పొట్టిగా ఉన్న అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా అందుకే ఇష్టపడతారు..

0

చాలా మంది అమ్మాయిలు పొట్టిగా ఉన్నామంటూ బాధపడుతుంటారు. దీన్ని కవర్ చేసేందుకు హీల్స్, హై హీల్స్ వేస్తూ తెగ మ్యానేజ్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే.. పొడువుగా ఉన్న అమ్మాయిలతో పోలిస్తే పొట్టిగా ఉన్న అమ్మాయిలనే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.

​అధ్యయనాల ప్రకారం..

అవును నిజమే.. ఓ సర్వే ప్రకారం అబ్బాయిలు ఎక్కువగా పొట్టిగా ఉన్న అమ్మాయిలను ఇష్టపడతారని తేలింది. ఇటీవల చేపట్టిన అధ్యయనంలో కొంత మంది పురుషులను పొడవు ఉన్న అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడతారా.. పొట్టిగా ఉన్న అమ్మాయిలనా అడగ్గా.. ఎక్కువ మంది అబ్బాయిల తక్కువ హైట్ ఉన్నవారినే ఇష్టపడతామని తెలిపారట.

​కారణాలు ఏంటంటే..

హైట్ తక్కువగా ఉన్న అమ్మాయిలను పురుషులు ఓ రకంగా టెడ్డీ బేర్‌గా అనుకుంటారట. తమ పార్టనర్స్ పొట్టిగా ఉంటే ఏం చక్కగా హగ్ చేసుకోవచ్చని వారి లాజిక్ అంట. పొట్టిగా ఉన్నవాళ్లు క్యూట్‌గా కనిపిస్తారని చెప్పారు. పొట్టిగా ఉన్నవారికి ఎలాంటి డ్రెసెస్ వేసినా అందంగా కనిపిస్తారు. ఏ డ్రెస్ అయినా వీరికి బాగా నప్పుతుందట. కొంచెం రెడీ అయితే చాలు వీరు త్వరగా అందంగా కనిపిస్తారట..

​అలిగినా అందమే..

పొట్టిగా ఉన్న మహిళలు అలిగినా, కోపంగా ఉన్న కూడా చాలా అందంగా ఉంటారని పురుషులు చెబుతున్నారు. అలిగినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు వారిని చిన్నపిల్లల్లా దగ్గరికి తీసుకుని బుజ్జగించొచ్చని చెబుతున్నారు. పొట్టిగా మహిళల తల పురుషుడి హృదయాలకు తగిలేలా ఉంటుంది. ఈ సమయంలో వారి బుగ్గలను గట్టిగా పట్టుకుని కౌగిలింతల్లో ముంచేస్తారట.. ఈ ప్రక్రియ మగవారితో మహిళలు కూడా బాగా ఇష్టపడతారట.

​మానసికంగా దృఢంగా..

పొడవు తక్కువ అయితేనేం.. ఇలాంటి మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారట.. ఎలాంటి సమస్యలకు భయపడరని.. ఎలాంటి సందర్భాల్లోనైనా ధైర్యంగా మాట్లాడడమే కాకుండా.. ఏ పరిస్థితులనైనా తట్టుకునే ఓపిక ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.

​ఆ విషయంలోనూ..

పొట్టిగా ఉన్న మహిళలతో రొమాన్స్ చేయడానికి కూడా పురుషులు ఎక్కువగా ఇష్టపడతారట.. కలయిక సమయంలో ఎలా ఉండాలో మగవారికి బాగా తెలుసు. హైట్ తక్కువగా ఉన్న అమ్మాయిలతో రొమాన్స్‌ని మగవారు ఎక్కువగా ఇష్టపడతారట. అయితే ఇప్పుడే చెబుతుంది కాదు.. కామసూత్రంలోనూ దీని ప్రస్తవాన ఉన్నట్లు కొంతమంది చెబుతున్నారు.

​బాధ వద్దు..

పొట్టిగా ఉన్నవారికి ఎన్నో అడ్వాంటేజేస్ ఉన్నాయి కాబట్టి దాని గురించి బాధపడొద్దు. సమస్యను కవర్ చేసుకునేందుకు హైహీల్స్ వేసుకోవడం, ఇబ్బందులు పడడం వంటి సమస్యలను ఎదుర్కోవద్దు. అది పెద్ద సమస్య అని ఫీల్ అవ్వొద్దని చెబుతున్నారు నిపుణులు. తక్కువగా హైట్ ఉన్నవారు నడక, ప్రవర్తన విధానం కూడా మగవారిని ఎక్కువగా ఆకర్షిస్తుందని చెబుతున్నారు. సో.. తక్కువగా హైట్ ఉన్నవారు ఎక్కువగా ఫీల్ అవ్వొద్దని చెబుతున్నారు.

​ఎన్నో ఆప్షన్స్..

సాధారణంగా హైట్ ఎక్కువగా ఉన్నవారికంటే తక్కువగా హైట్ ఉన్నవారికి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. అంతే కాదు, డ్రెస్సెస్ నుంచి చెప్పుల వరకూ వీరూ వేటినైనా వేసుకోవచ్చు. అందంగా రెడీ అవ్వొచ్చు. అదే హైట్ ఎక్కువగా ఉన్న వారు హీల్స్ వేసుకోలేరు. కొన్ని డ్రెసెస్ వేసుకోలేరు. వీరిని నిరుత్సాహ పరచడం కాదు. పొట్టిగా ఉన్నవారితో పోల్చితే వీరికి తక్కువ అకాశాలు ఉంటాయి.. ఈ విషయాన్ని మీరూ కూడా గమనించే ఉంటారు.