శృంగారానికి ముందు ఉల్లిపాయలు తినొద్దట.. ఎందుకంటే?

0

శృంగారం దివ్యౌషధం అంటారు నిపుణులు. ఈ లాక్ డౌన్ జంటలు మరింత రెచ్చిపోతున్నాయి. ఇక శృంగార ఉత్సాహాన్ని పెంచే ములక్కాయ లాంటివి రోజూ మెనులోకి వచ్చేస్తున్నాయట.. ఇక వయాగ్రాలు.. గట్రా మందుల వాడకం ఈ లాక్డౌన్ లో పెరిగిపోయింది.

అయితే ఏం తింటే శృంగార సామర్థ్యం పెరుగుతుంది? ఏది తింటే శృంగార సమస్యలు తెస్తుందనే దానిపై ఇప్పటిదాకా సరైన క్లారిటీ ఎవ్వరికీ లేదు. మనం రోజువారీ తీసుకునే ఆహారం ప్రభావం శృంగారంపై ఖచ్చితంగా ఉంటుందట.. దీనిపై అనేక పరిశోధనలు చేసిన వారు శృంగార సామర్థ్యాన్ని పెంచే ఆహారం ఏంటో చెప్పారు. కొన్ని తినకూడని పదార్థాల పేరు కూడా తెలిపారు.

*శృంగారానికి ముందు పాల ఉత్పత్తులు తింటే మంచిదికాదట.. అది మీ ఉత్సాహాన్ని తగ్గిస్తుందని తెలిపారు. పాలు పెరుగు ఎక్స్ ట్రా లాంటివి అరగడానికి చాలా సమయం పట్టి శృంగారానికి ఇబ్బందిని కలుగజేస్తాయి.

*క్యాబేజీ తింటే కోరికలు నశింప చేస్తుంటదట.. ఇది జీర్ణం కాకుండా శృంగారాన్ని ఎంజాయ్ చేయనీయదట..శృంగారానికి ముందు దీన్ని తినకూడదని తెలిపారు.

*బీన్స్ కూడా ఎక్కువగా కార్పొహైడ్రేట్స్ ఉండి జీర్ణం కాకుండా శృంగారాసక్తిని తగ్గిస్తాయని తేలింది.

*ఉల్లిపాయలు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి.. కానీ శృంగారానికి ముందు మాత్రం వీటిని తినకూడదు. ఉల్లితింటే నోటి నుంచి అదోరకం వాసన వస్తుంది. ఇది శృంగారలో ఇబ్బందులు కలుగుచేస్తుందట.. పార్ట్ నర్ మీకు దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది.

*కేక్స్ సోయా ప్రాసెస్ చేసిన మాంసంఫ్రెంచ్ ఫ్రైస్ ఓట్స్ చూయింగ్ గమ్ మద్యంపానం పొగతాగడం లాంటివి కూడా శృంగారాసక్తిని తగ్గిస్తాయని తేలింది. జీర్ణం కావడానికి టైం పట్టి శృంగార పటుత్వాన్ని తగ్గిస్తాయని తేలింది.