 నటీనటులు : నిఖిల్ సిద్దార్ధ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య, పోసాని, నాగినీడు, ప్రగతి,విద్యుల్లేఖ,తరుణ్ అరోరా తదితరులు.
నటీనటులు : నిఖిల్ సిద్దార్ధ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య, పోసాని, నాగినీడు, ప్రగతి,విద్యుల్లేఖ,తరుణ్ అరోరా తదితరులు.
దర్శకత్వం : సంతోష్ టి ఎన్
నిర్మాతలు : రాజ్ కుమార్ ఆకెళ్ళ, వేణు గోపాల్ కావియా
సంగీతం : శ్యామ్ సి ఎస్
సినిమాటోగ్రఫర్ : సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
నిఖిల్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా టి.సంతోష్ దర్శకత్వం వహించిన సినిమా ‘అర్జున్ సురవరం’. ఈ సినిమాను బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) టీవీ 99లో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ.. బీబీసీ ఛానల్ లో జర్నలిస్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అంతలో కావ్య (లావణ్య త్రిపాఠి)తో పరిచయం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అయితే రిస్క్ చేసి మరి సెన్సేషనల్ న్యూస్ ను బ్రేక్ చేసే అర్జున్ లైఫే, బ్రేకింగ్ న్యూస్ అవుతోంది. తనకు తెలియకుండానే అర్జున్ అనూహ్యంగా ఓ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుండి బయటపడటానికి చేసే ప్రయత్నాల క్రమంలో ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే మాఫియా గురించి.. తను ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా వాళ్లే అని తెలుసుకుంటాడు. అసలు అర్జున్ కి తెలియకుండా అతన్ని కేసులో ఎలా ఇరికించారు ? ఏ ఆధారాలతో అర్జున్ దోషిగా కోర్టు తేల్చింది? ఫేక్ సర్టిఫికెట్స్ మాఫియాకు అర్జున్ కేసుకు సంబంధం ఏమిటి ? మరి అర్జున్ ఈ మాఫియాని ఎలా పట్టించాడు? అందుకు లావణ్య పాత్ర ఎలాంటి సహాయ సహకారాలు అందించింది? చివరికీ అర్జున్ తానూ నిరపరాధిని ఎలా నిరూపించున్నాడు ?లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నిఖిల్ తన గత చిత్రాలు లాగానే ’ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో ఓ మంచి పాయింట్ తో అర్జున్ సురవరంగా వచ్చాడు. ఈ సినిమాలో నిఖిల్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ఇక యంగ్ జర్నలిస్ట్ గా నిఖిల్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. నిఖిల్, లావణ్య మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.
ఇక దర్శకుడు సంతోష్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య, విలన్ గ్యాంగ్ మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్ గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తమ్మీద ఎంటర్టైన్మెంట్ తో దొంగ సర్టిఫికెట్స్ దందాకి సంబంధించిన సీన్స్ తో ప్లే క్యూరియాసిటీతో సాగుతుంది. ఇంటర్వెట్ ముందు కథ కొంచెం వేగంగా సాగుతూ సెకెండాఫ్ మీద కొంత ఇంట్రస్ట్ పెంచుతుంది.
ఇక సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో, హీరో రివీల్ చేసే పెయిన్ ఫుల్ కంటెంట్ తో వచ్చే సీన్స్ లో దర్శకుడు హార్డ్ వర్క్ కనిపిస్తుంది. మన వ్యవస్థలోని అవినీతిని, మన సిస్టమ్ లోని లోసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నే ప్రయత్నం చేసింది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో స్టోరీ పాయింట్ చాల బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ మాస్ మసాలా మూవీలా మరీ లాజిక్స్ లేకుండా సాగడం.. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు ఇప్పుటి సమాజంలో ఎంతవరకు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో చూపించినట్లు అంతదారుణమైన పరిస్థితులు ఈ డిజిటల్ విప్లవంలో బయట ఎక్కడా మనకు కనిపించవు.
సినిమాలో మంచి సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాల చోట్ల కొంత స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ మరియు హీరో అలోచించే సమస్యల గురించి, వాటి కోసం హీరో చేసే పనులు మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. పైగా ఫస్ట్ హాఫ్ అంతా స్పీడుగా ఎంటర్ టైన్ గా సెకెండ్ హాఫ్ ఉండదు. హీరోయిన్ పాత్ర కూడా, హీరోను ప్రేమించటానికి, హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాటినికి తప్ప ఆమె పాత్ర బలంగా అనిపించదు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే .. దర్శకుడు సంతోష్ కమర్షియల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ చివరకి రెగ్యులర్ కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ బావుంది గాని, సినిమాలో చాల చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
సంగీతం విషయానికి వస్తే.. పాటలు ఫర్వాలేదనిపిస్తే, నేపథ్య సంగీతం బాగుంది.సినిమాటోగ్రఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
తీర్పు :
మంచి సోషల్ మెసేజ్ పాయింట్ తో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో అర్జున్ సురవరంగా వచ్చిన నిఖిల్.. తన లుక్స్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మెసేజ్ తో కూడుకున్న మెయిన్ స్టోరీ ఐడియా, అలాగే ఇన్వెస్టిగేట్ కి సంబంధించిన ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు వెన్నెల కిషోర్ – సత్య, విలన్ గ్యాంగ్ ల మధ్య సాగే కామెడీ సన్నివేశాలు చాల బాగున్నాయి. అయితే కీలక సన్నివేశాల్లో చాల చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, స్క్రీన్ ప్లే పరంగా వెరీ రొటీన్ గానే సాగడం సినిమా బలహీనతలుగా నిలుస్తాయి. సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీయకుండా, ప్రేమ కథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. మొత్తం మీద ఈ చిత్రం సామాజిక పరంగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. అలాగే సినిమా కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంటుంది.
అర్జున్ సురవరం రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 3.75
నటీ-నటుల ప్రతిభ - 4
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3.5
3.6
అర్జున్ సురవరం రివ్యూ
అర్జున్ సురవరం రివ్యూ
 TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
				



 
											 
							