Home / LIFESTYLE / వామ్మో కాటన్ బాల్స్ ‌ని ఇలా కూడా వాడొచ్చా..

వామ్మో కాటన్ బాల్స్ ‌ని ఇలా కూడా వాడొచ్చా..

మన లైఫ్ అనేది సజావుగా ముందుకు సాగిపోవాలంటే కొన్ని హ్యక్స్ తో పాటు కొన్ని ట్రిక్స్ మనకు తెలిసుండాలి. ప్రతిరోజూ వాడే వస్తువులతో మీరు ఎన్నో ఇంటరెస్టింగ్ పనులను చేయవచ్చు. ఈ లైఫ్ హ్యక్స్ అనేవి మీకు ఎంతో సమయాన్ని అదే సమయంలో రిసోర్సెస్ ను కూడా ఆదాచేస్తాయి. ఈరోజు కాటన్ బాల్ ను వివిధ రకాలుగా ఉపయోగించే పద్దతుల గురించి తెలుసుకుందాం.

1. పెర్ఫ్యూమ్ బాటిల్ కి బదులుగా కాటన్ బాల్ ను వాడొచ్చన్న విషయం మీకు తెలుసా? ఒకవేళ మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. పెర్ఫ్యూమ్ బాటిల్ ను తీసుకుని వెళ్లకుండా ఆల్టర్నేటివ్ కోసం మీరు ఆలోచిస్తున్నారు. అప్పుడేం చేయాలంటే, కొన్ని చుక్కల పెర్ఫ్యూమ్ ను కాటన్ బాల్స్ పై వేయండి. వాటిని జిప్ పౌచ్ లో పెట్టండి. ఎప్పుడైతే మీకు టచప్ అవసరమని అనిపిస్తుందో అప్పుడు కాటన్ బాల్ ను తీసుకుని మెడదగ్గర అలాగే అండర్ అర్మ్స్ లో ఉపయోగించండి. సో సింపుల్.

2. అదే విధంగా, మీరు ఇంట్లోని ప్రతి కార్నర్ ను కూడా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. కొన్ని కాటన్ బాల్స్ ను మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ లో ముంచి వీటిని ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నెని కార్నర్స్ లో ఉంచండి. మీరు కావాలంటే కొన్ని చుక్కల వెనిలా ఎక్స్ట్రాక్ట్ ను కూడా కాటన్ బాల్ పై పోసి దాన్ని మీ బట్టలున్న కప్ బోర్డులో ఉంచండి. మీ బట్టలు పరిమళాలను వెదచల్లుతాయంటే నమ్మండి.

3. మీ పెర్ఫ్యూమ్ లాగానే మీ మేకప్ ను కూడా ప్యాక్ చేసుకోవడానికి కాటన్ బాల్స్ హెల్ప్ చేస్తాయి. మీ ఫేవరేట్ బ్రాంజర్, బ్లష్ తదితరాలను కాటన్ బాల్ తో రుద్దండి. ఈ కాటన్ బాల్స్ ను జిప్ బ్యాగ్ లో పెట్టండి. మీరెక్కడికి వీలయితే అక్కడికి వీటిని తీసుకెళ్లవచ్చు. హ్యాపీగా టచప్ చేసుకోవచ్చు.

4. కాళ్ళు బొబ్బలెక్కకుండా ప్రొటెక్ట్ చేసేందుకు కూడా కాటన్ బాల్స్ హెల్ప్ చేస్తాయి. ఫుట్ వేర్ ధరించినప్పుడు ఏ ప్రదేశంలో ఐతే ఒత్తిడి పడి బొబ్బలెక్కే అవకాశముందో గమనించి అక్కడ కాటన్ బాల్స్ ను అమర్చండి. దీని వలన కాళ్ళు బొబ్బలెక్కే సమస్య ఎదురయ్యే అవకాశం తక్కువ.

5. మీరు మీ నగలను ఎక్కడికైనా తీసుకెళ్లాలని భావిస్తే వాటికి కాటన్ బాల్స్ తో రక్షణను ఇవ్వవచ్చు. కుషన్ లా కాటన్ బాల్స్ తో ప్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేస్తే నగలు విరిగిపోవు. వాటి నాణ్యత దెబ్బతినదు.

6. అలాగే, మీ రబ్బర్ గ్లోవ్స్ లైఫ్ స్పాన్ ను కాటన్ బాల్ తో పొడిగించవచ్చు. ఫింగర్ టిప్స్ వద్ద కొన్ని కాటన్ బాల్స్ ను అమర్చి పని కానిస్తే సరి. ఈ విధంగా రబ్బర్ గ్లోవ్స్ చిరిగిపోయే ప్రమాదం తగ్గుతుంది.

7. షర్ట్ పై ఇంకు మరకలు పడ్డాయా? కంగారు పడకండి. కాటన్ బాల్ ను ఆల్కహాల్ సొల్యూషన్ లో ముంచి దాన్ని ఇంకు మరకలు పడిన ప్రదేశంపై సున్నితంగా రుద్దండి. మారక మటుమాయమవుతుంది.

8. కీబోర్డ్లు అలాగే టీవీ రిమోట్స్ ను శుభ్రపరచడం తలనొప్పి పనా? ఐతే, ఈ హ్యాక్ మీ కోసమే. ఆల్కహాల్ సొల్యూషన్ లో ముంచిన కాటన్ బాల్ తో కీబోర్డ్ కీస్ ను అలాగే రిమోట్ బటన్లను ఈజీగా క్లీన్ చేయవచ్చు.

9. స్కిన్ పై పెర్మనెంట్ మార్కర్ గుర్తులను తొలగించాలా? ఇంట్లో ఆల్కహాల్ సొల్యూషన్ లేదా? డోంట్ వర్రీ. పాలలో ముంచిన కాటన్ బాల్ తో పెర్మనెంట్ మార్కర్ మరకలపై జెంటిల్ గా రుద్దండి. మరకలు మాయం.

10. ఎలుకలు, చీమలు అలాగే స్పైడర్స్ తో టెన్షన్ పడుతున్నారా? ఐతే, ఈ ట్రిక్ మీ కోసమే. కాటన్ బాల్స్ ను పెప్పెర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్లో ముంచి ఇంట్లోని ప్రాబ్లెమాటిక్ ప్లేసెస్ లో ఉంచండి. ఎలుకలు, చీమలు అలాగే స్పైడర్స్ సమస్య తగ్గిపోతుంది. వీటికి పెప్పెర్మెంట్ స్మెల్ అంటే పడదు. కిచెన్ క్యాబినెట్స్ లో ఈ కాటన్ బాల్స్ ను పెడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

11. బాత్రూంలోని పాచి ఏర్పడే ప్లేస్ లో కాటన్ బాల్స్ తో అద్భుతం సృష్టించవచ్చు. ఎలాగంటారా…? బాత్రూంలోని ఫ్యాన్ ను ఆన్ చేయండి. కిటికీ తెరిచి ఉంచండి. గ్లోవ్స్ ధరించండి. అన్నిటికన్నా ముందు సేఫ్టీ ముఖ్యం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి కాస్తంత బ్లీచింగ్ పౌడర్ ను కలపండి. ప్రాబ్లెమాటిక్ ప్రదేశాల్లో ఈ కాటన్ బాల్స్ ను ఉంచండి. కాటన్ బాల్స్ ఆయా ప్రదేశాలకు అతుక్కుపోతాయి. వాటిని అలా రెండు గంటల పాటు ఉండనివ్వండి. ఆ తరువాత వాటిని తొలగించి శుభ్రం చేస్తే బాత్రూం మెరిసిపోతుంది.

12. బాత్రూంలోని వాసనను భరించలేకపోతున్నారా? ఎంత కేర్ తీసుకున్నా బాత్రూం లోంచి దుర్వాసనను తొలగించలేకపోతున్నారా? ఐతే, కాటన్ బాల్స్ మీకు సహాయపడతాయి. ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకోండి. కొన్ని కాటన్ బాల్స్ ను తీసుకోండి. వీటిపై ఈ ఆయిల్ ను పోయండి. బాత్రూం లో ఆ గిన్నెను పెట్టండి. స్పా వంటి పరిమళాలు వస్తాయి.

13. ఫ్రిడ్జ్ లో లో మంచి స్మెల్ రావట్లేదా? చింతించకండి. కాటన్ బాల్ తీసుకుని దాన్లో వెనిలా ఎక్స్ట్రాక్ట్ ను పోయండి. ఈ కాటన్ బాల్స్ ను ఫ్రిడ్జ్ లో చిన్న గిన్నెలో ఉంచండి. ఫ్రిడ్జ్ లోని ఫుడ్ స్మెల్స్ ను న్యూట్రలైజ్ చేయడానికి ఈ ప్రాసెస్ హెల్పవుతుంది.

14. ట్రాష్ క్యాన్ ఓపెన్ చేయగానే దుర్వాసన వేధిస్తోందా? ఐతే, ఇలా చేయండి. కాటన్ బాల్స్ పై మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ పోయండి. ట్రాష్ క్యాన్ అడుగున ఈ కాటన్ బాల్ ను ఉంచండి. ఇందుకోసం లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ ను వాడటం ఉత్తమం. ఎందుకంటే, ఇవి బిన్ ను డిసిన్ఫెక్ట్ చేస్తాయి.

సో, ఈ కాటన్ బాల్ హ్యక్స్ ఇంటరెస్టింగ్ గా అలాగే ఉపయోగకరంగా ఉన్నాయి కదా. మనం డైలీ రొటీన్ లో పడే కొన్ని ఇబ్బందులను ఈ హ్యక్స్ ద్వారా తొలగించుకోవచ్చు.

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top