సెలబ్రిటీల బరువు తగ్గించే రహస్యాలు

0

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బరువును నిర్వహించటం తప్పని సరి, కొన్ని తెలివైన ఆలోచనలు మరియు ఇక్కడ తెలిపిన రహస్యాల ద్వారా మీ బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.

1 మంచి నిద్ర
అటూ ఎక్కువ సమయం లేదా అతి తక్కువ సమయం కూడా పడుకోవటం మంచిది కాదని “క్యుబెక్ లవాల్ యూనివర్సిటీ” వారు జరిపిన పరిశోధనలలో తెలిపారు. రోజులో 7 నుండి 8 గంటల సమయం పాటూ పడుకునే వారితో పోలిస్తే, 8 గంటల కంటే ఎక్కువ సమయం పడుకునే వారు మరియు 6 గంటల సమయం కంటే తక్కువ పడుకునే వారు శరీర బరువు పెరుగుతారని ఈ పరిశోధనలలో వెల్లడించారు.

2 ఎక్కువ సమయం నడవట
రోజు ఉదయాన లేసి వ్యాయామాలు చేసే సమయం లేని వారు, ఒక పీడోమీటర్ కొనిక్కొని,, రోజు దాదాపు 10,000 అడుగుల నడవటం వలన 100 కెలోరీలు కరిగించిన వారవుతారు. ఇలా చేయటం వలన సంవత్సర కాలంలో 10 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉంది.

3 ఎక్కువగా నీటిని తాగటం
ఎక్కువగా నీటిని తాగటం వలన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువగా నీటిని తాగాక పోవటం వలన కాలేయం మరియు కిడ్నీల పై భారం పడుతుంది. ఎలాగంటే, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాల ద్వారా శక్తిని తయారు చేసి నిల్వ ఉంచటం కాలేయం విధి. నీటిని తాగని ఎడల రెండు కీలక అవయవాల విధిలో లోపాలు ఏర్పడతాయి. కావున దాహంగా ఉన్న లేకున్న సరైన స్థాయిలో నీటిని తాగండి.

4 గ్రీన్ టీ తాగండి
శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలలో 35 నుండి 43 శాతం వరకు కొవ్వు పదార్థాలను రోజు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ తాగటం ద్వారా కరిగించుకోవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. గ్రీన్ టీ చేసే సమయం మీకు లేకుంటే, గ్రీన్ సప్లిమెంట్ లను తీసుకున్న సరిపోతుంది.

5 ఆహారాన్ని ఎక్కువ సమయం పాటూ నమలండి
నెమ్మదిగా తినండి, మీరు అధికంగా తిన్న తరువాత కొన్ని నిమిషాల వరకు కూడా మన శరీరం గుర్తించదు. కావున మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని కనీసం 8 నుండి 12 సార్లు నమలాలి. ఇలా చేయటం వలన తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవును.