పగటిపూట సెక్స్ చేసుకోవచ్చా?

0

సెక్స్ అనేది మనిషికి అత్యంత అవసరమైన చర్య. కేవలం ప్రత్యుత్పత్తికే కాకుండా ఆరోగ్యకరమైన జీవనానికి ఇది సాయం చేస్తుంది. సాధారణంగగా ఎక్కువ మంది రాత్రి సమయాల్లోనే సెక్స్ చేసుకుంటారు. రాత్రివేళల్లో విధులు నిర్వహించేవారికేమో రాత్రిళ్లు దానికి సమయం కుదరక పగలే కానిచ్చేస్తుంటారు. అయితే సెక్స్ చేసుకునే సమయంపై చాలామందిలో అనేక అపోహలు ఉంటాయి. పగటిపూట సెక్స్‌తో అనర్థమని, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. పగటిపూట సెక్స్ నిజంగా ప్రమాదకరమా? సెక్సాలజిస్టులు ఏమంటున్నారు.

సెక్స్ అనేది సమయం సందర్భంలేని కార్యం. టైమ్ చూసుకుని చేసుకునేందుకు అది ఆఫీసు పనికాదు. అయితే చాలామంది సెక్స్‌కు రాత్రి సమయాల్లోనే సమయం కేటాయిస్తారు. నిజానికి ఈ కార్యానికి పగలు కంటే రాత్రివేళే అనువైనదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. సెక్స్ చేసుకున్న తర్వాత స్త్రీ, పురుషుల మెదడు నుంచి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది హాయిగా నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. సెక్స్ చేసుకున్న తర్వాత చాలామందికి నిద్ర ముంచుకురావడానికి కారణం ఈ హార్మోనే.

సెక్స్ చేసుకున్న వారికి రాత్రి బాగా నిద్రపట్టి ఉదయానికి ఫ్రెష్‌గా కనిపిస్తారు. అయితే పగటిపూట సెక్స్ చేసుకునే వారికి నిద్రపోయేందుకు సమయం ఉండకపోవచ్చు. అందువల్ల వారు రెస్ట్‌లెస్‌గా కనిపిస్తారు. ఈ కారణం తప్ప పగటిపూట సెక్స్ చేసుకునేందుకు ఇతర అవరోధాలేమీ లేవు. సెక్స్ అనేది రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనిపై అపోహ పడటం అనవసరం.