వారానికి ఎన్నిసార్లు శృంగారం చేయాలో తెలుసా?

0

శృంగారం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అని వైద్యులు చెబుతున్నారు. చక్కని దాంపత్యానికి శృంగారం ఔషధంలా పనిచేస్తుందంటారు. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటే మంచి దీర్ఘాయుష్షు కూడా కలుగుతుందని నిర్దారణ అయింది. సెక్స్ తో గాఢమైన నిద్ర ఒత్తిడి నుంచి ఉపశమనం ఒంట్లోని క్యాలరీలు ఖర్చు అవడం మాత్రమే కాదు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే క్రమం తప్పకుండా సెక్స్ చేయాలని సూచిస్తున్నారు.

వారానికి మూడు సార్లు శృంగారం లో పాల్గొంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా మూడు సార్లు సెక్స్ చేసేవారికి మిగతా వారితో పోల్చితే గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. శృంగారం కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్తప్రసరణలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రక్తంలోని టాక్సిన్స్ కూడా తొలగి రక్తం శుభ్రం అవుతుంది.

రెగ్యులర్ గా శృంగారంలో పాల్గొనే వారి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు అవసరమైన హిమోగ్లోబిన్ చక్కగా ఉత్పత్తి అవుతుంది.వృత్తి పరమైన ఒత్తిడులను పడకగదికి తీసుకొస్తే అసలుకే ఎసరు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడిని పారదోలడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరిచి సమస్యలను అధిగమించే శక్తిని శృంగారం అందిస్తుందని చెబుతున్నారు. మూస దోరణితో సెక్స్ చేయకుండా పడకగదిలో కొన్ని ప్రయోగాలు చేస్తే బోర్ కొట్టదని సూచిస్తున్నారు. ఈ చర్య దంపతులకు మానసికంగా శారీరకంగా ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తుందని సూచిస్తున్నారు.

ఇక రాత్రి మాత్రమే శృంగారం చేయాలనుకోవడం సమాజంలో వేళ్లూనుకొని పోయింది. కానీ అది తప్పని కార్యంపై ఇష్టం ఉంటే ఎప్పుడైనా చేయవచ్చని సూచిస్తున్నారు. ఉదయం వేళ చేస్తే కొన్ని ప్రయోజనాలుంటాయని సూచిస్తున్నారు. ఈ శృంగారం వల్ల ఒకరిపై ఒకరి ప్రేమ అనుబంధం పెరుగుతుందని సూచిస్తున్నారు.

సెక్స్ సమయంలో భావప్రాప్తి కారణంగా విడుదలయ్యే హార్మోన్లు శరీర మెటబాలిక్ సిస్టమ్ ను పునరుద్ధరిస్తాయి. భావప్రాప్తి తో శరీరంలోని ఆక్సిటోసిన్ సాంద్రత ఒక్కసారిగా ఐదు రెట్లు పెరిగిపోతుంది. తద్వార దీర్ఘకాలిక తలనొప్పి మైగ్రేన్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే వారు నెలకు ఒకసారి శృంగారంలో పాల్గొనే వారి కంటే ఎక్కువ రోజులు బతుకుతున్నారని తేలింది.

పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్త్రీలల్లో ఈస్ట్రోజన్ కేవలం పడకపైనే ఉపయోగపడేవి కావంట. ఎముకలు కండరాలు గుండె తదితర అవయవాలకు మేలు చేస్తాయి. అందుకే ఈ హార్మోన్స్ కు ఎంత పని చెప్తే అంతా మంచిది. అందుకే శృంగారం ఎంత చేస్తే అంత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-