Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> రోజు 10 వేల అడుగులు నడిస్తే బరువు తగ్గుతారా ?

రోజు 10 వేల అడుగులు నడిస్తే బరువు తగ్గుతారా ?


ప్రస్తుత రోజుల్లో అందరికి ఉన్న ప్రధానమైన సమస్య బరువు తగ్గడం. కూర్చున్న చోటునుండే అన్ని పనులని చేసుకుంటూ పోతుండటంతో విపరీతంగా బరువు పెరుగుతున్నారు. దీనిపై మొదట్లోనే చర్యలు తీసుకోకపోవడం తో భారీగా శరీరం పెరిగిన తరువాత ఒక్కసారిగా తమ బరువుని తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇక బరువు తగ్గడం కోసం ..లావుగా ఉన్నవారు చేసే పనులని చూస్తే ఒక్కో సారి ఆశ్చర్యమేస్తుంది. అంతగా వర్క్ ఔట్స్ చేస్తుంటారు. అయితే ఇక బరువు తగ్గడానికి అందరూ చెప్పే ప్రధాన సూత్రం ..నడవడం. రోజుకి ఎంత దూరం నడిస్తే ..అంత మంచిది అని బరువు తగ్గాలంటే కచ్చితంగా నడవాలని కొంత మంది నడవడం ఇష్టం లేకున్నా కూడా నడుస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే రోజుకి 10 వేల అడుగులు నడిస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు అని కొందరు చెప్తుంటారు. కానీ రోజూ 10వేల అడుగులు నడిస్తే శరీర బరువు పెరుగుదలని ఆపుతుంది అనే నమ్మకం సరికాదని అమెరికాలోని బ్రిగ్ హామ్ యంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ బృందం120 మంది యువకులపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఆ యువకులంతా పెడోమీటర్లు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన విధించారు. వాటి ద్వారా వారు రోజూ ఎన్ని అడుగులు నడుస్తున్నారనే వివరాలను సేకరించారు.

24 వారాల తర్వాత వారివారి నడకలకు సంబంధించిన లెక్కలు ..వారి శరీర బరువుల్లో వచ్చిన తేడాలను పోల్చారు. అయితే అత్యధికంగా రోజూకి 15వేల అడుగులు నడిచిన వారి బరువు కూడా సగటున 1.5 కేజీలు పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి శరీర బరువు నియంత్రణ కు నడక ఒక్కటే సరిపోదని నడకతో పాటుగా ఆహారపు అలవాట్లు జీవనశైలి వంటి పలు అంశాలు కూడా కీలకమైనవేననే బ్రిగ్ హామ్ యంగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్దారించారు. దీన్ని బట్టి ..బరువు తగ్గాలి అనుకునేవారు కేవలం నడిస్తే సరిపోదు ..నడకతో పాటుగా డైట్ ని కూడా కంటిన్యూ గా ఫాలో అవ్వాలి.