త్వరగా గర్భం దాల్చేలా చేసే సహాజ ఆహార పదార్థాలు

0

బిజీ జీవనశైలి, అనారోగ్యకర ఆహార పదార్థాల సేకరణ, కాలుష్యం మరియు ఇతర కారణాల వలన గర్భం ధరించటం చాలా కష్టం అయిపొయింది. కానీ ఇక్కడ తెలిపిన సహజ ఆహార పదార్థాలు మీరు తల్లి అవటాన్ని సులభతరం చేస్తాయి.
1గర్భం

ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బిజీ జీవనశైలి, అనారోగ్యకర ఆహార పదార్థాల సేకరణ, కాలుష్యం వంటి వాటి వలన గర్భం దాల్చటం కూడా చాలా కష్టంగా మారిపోయింది అవునా! కానీ కొన్ని రకాల సహజ ఆహార పదార్థాలు మీరు తల్లి అయ్యే అవకాశాలను చాలా వరకు మెరుగుపరుస్తాయి. అవేంటో మీరే చూడండి.

2సిట్రస్ జాతికి చెందిన పండ్లు
త్వరగా గర్భం దాల్చాలి అనుకునే వారు , వారు పాటించే ఆహార ప్రణాలికలో విటమిన్ ‘C’ అధికంగా గల ఆహారాలను తప్పక కలుపుకోవాలి. ఈ విటమిన్ సాధారణంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి, మహిళలలో ప్రత్యుత్పత్తిని వేగవంతం చేస్తాయి.

3పాల ఉత్పత్తులు
సంతానోత్పత్తి పెంచటంలో పాలు మరియు పాల ఉత్పత్తులు గొప్పగా సహాయపడతాయి. వీటిలో ఉద్నే FHS మరియు LH హార్మోన్ల ఉత్పత్తిని శరీరంలో పెంచి, సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి.

4దానిమ్మ పండు
స్త్రీ మరియు పురుషులలో సంతానోత్పత్తిని పెంచటంలో దానిమ్మ పండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవి మహిళలలో గర్భాశాయానికి మరియు లోపలి పార్కు రక్త ప్రసరణను పెంచుతుంది. మరి పురుషులలో వీర్యకణాల సంఖ్యతో పాటూ వాటి నాణ్యతకు కూడా రెట్టింపు చేస్తుంది. కావున పిల్లలల కోసం ప్రణాళిక రూపొందించుకునే వారు రోజు దానిమ్మ విత్తనాలను లేదా జ్యూస్ తాగటం చాలా మంచిది.

5ఖర్జూరం లేదా డేట్స్
ఖర్జూరం లేదా డేట్స్ ఉండే విటమిన్ మరియు మినరల్ లు సంతానోత్పత్తిని పెంచుతాయని పలు అధ్యయనాలలో పేర్కొనబడింది. ఖర్జూర పండ్లలోని విత్తనాలను తొలగించి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేయగా వచ్చిన పేస్ట్ ను రోజు ఒక గ్లాసు పాలలో తాగటం వలన మహిళలలో సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.