 ఈ మధ్యకాలంలో పిల్లలకు ఇంటర్నెట్ తో స్నేహం విపరీతంగా పెరిగిపోయింది. అందుకు ప్రస్తుత పరిస్థితులు కూడా హెల్ప్ చేస్తున్నాయి. ఇదివరకైనా స్క్రీన్ టైంను లిమిట్ చేసేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఉండేది. ప్రస్తుతం చాలామటుకు ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ లోనే సాగడంతో పిల్లల రొటీన్ లో ఇంటర్నెట్ అనేది ముఖ్యమైన రోల్ ప్లే చేస్తోంది. పిల్లలకు నిజానికి ఇంటర్నెట్ సేఫెస్ట్ ప్లేస్ కాదు. అనేక రిపోర్ట్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో పిల్లలకు ఇంటర్నెట్ తో స్నేహం విపరీతంగా పెరిగిపోయింది. అందుకు ప్రస్తుత పరిస్థితులు కూడా హెల్ప్ చేస్తున్నాయి. ఇదివరకైనా స్క్రీన్ టైంను లిమిట్ చేసేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఉండేది. ప్రస్తుతం చాలామటుకు ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ లోనే సాగడంతో పిల్లల రొటీన్ లో ఇంటర్నెట్ అనేది ముఖ్యమైన రోల్ ప్లే చేస్తోంది. పిల్లలకు నిజానికి ఇంటర్నెట్ సేఫెస్ట్ ప్లేస్ కాదు. అనేక రిపోర్ట్స్ ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి.
ఈ లాక్ డౌన్ పీరియడ్ లో “చైల్డ్ పోర్న్” కి సంబంధించిన సెర్చ్ లు కూడా విపరీతంగా పెరిగిపోయాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సైబర్ బుల్లీయింగ్, సైబర్ షేమింగ్ వంటి ఇన్సిడెంట్స్ కూడా ఎన్నో వార్తల్లో హైలైట్ అవుతున్నాయి. వీటికి తోడు ఇంటర్నెట్ ఫ్రాడ్స్ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి వల్ల ఇంటర్నెట్ అనేది పిల్లలకు సురక్షితం కాదని గుర్తించాలి.
ఈ మధ్యకాలంలో రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు కూడా మొబైల్ ను ఆపరేట్ చేస్తున్నారు కూడా. ట్వీన్స్ తో పాటు టీన్స్ కు రిస్క్ ఎక్కువ. వారి ఇంటర్నెట్ యూసేజ్ ను తల్లిదండ్రులు మానిటర్ చేయాలి. అదే సమయంలో చిన్నారులు ఇంటర్నెట్ ద్వారా ఏం తెలుసుకుంటున్నారన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి మీ మొబైల్‌ని, ఏదైనా గాడ్జెట్ ను వారికి అందించేటప్పుడు వారిని కొన్ని రూల్స్ ను పాటించమని చెప్పాలి. ఇంటర్నెట్ సేఫ్టీ రూల్స్ గురించి వారికి తెలియచేసి ఆ రూల్స్ ను మీ చిన్నారులు పాటించేలా ఎంకరేజ్ చేయాలి.
6 ముఖ్యమైన ఇంటర్నెట్ సేఫ్టీ రూల్స్..
1. బ్రౌజింగ్ టైమ్ ను సెట్ చేయండి:
మీ చిన్నారుల సేఫ్టీ కోసం మీరు ఈ డెసిషన్ ను ఇంప్లిమెంట్ చేయాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో వారు ఇంటర్నెట్ ను ఉపయోగించే అవకాశం ఇవ్వకూడదు. ఒక టైమ్ ను ఫిక్స్ చేయండి. ఆ టైమ్లోనే చిన్నారులు డిజిటల్ వరల్డ్ లో సమయాన్ని స్పెండ్ చేసేలా జాగ్రత్త తీసుకోండి. ఈ మధ్యకాలంలో “చైల్డ్ ఫిల్టర్” అలాగే “టైమర్” అనే ఆప్షన్స్ తో ఎన్నో యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి పిల్లల్లో సేఫ్ బ్రౌజింగ్ హ్యాబిట్స్ ను ఎంకరేజ్ చేస్తాయి. ఒకవేళ వారికి స్మార్ట్ ఫోన్ ఉన్నా లేదా వారు సోషల్ మీడియాలో ఖాతాలున్నా మీరు ఫిక్స్ చేసిన సమయంలోనే వారు ఇంటర్నెట్ ను ఉపయోగించగలుగుతారని క్లియర్ గా చెప్పండి.
2. సోషల్ మీడియాలో ప్రైవసీ..
టీనేజర్ ను సోషల్ మీడియాలో ప్రొఫైల్ లేకుండా మీరు అడ్డుకోనవసరం లేదు. హ్యాకింగ్ తో పాటు ఆన్లైన్ లో జరిగే కొన్ని మోసాల గురించి వారికర్థమయ్యేలా చెప్పండి. సోషల్ మీడియాలో మీ చిన్నారులు ఎవరితో ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఎటువంటి పోస్ట్ లు, ఫోటోలు అలాగే మెసేజెస్ మీ చిన్నారులకు రీచవుతున్నాయి వంటి విషయాలపట్ల మీరు అప్డేటెడ్ గా ఉండండి. దీని వలన ఆన్లైన్ లో మీ పిల్లలు ఎవరితో టచ్ లో ఉన్నారన్న విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. ఎటువంటి అప్డేట్స్ చిన్నారులకు చేరతాయో గమనించేందుకు మీకు ఛాన్స్ ఉంటుంది.
3. ప్రైవేట్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను షేర్ వద్దు..
ఆన్లైన్లో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి పిల్లలకు అవగాహన కల్పించండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ను ఆన్లైన్ లో షేర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకూడదు అన్న విషయాల గురించి మీ చిన్నారులకు చెప్పండి. వారు ఆన్లైన్ లో షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ను గమనించి వారికి తగిన విధంగా గైడెన్స్ ఇవ్వండి. ఆన్లైన్ లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది కాదని చెప్పండి. చాలా సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేవి హ్యాకింగ్ కు పాల్పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇవి చిన్నపిల్లలను టార్గెట్ చేస్తాయి. కాబట్టి, అడ్రస్, స్కూల్ పేరు వంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ను ఆన్లైన్ లో షేర్ చేయకూడదని చిన్నారులకు చెప్పండి. వారేదైనా ఆన్లైన్ లో పోస్ట్ చేసే ముందు మీ అప్రూవల్ తీసుకోవాలని ముందుగా చెప్పండి. ఒకవేళ ఏదైనా పోస్ట్ చేసినా వెంటనే మీతో షేర్ చేసుకోవాలని చెప్పండి.
4. పాస్వర్డ్స్ ను షేర్ చేయకూడదని చెప్పండి:
పిల్లల్లో సహజంగా తమకు సంబంధించిన సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. తమ స్నేహితులతో అలాగే పీర్స్ తో వారు పాస్వర్డ్స్ ను అలాగే ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐతే, ఇలా చేయకూడదన్న విషయాన్ని మీ చిన్నారులకు చెప్పండి. ఇలా చేయడం వలన ఎన్నో ఇబ్బందులు వస్తాయని చెప్పండి. ఆన్లైన్ లో ఇలా పెర్సనల్ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయడం రిస్క్ అని చెబుతూ సైబర్ బుల్లీయింగ్ అలాగే ట్రోలింగ్స్ ను కూడా ఫేస్ చేయవలసి వస్తుందని చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పండి. తల్లిదండ్రులు పిల్లలు ఆన్లైన్ లో యాక్సెస్ చేసే వాటికి 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ను సెట్ చేయాలి.
5. ట్రస్టెడ్ ఇంటర్నెట్ సోర్స్ నే వాడమని చెప్పండి:
ఇంట్లో గానివ్వండి లేదా బయటగానివ్వండి, నమ్మశక్యంగా ఉన్న ఇంటర్నెట్ సర్వీసెస్ నే వాడాలన్న విషయాన్ని చిన్నారులకు చెప్పండి. పాస్వర్డ్ తో లాగినై బ్రౌజ్ చేయగలిగే ఇంటర్నెట్ సర్వీసెస్ ను వాడటానికే ప్రిఫరెన్స్ ఇవ్వమని పిల్లలను ఎంకరేజ్ చేయండి. ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ ఐన యాప్స్ ను అలాగే వెబ్సైట్స్ ను మాత్రమే వాడమని పిల్లలకు సూచించండి. అలాగే అడల్ట్ అలాగే మెచ్యూర్డ్ కంటెంట్ పిల్లలకు అందుబాటులో లేకుండా ఫిల్టర్స్ లేదా ప్రత్యేకమైన సర్వీసెస్ ను ఉపయోగించండి.
6. బాధ్యతగా ఉండమని చెప్పండి:
సైబర్ బుల్లీయింగ్ కి సంబంధించిన డేంజర్స్ నుంచి మీ పిల్లలను మీరు రక్షించుకోవాలంటే మీ పిల్లలు కూడా బుల్లీయింగ్ అలాగే ట్రోలింగ్ వంటి ఇన్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్తపడాలి. పీర్ ప్రెజర్ వలన చిన్నారులు వీటిలో ఇన్వాల్వ్ అయ్యే ప్రమాదం ఎక్కువ. నెగటివ్ కామెంట్స్ చేయడానికి ముందడుగు వేసే అవకాశం ఉంది. ఐతే, మీరు వారికి వీటితో అనుసంధానమై ఉన్న రిస్క్ ల గురించి చెప్పండి. ఏదైనా నెగటివ్ కామెంట్ వస్తే పట్టించుకోవద్దని చెప్పండి. రిప్లై చేసి వాదనలలోకి దిగవద్దని వివరించండి. నెగటివిటీకు వీలైనంత దూరంగా ఉండమని చెప్పండి.
పిల్లలకు ఇంటర్నెట్ సేఫ్టీ రూల్స్ ను చెప్పడం వలన వారికి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అలవాటవుతుంది. ఇంటర్నెట్ ను ఎంతవరకు వాడాలో అంతవరకే వాడడం కూడా వారికి తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ అడిక్షన్ కూడా తగ్గుతుంది.
 TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
				



 
											 
											