పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఇండియాలో జిమ్ కల్చర్ పెద్దగా లేదు. ఇక ఏరోబిక్సు.. జుంబా డ్యాన్సులు ఏంటో ఎవరికీ తెలియదు. అయితే సినిమాల ప్రభావమో లేదా.. ఫిట్నెస్ పట్ల పెరుగుతున్న అవగాహనో కానీ అర్బన్ ఏరియాస్ లో జిమ్ కల్చర్ పెరిగింది. అక్కడ ఇక్కడా తేడా లేకుండా పుట్టగొడుగుల్లా వీధి వీధికి జిమ్ములు పుట్టుకొచ్చాయి. గతంలో కండలు పెంచడం అంటే “అదో పనికిమాలిన వాళ్ళు.. పనిలేని వాళ్ళు చేసే పని” అని ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఆడిపోసుకునేవారు. ఇప్పుడు పట్టణ నగర ప్రాంతాల్లో దాదాపుగా ప్రతి ఇంట్లో ఒక సల్మాన్ ఖాన్ ఉంటున్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే డైటింగ్ లో లేకుండా.. స్లిమ్ గా ఉండటానికి ప్రయత్నించకుండా ఉండే అమ్మాయిలు దాదాపుగా కనపడడం లేదు. స్లిమ్ గా ఉన్నారా లేదా అనే సంగతి తర్వాత.. నాజూగ్గా ఉండాలి అనే స్పృహ మాత్రం అందరికీ ఉంది.
ఇంట్లో ఎవరైనా ఈ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ కు అడ్డం చెబితే రివర్స్ లో వారికి ఈ యూత్ క్లాస్ పీకుతున్నారు. అంతే కాదు ఈ జెనరేషన్ యూత్ జిమ్ కు వెళ్ళడమే కాదు డైలీ గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారట. తమకు రోల్ మోడల్స్ గా ఫిట్ గా ఉండే స్పోర్ట్స్ పర్సన్స్.. ఫిలిం సెలబ్రిటీలను ఎంచుకుంటున్నారట. అందుకే ఈ జెనరేషన్ యూత్ కు తగ్గట్టే సెలబ్రిటీలు కూడా ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇక పర్సనల్ లైఫ్ లో కూడా అమ్మాయిలు గతంలో లాగా కాకుండా ఫిట్ గా ఉండే అబ్బాయిలనే తమ బాయ్ ఫ్రెండ్ గా ఎంచుకుంటున్నారట. పెళ్ళి సంబంధాల విషయంలో కూడా అబ్బాయిలకు పొట్ట.. నడ్డి లాంటి ‘పాతకాలం ఫ్యామిలీ లక్షణాలు’ ఉంటే నిర్ధాక్షిణ్యంగా ‘నో’ చెప్తున్నారట. తాము ఫిట్ గా ఉండడమే కాదు తమ పార్ట్ నర్ కూడా ఫిట్ గా ఉండాలనే ఆలోచన ఈ కాలం యువతుల్లో పెరిగిందట. గతంలో అబ్బాయిలకు పొట్ట ఉంటే అది సహజంగా భావించేవారు. ఇప్పుడు అలా ఉంటే ఆ అబ్బాయిలు అమ్మాయిలకు అసలు నచ్చడం లేదని మాట్రిమొనీ బ్యూరోల వారు తెలుపుతున్నారు.
దీంతో ఎక్కువమంది జిమ్ములను ఆశ్రయించినా.. కొందరు మాత్రం వీరమాచినేని రామకృష్ణ గారి డైట్.. ఖాదర్ వలీ గారి మిల్లెట్స్ డైట్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. ఇవన్నీ మావల్ల కాదు అనుకునే కొంతమందేమో స్లిమ్ గా ఉండడం కోసం ఏమాత్రం సంకోచం లేకుండా ప్రొఫెషనల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ను కూడా ఆశ్రయిస్తున్నారట. యూత్ మాత్రమే కాకుండా పెళ్ళైన వారు కూడా తమ పార్టనర్ ఫిట్నెస్ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారట. వాకింగులు చెయ్యడం.. జాగింగులు చెయ్యడం.. ఒక పూట లైట్ గా ఉండే ఆహారం తీసుకోవడం లాంటివి ఫాలో అవుతున్నారట. మార్పు మంచిదే. అయితే ఈ ఫిట్నెస్ కోసం తపన వెనక ఉండే అంతరార్థం ఒక్క హెల్త్ మాత్రమే కాదు.. గుడ్ సెక్సువల్ లైఫ్ కోసమట!
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
