ఈ ఒక్కపని చేస్తే చాలు.. క్యాన్సర్ మీ దగ్గరకి వచ్చే అవకాశాలు తగ్గినట్లే!

0

వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. అయితే, భయంకరమైన కాన్సర్ వ్యాధి కూడా వాకింగ్ చేయడం వల్ల దూరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇదే విషయంపై కొనసాగిన పరిశోధనల్లో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

​రోజూ వాకింగ్..

రోజూ వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. బీపీ, షుగర్, గుండె సమస్యలు ఇలాంటివన్నీ దూరం అవుతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే, తాజాగా వాకింగ్ గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలిశాయి.

​స్త్రీ, పురుషుల్లో తగ్గే ముప్పు..

వాకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ రాదని చెబుతున్నారు నిపుణులు. అంతేకాక, వారానికి రెండున్నర గంటలు అంటే రోజుకి 20 నిమిషాల పాటు వేగంగా నడిస్తే ఏడు రకాల కాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి ఎక్సర్‌సైజులతో స్త్రీ, పురుషుల్లో లివర్ కాన్సర్ ముప్పు 18 శాతం తగ్గగా.. బ్రెస్ట్ కాన్సర్ ముప్పు 6 శాతం తగ్గినట్లుగా గుర్తించారు శాస్త్రవేత్తలు.

​వారానికి ఎంత సమయమంటే..

అంతేకాదు, వారానికి రెండున్నర గంటల పాటు వేగంగా నడిస్తే కిడ్నీ కాన్సర్ ముప్పు కూడా 11 శాతం తగ్గుతుందని తెలిపారు. ఐదు గంటల వ్యాయామంతో 17 శాతం మేర ఈ ముప్పు తగ్గించవచ్చని పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు నిపుణులు. దీంతో పాట్ బ్రిస్క్ వాకింగ్ చేసేవారు కూడా జీర్ణ వాహిక క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బ్రిస్క్ వాకింగ్ చేస్తే 14 శాతం మేర కాన్సర్ ముప్పు తగ్గుతుందని తెలిపారు.

​మోకాళ్ల నొప్పులున్నా వాకింగ్..

ఇక్కడ మరో విషయం అనేక ఆరోగ్య సమస్యలతో చాలా మంది మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వాకింగ్ చేయొచ్చని చెబతున్నారు నిపుణులు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అయితే, కేవలం మోకాలి నొప్పులు వచ్చిన వారు మాత్రమే కాదు.. మిగతా వారు కూడా హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు. దీని వల్ల బ్లడ్ క్యాన్సర్ కూడా చాలా వరకూ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. 19 శాతం వరకూ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

​పరిశోధన కొనసాగిందిలా..

దాదాపు 7.5 లక్షల మందిపై పదేళ్ల పాటు ఈ పరిశోధన కొనసాగింది. అమెరికన్ కాన్సర్ సొసైటీకి చెందిన డాక్టర్ అల్ఫా పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ఈ విషయాలన్ని తెలిశాయని నిపుణులు చెబుతున్నారు.

​వాకింగ్ వల్ల అనేక ప్రయోజనాలు..

అయితే, వాకింగ్ చేయడం వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని చెబుతున్నారు నిపుణులు. వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరమవ్వడమే కాకుండా.. బాడీ ఫిట్‌గా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-