Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> టమాటాలతో కిడ్నీలో రాళ్లు వాస్తవమా? ఎలా? పరిష్కారమేమిటి?

టమాటాలతో కిడ్నీలో రాళ్లు వాస్తవమా? ఎలా? పరిష్కారమేమిటి?


కూరగాయాల్లో రాజు ఏదంటే వంకాయ అంటారు. కానీ ఆ వంకాయకు పోటీగా ఉండేది టమాట. ఏ కూరలోనైనా కలిసిపోయేది టమాట. అన్ని కూరల్లో కలిసిపోయి ప్రత్యేక రుచి అందించే గుణం టమాటకు ఉంది. ఈ టమాట లేనిదే ఏ వంటకం పూర్తి కావు. టమోటాలు కేవలం రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తోంది. టమాటలో విటమిన్ సీ ఏ పొటాషియం ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ రోగులకు టమటాలు చాలా మేలు చేస్తాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ వేసవిలో టమాటాలు తినడం ఆరోగ్యానికి మేలు. ఇంత ప్రాధాన్యం ఉన్న టమాటాకు ఒక దురాభిప్రాయం ఉంది. టమాటా తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయని అందరిలో భ్రమ ఉంది. ఇది వాస్తవమో కాదో తెలియదు కాని ప్రజలంతా ఈ భయంతో కొంత టమాటాను తినడం మానేస్తారు.

వాస్తవంగా టమాటా తింటే కిడ్నీ రాళ్లు పడే అవకాశం చాలా తక్కువ. కిడ్నీలో రాళ్లు ఏర్పడే రసాయనాలు టమాటాలో ఉండడంతోనే ఆ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాళ్లు ఏర్పడడానికి కారణాలు పరిశీలిస్తే ఏది వాస్తవమో.. అవాస్తవమో తెలుస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం చాలా ముఖ్యం. శరీరంలో కాలేయం నుంచి కొంత కాల్షియం ఉత్పత్తి అవుతుంది. ఎముకలు కండరాలు ఈ కాల్షియాన్ని రక్తం నుంచి గ్రహిస్తాయి. రక్తంలో ఎక్కువగా ఉండే కాల్షియం కిడ్నీల్లోకి చేరుతుంది. అవి మూత్రం ద్వారా బయటకు చేరాలి. మొతాదుకు మించిన కాల్షియాన్ని మూత్రపిండాలు విసర్జించలేవు. దీంతో ఆ కాల్షియం పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే విధానం.

టమాటా ద్వారా కిడ్నీలో రాళ్లు ఎలా అనేది చూద్దాం. కూరగాయల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది టమాటాల్లో కూడా ఉంటుంది. అయితే ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు సహకరిస్తుంది. ఈ ఆక్సలేట్ టమాటాల్లో చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి.. అది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పరచలేవు. కూరగాయాల్లో ఆక్సలేట్ ఉందని కూరగాయలు తినకుండా ఉండలేం కదా. అందుకే అన్ని కూరగాయలతో పాటు టమాటాను కూడా తీసుకోవచ్చు.

వంద గ్రాముల టమాటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. అతిగా టమాటాలు తింటే మాత్రం ఆక్సలేట్ స్థాయి పెరిగి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కిడ్నీ రాళ్ల సమస్య మూత్ర పిండ సమస్యలతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాకరం. అందుకే మూత్రపిండాల సమస్య కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు టమాటాలకు దూరంగా ఉండాలి. బీన్స్ బచ్చలికూర బీట్రూట్లో కూడా ఆక్సలేట్ ఉంటుంది. వీటిని బాగా ఉడికించి తినాలి. మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య ఉంటే రోజుకు 2 లీటర్ల నీటిని తాగండి. వైద్యుల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే వెంటనే అవి కరిగిపోతాయి.