Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ప్రెగ్నెన్సీ టైమ్‌లో యూరిన్ ఈ కలర్ వస్తే మంచిది కాదు..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో యూరిన్ ఈ కలర్ వస్తే మంచిది కాదు..


నీరు ప్రతి జీవికీ ప్రాణావసరం. మన శరీరంలో అరవై శాతం నీరే ఉంటుంది. మన బరువు లో కూడా అధిక భాగం నీరే. నీరు మన శరీరం నుంచి టాక్సిన్స్‌ని బయటికి పంపుతుంది, బాడీ టెంపరేచర్ ని మెయింటెయిన్ చేస్తుంది. బ్రెయిన్ సరిగ్గా పని చేయడానికి సహకరిస్తుంది… సింపుల్ గా చెప్పాలంటే మనని బతికిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైం లో మీరు తీసుకునే నీరు పుట్టబోయే పిల్లలకి పోషకాలని అందిస్తుంది, ఉమ్మనీరు కావాల్సినంత ఉండేలా చూస్తుంది, మలబద్ధకం రాకుండా చేస్తుంది. అందుకే, ప్రెగ్నెన్సీ టైమ్‌లో నీరు బాగా తాగాలి.

గర్భిణీలు ఎంతనీరు..

మామూలుగా ప్రతి రోజూ అందరూ కనీసం రెండు లీటర్లు, అంటే ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలి . ఇందులోనే కొబ్బరి నీరు, జ్యూసులు, మజ్జిగ, మనం తినే ఆహారంలో ఉండే నీరూ.. అన్ని వస్తాయి. సుమారుగా ఏడో నెల దాటేవరకూ మీరు మామూలుగానే నీరు తాగొచ్చు. తర్వాత మాత్రం ఒక అరలీటరు ఎక్కువ తాగితే మంచిది. అయితే, మీరు అధిక బరువు ఉన్నా, ఎక్కువగా ఆహారం తీసుకుంటున్నా ఇంకా నీరు ఎక్కువ తాగాలి. ప్రెగ్నెన్సీ టైమ్‌లో నీరు సరిపడినంత తాగకపోతే మాత్రం మీకూ, మీ బిడ్డకీ కూడా అది మంచిది కాదు.

మీరు ఎక్కువ నీరే తాగుతున్నారని మీరు అనుకున్నా.. ఒక్కోసారి సరిపోకపోవచ్చు. దీనికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది. మీ యూరిన్ ఏ కలర్ లో ఉందో గమనించండి. అది డార్క్ యెల్లో కలర్‌లో ఉంటే మీకు నీరు సరిపోవట్లేదు. ఇంకా తాగాలి. దీనితో పాటూ మీకు అలసట గా అనిపిస్తున్నా, దాహం ఎక్కువగా వేస్తున్నా కూడా మీరు ఎక్కువ నీరు తాగాలని గుర్తుపెట్టుకోండి.