శృంగారం విషయంలో ఆడవారు ఇలానే ఆలోచిస్తారు..

0

జీవరాశులకి ఆకలి, దప్పికలు ఎలాంటివో శృంగారం కూడా అంతే ముఖ్యం. ప్రతీ ఒక్కరికీ ఇది అవసరమే. ఇది కొన్ని క్షణాల పాటు ఆనందాన్ని ఇవ్వడమేగా అనుకుంటాం.. కానీ, ఆనందమే కాదు.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.. అలాంటి శృంగారం విషయంలో నేటి కాలం మహిళలు ఏం ఆలోచిస్తున్నారో అన్న విషయం గురించి చెబుతున్నారు…

​ముందుకాలంలోనే బెటర్..

శృంగారం అంటే అదేం అంత పెద్ద బూతు పదం కాదు.. అన్ని పనులు ఎలానో శృంగారం కూడా అలానే.. దీన్ని ఎంజాయ్ చేయాలి. నిజానికీ.. ఈ విషయంపై ఈ మధ్యకాలంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దీన్ని చేయడం వల్ల ఎన్ని లాభాలో తెలుసుకుంటున్నారు. కానీ, ఓ రకంగా చెప్పాలంటే ఈ విషయాలు ఏం తెలియని వెనకటి కాలంలోనే చాలా ఈ పనిని ఎక్కువగా ఎంజాయ్ చేసేవారు. ఎప్పుడూ ఏం చేయాలో వారికే ఎక్కువగా తెలిసేది. అలా చేసేవారు. అందుకే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. హ్యాపీగా ఉండేవారు.

​శృంగారం గురించి ఈ కాలంలో..

అయితే, ఈ కాలంలో అసలు ఎవరూ కూడా సెక్స్‌ని ఎంజాయ్ చేయట్లేదని పరిశోధనలు చెబుతున్నాయి. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల అసలు ఆ పని అంటే ఏదో తూతూ కార్యంగా చేస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతున్నాయి. ఇక ఇదే విషయంలో మహిళల తీరు కూడా మారుతుందట. ఈ విషయాన్ని వారు రోజుకో విధంగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు పరిశోధకులు…చాలా మంది భార్యభర్తలు ఆ పని ఏదో చేయాలంటే చేయాలని చూస్తున్నారే తప్పా ఇష్టంగా చేయట్లేదు..

​ప్రేమ కూడా ముఖ్యమే..

నేటి మహిళల్లో చాలా మంది తమ భర్తలతో శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని ఇటీవలి కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. భార్య భర్తలు సెక్స్ అంటే కలయిక మాత్రమే కాదని ప్రేమ, అభిమానంతో కూడినప్పుడే ఇది బాగుంటుందని అయితే, నేటి బిజీ లైఫ్‌లో భార్యాభర్తల మధ్య కాసేపు మాట్లాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం వంటి ప్రేమకి సంబంధించినవి ఏమీ లేవు.. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు. దీంతో మహిళలు సెక్స్ విషయంలో విసిగిపోయారని.. తమతో ప్రేమగా, అప్యాయంగా ఉండట్లేదని విసుగు చెందుతున్నారని తేలింది. ఈ కారణంగానే ఒకరిపై ఒకరికి ఇష్టం తగ్గడం అసహనం, అయిష్టం పెరగడం.. ఇది చివరికీ విడిపోవడం, అక్రమసంబంధాలకు దారి తీస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఈ విషయంలో పురుష పుంగవులు మేల్కోవాలని లేకపోతే సంసారంలో అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

​మహిళలు ఏం కోరుకుంటారంటే..

అదే విధంగా మగవారు ఎక్కువగా మహిళలు బాడీ ఫిట్‌గా ఉండడాన్ని, డబ్బు ఉండడాన్ని ఇష్టపడతారని మగవారు భావిస్తారని చెబుతారు. కానీ, ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు. కానీ మహిళలకి శరీరం ముఖ్యం కాదని.. ప్రేమతో తమ మనసుని గెలిస్తే వారంతట వారే మగవారికే దాసోహం అంటారని చెబుతున్నారు. అయితే ఏదో నాటకపు ప్రేమలు కాకుండా చూపించే ప్రేమలోనూ నిజాయితీ ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఆడవారి మనసుని గెలవడానికి ప్రేమకు మించిన మరో అస్త్రం లేదని చెబుతున్నారు.

​మగవారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి..

ప్రేమ, అనురాగం తగ్గకుండా తమని సుఖపడుతూ వారు కూడా సుఖపడొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వారికి ఎంతటి అందగత్తెలైనా దాసోహం అని చెబుతున్నారు. మరి ఇంకేంటి మగమహారాజులు మీ ప్రేమని ఆమెకి వ్యక్తపరిచి మీ లైఫ్‌ని మరింత అందంగా మార్చుకోండి. హ్యాపీగా ఉండండి అంటూ సలహాలిచ్చేస్తున్నారు.