Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> డాండ్రఫ్ ను నివారించే గృహ ఔషదాలు

డాండ్రఫ్ ను నివారించే గృహ ఔషదాలు


తలపై చర్మం లేదా స్కాల్ప్ పొడి రూపంలో రాలటాన్ని చుండ్రుగా లేదా డాండ్రఫ్ గా పేర్కొంటారు. ఈ రకమైన అసౌకర్యకర రుగ్మత వలన స్కాల్ప్ దురదలకు గురవుతుంది. డాండ్రఫ్ పూర్తిగా తొలగించే ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటం విశేషం. అంతేకాకుండా, లభించే ఉత్పత్తులు కూడా చాలా ఖరీదైనవి కావటం మరొక విశేషం. ఖరీదు లేని సహజ ఔషదాలతో డాండ్రఫ్ ను తగ్గించుకోవచ్చు.

డాండ్రఫ్ ను తొలగించే శక్తివంతమైన సహజ ఔషదాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది

నిమ్మ
నిమ్మరసం వివిధ రకాల కారకాలను కలిగి ఉండి, జుట్టును తాజీకరణకు గురి చేసి, డాండ్రఫ్ ను తొలగిస్తుంది. నిమ్మ రసాన్ని సేకరించి, ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేసి, పూర్తి రాత్రి అలాఫే వదిలేయండి. తరువాత రోజు చల్లటి నీటితో జుట్టును కడిగి వేయండి. ఇలాగే కాకుండా, వేడి చేసిన రెండు భాగాల కొబ్బరి నూనెలో ఒక భాగపు నిమ్మరసం కలపండి. రోజు వెంట్రుకల మొదల్లకు మసాజ్ చేసి ఫలితాలను చూడండి.

నేచురల్ ఆయిల్ ట్రీట్మెంట్
ఒక చెంచా క్యాంఫర్ ఆయిల్ లో సగం కప్పు కొబ్బరి లేదా వేప నూనెను కలపండి. ఈ నూనెను స్కాల్ప్ కు మసాజ్ చేసి, పూర్తి రాత్రి అలాగే ఉంచండి. తరువాత ఉదయాన కడగండి. అంతేకాకుండా, ఒక చెంచా క్యాస్టర్ ఆయిల్ కు ఆవ లేదా కొబ్బరి నూనెను కలిపి స్కాల్ప్ కు మసాజ్ చేయండి. ఇలా పూర్తి రాత్రి ఉంచి, మరుసటి రోజు కడిగి వేయండి.

ఉసిరి
ఉసిరి నుండి తీసిన నూనెను తలపై చర్మానికి మసాజ్ చేయండి. తరువాత వేడిగా ఉండే టవల్ తో తలకు చుట్టండి. ఇలా 30 నిమిషాల పాటూ ఉంచిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగివేయండి.

వెనిగర్
వెంట్రుకలలో pH స్థాయిలను సరిచేసి అందుబాటులో ఉన్న అద్భుతమైన మార్గంగా వెనిగర్ చికిత్స పేర్కొనవచ్చు. ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు పరిశుద్ధమైన నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు స్కాల్ప్ కు మసాజ్ చేయండి. పూర్తి రాత్రి అలాగే ఉంచి మరుసటి రోజు వైద్య గుణాలు కలిగిన షాంపూతో కడిగి వేయండి.