గా ఎంచుకుంటే వారి జీవితం ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా వీరు చాలా త్వరగా నేర్చుకుంటారు. అదేవిధంగా అంతే తెలివిగా ఉంటారు. ఇతరుల కంటే ఎల్లప్పూడు ఓ అడుగు ముందుండే ఈ రాశివారు ఆటల్లో ప్రతిభను చూపి అందరి మన్ననలు అందుకుంటారు. విద్యార్థులకు శిక్షకుడుగా ఉన్నా.. అదే స్థాయిలో రాణిస్తారు.

​వృషభం..
వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు. వీరు ఎక్కువగా సౌకర్యవంతమైన, లగ్జరీ జీవితాన్ని అనుభవించేందుకు ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా వీరు మంచి రచయిత లేదా వక్తగా గుర్తింపుతెచ్చుకుంటారు. రచయితగా కెరీర్ ను ఎంచుకున్నట్లయితే అందులో సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని పొందుతారు. ఇతరులకు వీరు ఏమి రాస్తున్నారనే ఉత్సాహం ఉంటుంది. వీరు రచయితగా కెరీర్ ను ఎంచుకున్నట్లయితే పనిలో అంకితభావంతో పనిచేస్తారు. భవిష్యత్తులో ఇతరుల కంటే మెరుగైన రచనలు సాగిస్తారు.

​మిథునం..
ఈ రాశివారు ఎక్కువగా మీడియా రంగంలో ఉంటారు. ఎందుకంటే వీరెంతో తెలివైనవారు. అంతేకాకుండా తమ వ్యక్తిత్వం ద్వారా అందరిని ఆకట్టుకుంటారు. వ్యాఖ్యతగాను విశేషంగా రాణిస్తారు. తమ చాతుర్యం, ఆకర్షణీయమైన రూపం, ప్రతిభతో ప్రేక్షకులను ఆహ్లాదపరిచే శక్తి వీరికి ఉంటుది. అదనంగా వీరికి మంచి కామెడీ సెన్స్ ఉంది. ఈ విధంగా వీరు తమ ప్రదర్శన ద్వారా అందరిని ఆకట్టుకుంటారు. నటుడిగా వినోదరంగంలో వీరికి మంచి కెరీర్ ఉంటుంది. అది పక్కన పెడితే వారికి ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ అవకాశముంటుంది.

​కర్కాటకం..
కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు. ఈ కారణంగా మనసును ఆకర్షించగల తెలివితేటలు వీరికి ఉంటాయి. వీరు ఏ రంగంలోనోనైనా పనిచేసే అవకాశముంటుంది. కళారంగం పట్ల ఆసక్తి కనబరిచే వీరు విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకుని వారికిష్టమైన పాఠాలు నేర్పే మంచి గురువు కావచ్చు. ఆహారం తయారీ, ఉపాధ్యాయుడు, ఫొటోగ్రఫి లాంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులకు మంచి మార్గనిర్దేశకులుగా నిలుస్తారు.

​సింహం..
సూర్యుడు అధిపతి అయిన సింహ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు కన్సల్టెంట్స్ వ్యక్తులు కాబట్టి ఇతరులను బాగా ఆకర్షిస్తారు. అంతేకాకుండా ఇతరులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడంలో ముందుంటారు. అగ్నితత్వం కారణంగా వెల్డింగ్ పని కూడా చేయవచ్చు. న్యాయవాద వృత్తిని చేపడితే కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఫలితంగా వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిగతంగానూ విజయం సాధించే అవకాశముంటుంది.

​కన్య..
ఇతరులను పట్టించుకోవడం, వారిని జాగ్రత్తగా చూసుకునే గుణం కన్య రాశివారికి ఉంది. బుధుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు తెలివితేటలతో పాటు ఇతరులకు జ్ఞానాన్ని అందించగలుగుతారు. వైద్యరంగంలో అద్భుతంగా రాణిస్తారు. నర్సులుగా చెలామణి అవుతారు. అంతేకాకుండా వీరు నిస్వార్థంగా సేవ చేయగలరు. మంచి ఉపాధ్యాయులు, జర్నలిస్టులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఏ పనినైనా ఉత్తమంగా చేయగల సామార్థ్యాన్ని కలిగి ఉంటారు.

తుల..
తుల రాశి వారు ఓ నిర్ధిష్టమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నిర్వహణను మెరుగ్గా చేయగలిగే వారు వీరే. వ్యాపారాన్ని నిర్వహించే విధానంతో అందరి మన్ననలు అందుకుంటారు. వారు ఏ కంపెనీలో పనిచేసినా విజయవంతమవుతారు. వారు క్షేత్రస్థాయికి చేరుకోవడానికి హార్డ్ వర్క్, అంకితభావం ప్రధాన కారణం అవుతుంది. న్యాయవాది, సంగీతకారుడు, నటనా రంగంలో వారు గొప్ప ఎత్తులకు చేరుకునే అవకాశం ఉంది.

​వృశ్చికం..
వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. వీరు అత్యంత కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎంతో సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఏ రంగంలోనైనా ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉంటారు. సంగీతకారులు, నృత్య కారులు, చిత్రకారులు లాంటి రంగాల్లో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. భిన్నంగా ఆలోచించ గల వ్యక్తులు. ప్రతిభకు మార్గనిర్దేశం చేయాలని ఆలోచిస్తుంటారు. చిన్నప్పటి నుంచే కళారంగంలో ఆసక్తిని కనబరుస్తుంటారు. జ్యోతిష్కుల ప్రకారం ఈ రాశి వారు ఏ రంగంలోనైనా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు.

ధనస్సు..
ధనస్సు రాశికి అధిపతి గురుడు. ఈ రాశి వారు ఏ రంగంలోనైనా తమ వంతు కృషి చేస్తారు. ఆచార్యులు అయ్యే అవకాశం కూడావీరికి వస్తుంది. దాన్ని వీరు సద్వినియోగం చేసుకుంటారు. వీరు పరిశోధకులు కూడా. అటార్నీ, టైపింగ్, నటన, పబ్లిక్ రిలేషన్స్ మొదలగు రంగాల్లో విశేషంగా రాణిస్తారు. రచయిత అయితే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నటుడిగానూ మంచి పేరు సంపాదిస్తారు. రాజకీయ నాయుకుడిగానూ అవకాశముంది.

మకరం..
మకర రాశి వారికి అధిపతి శని. వీరు దృఢమైన మనస్సు కలవారు. అంతేకాకుండా గొప్ప మేధావి. సొంతంగా వ్యాపారం చేస్తారు. వ్యాపార భాగస్వామిగాను ఉంటారు. అంతేకాకుండా వీరు మంచి నాయకులు అయ్యే అవకాశముంది. ఈ రాశి వారు సానుకూల మార్గంలో చేయాలని ఆశిస్తారు. అదే విధంగా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఆలోచించాలి. న్యాయవాది, ఫుడ్ బిజినెస్, మైనింగ్ రంగం లాభదాయకంగా ఉంటుంది. మకర రాశి వారు మంచి న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకుంటారు.

​కుంభం..
కుంభ రాశి వారు అందరితోను సరళంగా మాట్లాడుతారు. అంతేకాకుండా సులభంగా పరిచయాలు ఏర్పరచుకుంటారు. ప్రతి ఒక్కరినీ తమలాగే సమానంగా, న్యాయంగా చూడాలని భావిస్తారు. వీరు ఇంజినీరింగ్, సైన్స్, విద్యారంగంలో ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రంగాల్లో విశేషంగా రాణించడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా వీరు ఎంచుకునే రంగాల్లో మంచి లాభాలను కూడా చవిచూస్తారు.

​మీనం..
ఈ రాశివారికి అధిపతి గురుడు. ఫలితంగా వీరు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కథలు రాయడం, కథలు చెప్పడం, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, మంచి చిత్రాను చూడటం లాంటి విభిన్న రంగాలను ఎంచుకుంటే బాగుంటుంది. గాజు వస్తువులతో జోడించడం లాంటి ఉద్యోగాలు వీరికి గొప్ప అభివృద్ధిని చవిచూస్తారు. రోగులను వీరి కంటే బాగా చూసుకునే వాళ్లు లేరు. కాబట్టి వైద్యరంగం వీరికి బాగా సరిపోతుంది.