డైలీ సెక్స్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేసిన యువతి.. సెక్స్ ఛాలెంజ్‌తో క్రేజీగా!

0

ఫ్రెండ్స్‌ను కలవడానికి, ఆఫీసు మీటింగ్‌లకు షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. కానీ సెక్స్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేయడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఓ మహిళ మాత్రం గూగుల్ కేలండర్‌లో సెక్స్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేసింది. గుడ్ మార్నింగ్ బ్రిటన్ షో హోస్ట్ కేట్ గరావే.. స్ప్రెడ్ షీట్ల సాయంతో రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొన్నానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపర్చింది. అంతే కాదు ఆమె తన భర్తకు 14 రోజుల సెక్స్ ఛాలెంజ్ విసిరింది. వారిద్దరూ రెండు వారాలపాటు ప్రతి రోజూ కలయికలో పాల్గొనాలనేది ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. అందుకు అనుగుణంగా వారిద్దరూ తమ షెడ్యూల్ మార్చుకున్నారట.

చాలా కాలం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు శారీరకంగా రోజూ కలవడం సాధ్యపడదు. దీన్ని అధిగమించడానికే ప్రతిరోజూ సెక్స్ చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. తను రాసిన పుస్తకంలో ఈ అనుభవాలను ఆమె ప్రస్తావించారు.

అంతా బాగానే ఉంది కానీ ఇలా ప్లాన్ చేసుకొని సెక్స్‌లో పాల్గొనాలనుకోవడం వర్కౌట్ అవుతుందా అనుకుంటున్నారా? అవుతుందనే అంటున్నారు సెక్స్ థెరపిస్టులు. నా దగ్గరకొచ్చే జంటలకు సెక్స్ ఛాలెంజ్‌ను సూచిస్తానని సెక్స్ థెరపిస్ట్ హోలీ రిచ్‌మండ్ తెలిపారు. తరచుగా సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నామని నా దగ్గరకొచ్చే జంటలకు ‘షెడ్యూల్ సెక్స్’ పాటించాలని సూచిస్తానన్నారు. ఒకేసారి వరసగా 14 రోజులపాటు సెక్స్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం కాకుండా.. వారంలో మూడు నాలుగు రోజులు పాటు కలయికను ఆస్వాదించడాన్ని గోల్‌‌గా పెట్టుకోవాలని ఆమె సూచించారు.

రెండు వారాలపాటు రోజూ సెక్స్‌లో పాల్గొనడాన్ని ఛాలెంజ్‌గా తీసుకోవడం వల్ల భాగస్వాముల మధ్య అనుబంధం పెరుగుతుందని రిచ్‌మండ్ తెలిపారు. సెక్స్ కోసం షెడ్యూల్ పెట్టుకొని.. ప్రతి రోజూ ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో చేసేలా జాగ్రత్తపడితే కొత్తదనం ఉంటుందన్నారు.