సెక్స్ సామర్థ్యం పెరగడానికి పురుషులు తప్పక తినాల్సినవి

0

మారుతున్న పరిస్థితులు.. మారిన ఆహారపు అలవాట్లు ఇతరత్ర కారణాల వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గుతుందని చెప్పుకోక తప్పదు. మన తాతలు వారి తండ్రులు ఒక్కొక్కరు డజన్ల కొద్ది పిల్లల్ని కన్నారు. కాని ఇప్పుడు మాత్రం ఒక్కరు లేదా ఇద్దరిని కనేందుకు కూడా మగవారిలో స్టామినా సరిపోవడం లేదు. ఈ విషయం మేము చెబుతున్నది కాదు ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో వెళ్లడైన విషయం. గత 10 సంవత్సరాల్లో పురుషుల వీర్యంలో శుక్రకణాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లుగా ఆ సర్వేలో వెళ్లడైంది.

ప్రపంచంలోని పలు దేశాల్లో 7500 మంది 28 నుండి 35 సంవత్సరాల వయసుల వారిని తీసుకొని వీర్యంను పరీక్షించినప్పుడు సహజంగా ఉండాల్సిన దానికంటే 39 శాతం తక్కువగా ఉంది. కొందరిలో 60 70 శాతం కంటే కూడా ఇంకా తక్కువగా ఉంది. ఈ ఆశ్చర్యకర ఫలితాలు చూసి సదరు సంస్థ కూడా అవాక్కయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు పరిస్థితి ఏంటి అంటూ ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది..

సెక్స్ సామర్థ్యం పెరుగుదల మరియు వీర్యకణాల పెరుగుదలకు చాలా మంది కెమికల్స్ మందులు వాడుతారు. అవి తాత్కాలికంగా శక్తినిస్తాయి కానీ ఎల్లకాలం పనిచేయవు. పైగా దుష్ఫలితాలు ఎక్కువ. అందుకే శారీరకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని దివ్యౌషధం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అదే ‘మఖానా’. దీన్నే తామర గింజలు అంటారు. ఇవి తీసుకుంటే మీ శృంగార సామర్థ్యం రెట్టింపు అవ్వడంతోపాటు వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని తాజాగా పరిశోధనల్లో తేలింది. ఒత్తిడి తగ్గించి నిద్రపట్టేలా చేసే గుణం కూడా వీటికి ఉంది. గ్లాస్ పాలలో 6 లేదా 7 మఖానా గింజలు వేసుకొని తాగితే మీ రాత్రి శోభనరాత్రి అవుతుందని చెబుతున్నారు.

శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేసే శక్తి ‘మఖానా’కు ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆయుర్వేదంలోనూ దీన్నే విరివిగా వాడుతారు. రోజూ వీటిని తీసుకుంటే మీ శృంగార బలహీనత బలాదూరేనని చెబుతున్నారు.

ఈ మఖానాలో కార్బొహైడ్రేట్స్ ప్రొటీన్స్ మినరల్స్ కొవ్వు ఫాస్పరస్ లాంటివి ఉంటాయి.ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. కోరికలు పెరగడానికి .. శృంగారం సామర్థ్యం రెట్టింపు చేయడానికి దోహదపడుతాయి. వీర్యంలో నాణ్యతను శుక్రకణాలను పెంచుతాయని తేలింది. వీటిల్లో అత్యధికంగా ఉండే ఫైబర్ కిడ్నీలు గుండెకు మంచిదని.. శృంగార లోపాలున్న వారు మఖానా తినాలని సూచిస్తున్నారు.