Templates by BIGtheme NET
Home >> REVIEWS >> దొరసాని రివ్యూ

దొరసాని రివ్యూ


విడుదల తేదీ : జూలై 12, 2019

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక

దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

నిర్మాత‌లు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

సంగీతం : ప్రశాంత్ ఆర్ వర్మ

సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి

ఎడిటర్ : నవీన్ నూలి

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌లను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొర‌సాని’. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

తక్కువ కులానికి చెందిన పేద కుంటుబంలో పుట్టిన రాజు (ఆనంద్ దేవరకొండ) దొర కూతురు చిన్న దొరసాని దేవకి(శివాత్మిక)ని చూడగానే ప్రేమిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం చిన్న దొరసాని దేవకి కూడా రాజు కవితల పై ఇష్ట పడుతుంది. అలా మొదలైన వారి ప్రయాణం ఒకరి పై ఒకరికి అమితమైన ప్రేమ పుట్టేలా దారి తీస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా అన్నలు వాళ్ళ ప్రేమకు ఎలా ఉపయోగపడ్డారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత రాజు – దేవకి ప్రేమ గురించి దొరకు తెలుస్తోంది. దొర వారి ప్రేమను వ్యతిరేకించడంతో వారి కథ ఎలా మలుపు తిరుగుతుంది. రాజు ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు ? చివరికి రాజు – దేవకి ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో నేటివిటీకి సంబంధించిన మరియు దొర వ్యవస్థలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం పడే సంఘర్షణ అలాగే పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా నేపధ్యం, లొకేషన్లు, నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ముఖ్యంగా రాజు బయట ప్రపంచం అంటే ఏంటో తెలీని దొరసానితో ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది.

హీరోహీరోయిన్లు నటించిన ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మెయిన్ గా శివాత్మిక రాజశేఖర్ తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. చూడటానికి దొరసాని గంభీరంగా కనిపిస్తూ .. కళ్లతోనే ముఖ్యమైన హావభావాలను పలికిస్తూ.. సినిమాలోనే హైలెట్ గా నిలిచింది.

సినిమాలో శివాత్మిక రాజశేఖర్ తండ్రిగా నటించిన నటుడు కూడా తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌ ఇప్పటికే లవ్ స్టోరీలు చాలా చూశాం. స్టోరీ పరంగా కొత్తగా ఏమి లేదు. కథా నేపధ్యం మరియు ఆ నేపథ్యంలో పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు.. కథనం విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇంకా కుదించి ఉంటే బాగుండేది.

అలాగే కథకు అవసరం లేని కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించాల్సింది. సినిమాలో యూత్ ఆకట్టుకునే పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

సాంకేతిక విభాగం :

కె.వి.ఆర్ మ‌హేంద్ర మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా కథనం విషయంలో మాత్రం బాగా నెమ్మదిగా కనిపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

తీర్పు :

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో భావేద్వేగమైన ప్రేమ కథతో కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని కొంతమేరకు దెబ్బ తీశాయి. మొత్తం మీద ఈ సినిమా మంచి ఫ్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి.

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం ‘దొరసాని’. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాత. తెలంగాణలో 80వ దశకంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజజీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమాలో హీరో ఆనంద్.. విజయ్ దేవరకొండ తమ్ముడు కావడం, అలాగే హీరోయిన్ శివాత్మిక.. జీవిత, రాజశేఖర్ల కుమార్తె కావడంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా సెట్‌లు, లొకేషన్లు, సహజసిద్ధమైన మేకప్.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీనికి తగ్గుట్టుగానే నిర్మాతలు సినిమాకు బాగా ప్రచారం చేశారు. ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ, రాజశేఖర్, జీవిత రావడం ప్లస్ అయ్యింది. మొత్తానికి అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది.

సినిమా థియేటర్లకు రావడానికి ముందే పరిశ్రమలోని కొంత మంది ప్రముఖులు, యువ దర్శకులకు ప్రదర్శించారు. సినిమాను చూసిన వీరంతా అద్భుతం అంటున్నారు. ఈ మేరకు యువ దర్శకులు ప్రశాంత్ వర్మ (కల్కి), అజయ్ భూపతి (ఆర్ఎక్స్ 100), వేణు ఉడుగుల (నిను వీడని నీడను నేనే), గౌతమ్ తిన్ననూరి (జెర్సీ), నిర్మాత రాహుల్ యాదవ్ (ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ) ట్వీట్‌లు చేశారు. మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (అర్జున్ రెడ్డి) కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

హీరోహీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ చాలా సహజసిద్ధంగా నటించారని వీరంతా కొనియాడారు. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథలో లీనమైపోయామన్నారు. దర్శకుడు మహేంద్ర ఒక నిజాయతీ కలిగిన ప్రేమకథను తెరకెక్కించారని కొనియాడారు. నిర్మాణ విలువలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయని పొగిడారు. అందరూ కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని సూచించారు.

విడుదల తేదీ : జూలై 12, 2019 నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర నిర్మాత‌లు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని సంగీతం : ప్రశాంత్ ఆర్ వర్మ సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌లను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొర‌సాని’. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం ! కథ : తక్కువ కులానికి చెందిన పేద కుంటుబంలో పుట్టిన రాజు (ఆనంద్ దేవరకొండ) దొర కూతురు చిన్న దొరసాని దేవకి(శివాత్మిక)ని చూడగానే ప్రేమిస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనలు అనంతరం చిన్న దొరసాని దేవకి కూడా రాజు కవితల పై ఇష్ట పడుతుంది. అలా మొదలైన వారి ప్రయాణం ఒకరి పై ఒకరికి అమితమైన ప్రేమ పుట్టేలా దారి తీస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా అన్నలు వాళ్ళ ప్రేమకు ఎలా ఉపయోగపడ్డారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల తరువాత రాజు – దేవకి ప్రేమ గురించి దొరకు తెలుస్తోంది. దొర వారి ప్రేమను వ్యతిరేకించడంతో వారి కథ ఎలా మలుపు తిరుగుతుంది. రాజు ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు ? చివరికి రాజు – దేవకి ఒక్కటయ్యారా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర ఈ సినిమాని చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ : సినిమాలో నేటివిటీకి సంబంధించిన మరియు దొర వ్యవస్థలో ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం పడే సంఘర్షణ అలాగే పక్కా తెలంగాణ యాసలో డైలాగులు, ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా నేపధ్యం, లొకేషన్లు, నటీనటుల నుండి రాబట్టుకున్న సహజసిద్ధమైన నటన వంటి అంశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ముఖ్యంగా రాజు బయట ప్రపంచం అంటే ఏంటో తెలీని దొరసానితో ప్రేమలో పడే సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు ఎక్స్‌ ప్రెస్‌ చేసుకునే సన్నివేశం కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తోంది. హీరోహీరోయిన్లు నటించిన ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. మెయిన్ గా శివాత్మిక రాజశేఖర్ తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. చూడటానికి దొరసాని గంభీరంగా కనిపిస్తూ .. కళ్లతోనే ముఖ్యమైన హావభావాలను పలికిస్తూ.. సినిమాలోనే హైలెట్ గా నిలిచింది. సినిమాలో శివాత్మిక రాజశేఖర్ తండ్రిగా నటించిన నటుడు కూడా తన నటనతో పాటు ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక హీరోకి ఫ్రెండ్స్ గా నటించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మైనస్ పాయింట్స్ : పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడటం అన్న కాన్సెప్ట్‌ ఇప్పటికే లవ్ స్టోరీలు చాలా చూశాం. స్టోరీ పరంగా కొత్తగా ఏమి లేదు. కథా నేపధ్యం మరియు ఆ నేపథ్యంలో పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు.. కథనం విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని సాగతీత సీన్స్ ను కూడా తగ్గించాల్సింది. సినిమాలో యూత్ ఆకట్టుకునే పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. సాంకేతిక విభాగం : కె.వి.ఆర్ మ‌హేంద్ర మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా కథనం విషయంలో మాత్రం బాగా నెమ్మదిగా కనిపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది. తీర్పు : కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బలమైన నేపథ్యంతో భావేద్వేగమైన ప్రేమ కథతో కొన్ని ప్రేమ సన్నివేశాలతో ఆకట్టుకునప్పటికీ… స్టోరీ కాన్సెప్ట్‌ రొటీన్ గా ఉండటం, కథనం బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం, సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని కొంతమేరకు…

దొరసాని రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.1

దొరసాని రివ్యూ

దొరసాని రివ్యూ

User Rating: Be the first one !
3