Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> National Kissing Day : ముద్దులకూ ఓ రోజుంది.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

National Kissing Day : ముద్దులకూ ఓ రోజుంది.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?


‘ముద్దంటే చేదా.. నీకు ఆ ఉద్దేశం లేదా?’ అని పాటలు పాడడమే కాదు.. ఈ ప్రకృతిలో ప్రేమను చాటుకోవడానికి ఉన్న ఏకైక సాధనం ముద్దునే. ముద్దుతో మొదలై హగ్గుకు దారితీసి ఆ తర్వాత శృంగారం వరకు చేరి పీక్స్ కు చేరుతుంది. అదంతా ముద్దు నుంచి పుట్టే తతంగమే.. ఆ ప్రేమ లేనిదే అసలు ప్రపంచమే లేదు. అందుకే ప్రేమలో ‘ముద్దు’కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

కరోనా గత ఏడాది ప్రపంచాన్ని ఆవహించాక ఓ షేక్ హ్యాండ్ లేదు.. హగ్ లేదు.. ఇక ముద్దూ మురిపాలు కూడా లేకుండా పోయాయి. ఈ కరోనా మహమ్మారి చేయబట్టి సరిగ్గా రోమాన్స్ కూడా చేయడానికి భయం వేస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ జనాలు నెట్టుకొస్తున్నారు. అయితే ఈ ముద్దుల దినోత్సవం రోజైనా కాస్త అదంతా పక్కనపెట్టి మీ భాగస్వామితో ముద్దుల్లో మునిగిపోండని ప్రేమికులు కోరుతున్నారు.

ముద్దు మురిపాలపై మన టాలీవుడ్ లో ఎన్నో పాటలున్నాయి. అంతేకాదండోయ్.. ముద్దులకు ఓ రోజుంది. జాతీయ ముద్దుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలుసా. అమెరికాలో జూన్ 22న జాతీయ ముద్దుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అమెరికాలో మొదలైన ఈ సంస్కృతి ప్రపంచదేశాలకు పాకింది. ఈరోజున యువతీ యువకులు అంతా ముద్దుల మైకంలో మైమరిచిపోయి పండుగల సెలబ్రేట్ చేసుకుంటారంటే నమ్మండి. ప్రేమికులకు ముఖ్యంగా ఈరోజు ఒక మధురానుభూతి.

ఇక నేషనల్ కిస్సిండ్ డే జూన్ 22 కాగా.. ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే కూడా ఉంది. అది అనధికారిక హాలీడే. దాన్ని ప్రతి సంవత్సరం జులై 6న జరుపుతారు. బ్రిటన్ దేశంలో ఈ అంతర్జాతీయ ముద్దుల దినం మొదలైంది. ప్రపంచం మొత్తం పాకింది. అమెరికాలో మాత్రం జూన్ 22న జరుపుకుంటారు. ఈరోజు అమెరికన్లు తమ తనివితీరా ముద్దులు పెట్టుకుంటారు.

ముద్దుల చరిత్రను ఒక్కసారి తవ్వితే ఆశ్చర్యకర విషయాలు బయటపడుతాయి. మొట్టమొదట క్రి.పూర్వం 1500 కాలం నుంచి ఈ ముద్దులు పెట్టుకోవడం ఉందట.. మొట్టమొదట క్రీస్తు పూర్వం 326లో ది గ్రేట్ అలెగ్జాండర్ కాలం నుంచి ఈ ముద్దుల పరంపరం ఉందని టాక్. రోమన్లు ముద్దులంటే పడిచచ్చేవారట.. ఇక ఇండియా నుంచి కూడా ముద్దులు ప్రారంభమయ్యాయని చెప్పేవారున్నారు. వేదాలు సంస్కృతంతో వీరి ప్రస్తావన ఉందంటున్నారు.

అదంతా పక్కనపెడితే ముద్దులపై చేసే అధ్యయనాల శాస్త్రం పేరు ‘ఫిలెమాటోలజీ’ అంటారు. ఈ అధ్యయనాల ప్రకారం.. ముద్దులతోనే బంధం ప్రేమ బలపడుతుందని.. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముద్దులు పెట్టుకోవడం వల్ల కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వెల్లడైంది.

ముద్దుతో రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని తేలింది. ఒత్తిడి ఆందోళన తలనొప్పిని తగ్గిస్తుందని నిరూపితమైంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలుగుతుందని పరిశోధనలో తేలింది.

ప్రధానంగా ముద్దు వల్ల ముఖాల కండరాల్లో కదలిక వస్తుందని తేలింది. కేలరీలను కరిగిస్తుందని.. ఆయుష్షును పెంచుతుందని తేలింది. ఇవన్నీ ఆయా సర్వేల్లో నిరూపితమయ్యాయి. ఇక ముద్దులతో రెచ్చిపోవడమే ప్రేమికులకు మిగిలింది. ఈ ముద్దుల దినోత్సవాన్ని మరింత పండుగలా చేసుకోండి.