గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామాలు

0

వ్యాయామాల వలన మధుమేహం, బరువు నిర్వహణతో పాటూ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామాల గురించి ఇక్కడ తెలుపబడింది.
1గుండె ఆరోగ్యంలో వ్యాయామాల ప్రాముఖ్యత
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఆహారాలు మాత్రమేకాదు, వ్యాయామాలు కూడా చేయాలి. కేవలం 30 నిమిషాల పాటూ, ఎరోబిక్స్ వ్యాయామాలను చేయటం వలన లేదా 10 నుండి 15 నిమిషాలు సైకిల్ తొక్కటం వలన పూర్తీ ఆరోగ్యంతో పాటూ, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

2వాకింగ్
మన చిన్న గుండెకు మేలు చేసే సులువైన మరియు మంచి ప్రభావితమైన వ్యాయామంగా వాకింగ్ ను పేర్కొనవచ్చు. ఈ సులువైన వ్యాయామం వలన గుండె ఆరోగ్యమే కాకుండా, పూర్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

3మెట్లు ఎక్కటం
ఈ రకం వ్యాయామాన్ని భయట ఎక్కడో కాకుండా ఇంట్లోనే చేయవచ్చు. అంతేకాకుండా, ఎస్కులేటర్, లిఫ్ట్ వంటి వాటిని వాడకుండా మెట్లు ఎక్కటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా చేయటం వలన హృదయ స్పందన రేటు 50 నుండి 85 శాతం వరకు పెరుగుతుంది.

4సైకిల్ తొక్కటం
మీరు సైకిల్ తొక్కటం వలన కాళ్ళలో జరిగే కదలికల వలన గుండె ద్వారా కాలిలో ఉండే ఉండే పొడవైన కండరానికి రక్తం సరఫరా చేయబడుతుంది. సైకిల్ ను భయట మాత్రమే కాదు, ఇంట్లో ఉండే స్థిర సైకిల్ (స్టేషనరీ సైక్లింగ్) లో కూడా తొక్కవచ్చు. వీటి వలన గుండె విధి పెరిగి, దాని ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

5ఈత
గుండె ఆరోగ్యం ఎక్కువగా మెరుగుపడటానికి, స్విమ్మింగ్ పూల్ లో కనీసం 20 నుండి 30 నిమిషాల పాటూ ఈత కొట్టండి. ఇలా చేయటం వలన శరీరం తాజదననికి గురవటమేకాకుండా, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

6డాన్స్
మంచి షూ ను ధరించి, మీకు ఇష్టమైన పాటపై డాన్స్ చేయటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రదర్శనను బట్టి ఎక్కువ ప్రభావం నుండి తక్కువ ప్రభావం లేదా తక్కువ ప్రభావం నుండి ఎక్కువ ప్రభావం వైపు చేయవచ్చు.