కొందరి సెక్స్ కోరికలు భలే చిత్రంగా ఉంటాయి. ‘పోకిరీ’ సినిమాలో మంచానికి కట్టేసి కొట్టేయమన్నట్లుగా.. చాలామంది అలాంటి సెక్స్ ఫ్యాంటసీలను ఇష్టపడతారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే కోరిక కలిగింది. దీంతో ఆన్‌లైన్‌లో ఇద్దరు పురుష సెక్స్ వర్కర్లతో డీల్ కుదుర్చుకున్నాడు. కానీ, చిన్న తప్పిదంతో అది బెడిసికొట్టి కోర్టు ముందు దోషిలా నిలుచుకోవలసి వచ్చింది.
2009, జులై నెలలో ఓ వ్యక్తి ఫేస్‌బుక్ 5 వేల డాలర్లు చెల్లించి తన వింతైన సెక్స్ కోరికలు తీర్చాలంటూ ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కత్తులతో తన ఇంట్లోకి ప్రవేశించాలని, ఆ తర్వాత తనని అండర్‌వేర్‌తో మంచానికి కట్టేసి రొమాన్స్ చేయాలని కోరాడు. ఇందుకు ఆ ఇద్దరు అంగీకరించారు. దీంతో విటుడు వాళ్లకు అడ్రస్ చెప్పి.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశాడు.
విటుడు చెప్పినట్లే ఆ ఇద్దరూ కత్తులతో బయల్దేరారు. పొరపాటున వేరే ఇంట్లోకి చొరబడ్డారు. తలుపులు పగలగొట్టి లోపలకెళ్లి.. నిద్రపోతున్న ఆ ఇంటి యజమానికి ఆ కత్తులు చూపించారు. దీంతో యజమాని.. ఆ ఇద్దరు దోపిడీ వచ్చారని భయపడ్డాడు. అయితే, వాళ్లిద్దరూ తమ పక్కింటి వ్యక్తి పేరుతో పిలవడం విని.. ‘‘మీకు ఎవరు కావాలి? అని అడిగాడు’’. ‘‘అయ్యో.. క్షమించండి. ఇది మా కస్టమర్ ఇల్లు అనుకుని వచ్చేశాం, క్షమించండి’’ అని అన్నాడు. దీంతో ఆ ఇంటి యజమానికి వాళ్లు తన కోసం రాలేదని అర్థమైంది. కానీ, ఇంట్లోకి కత్తులతో చొరబడ్డారనే కారణంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలే ఈ కేసు విచారణలోకి వచ్చింది. ఈ సందర్భంగా విటుడు ఇచ్చిన అడ్రస్‌కు బదులు పొరపాటున పక్కింట్లోకి వెళ్లామని కోర్టులో చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. అన్ని వివరాలను పరిశీలిస్తే ఆ ఇద్దరూ ఉద్దేశపూర్వకంగా ఆ ఇంట్లోకి చొరబడలేదని అర్థమవుతుందని తెలిపారు. అలాగే, విటుడు కూడా వాళ్లు అలా తప్పుడు అడ్రస్‌కు వెళ్తారని ఊహించి ఉండడని, ఇందులో ఎవరి తప్పులేదని పేర్కొనడం గమనార్హం.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
