హాట్ ఆయిల్ మానిక్యూర్ వలన కలిగే అద్భుత ప్రయోజనాలు

0

రోజు మొత్తం మన చేతులు దుమ్ము, ధూళి ఉండే పరిసరాలకు బహిర్గతం అవుతుంటాయి. అంతేకాకుండా, ఇంట్లో ఉండే రసాయన ఉత్పత్తులకు, గాడత ఎక్కువగా గల సబ్బులు, చేతులు ఎక్కువ సమయం పాటూ నీటిలో ఉండటం వంటి కారకాల వలన చర్మం తన సహజ తేమను కోల్పోయి, పొడిగా మారుతుంది. వేడి నూనెతో చేసే మనిక్యూర్ మీ చేతులకు చాలా వరకు ప్రయోజనాలను చేకూరుస్తుంది.

గోళ్లకు మరియు చర్మానికి మంచిది
చేతులపై ఉండే చర్మం చాలా పలుచగా ఉంటుంది మరియు త్వరగా పొడిగా మారి, వలయాలు ఏర్పడే అవకాశం ఉంది. మానిక్యూర్ లలో వేడి నూనెను వాడటం వలన చర్మానికి కావలసిన పోషకాలను అందించటమేకాకుండా, చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. విటమిన్ ‘E’ ఆయిల్, బాదం నూనె, నువ్వుల నూనె మరియు సన్ ఫ్లవర్ నూనెలను ఈ వేడి నూనె మానిక్యూర్ లో వాడటం వలన మీ చర్మ ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది.

పొడి మరియు పెలుసైన గోళ్లు నుండి ఉపశమనానికి
ఈ నూనెలు గోళ్లకు మరియు గోరు అంచులకు కావలసిన పోషకాలను అందిస్తాయి మరియు కొత్తగా వచ్చే గోళ్లకు బలంగా నిర్మితమయ్యేలా చేస్తాయి. బలంగా ఉండే గోళ్లు విరగవు మరియు పెలుసులుగా ఊడిపోవు. క్రమంగా ఈ మానిక్యూర్ ను చేయటం వలన తరచుగా గోళ్లు విరగకుండా ఉంటాయి. లావెండర్, జోజోబా మరియు నిమ్మ నూనె వంటి ఎస్సేన్శియాల్ నూనెలు మానిక్యూర్ సమర్థవంతంగా పని చేసి, గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

ప్రసరణ శక్తిని పెంచుతుంది
వేడి నూనె ఆయిల్ మానిక్యూర్ లో మీ చేతులను కొద్దిగా వేడిగా ఉండే నూనెలో మీ చేతులను ముంచుతారు. వేడితో కూడిన మసాజ్ వలన చేతులలో రక్తప్రసరణ పెరిగి, చేతులు మృదువుగా మరియు ఆరోగ్యకరంగా మారతాయి. ఈ పద్దతి ద్వారా మంచి ఫలితాలను పొందుటకు గానూ, ఎస్సేన్శియాల్ ఆయిల్ ను కలపండి.

శుభ్రంగా మరియు ఎక్సోఫోలేట్
ఆయిల్ ద్వారా సాధారణంగా ముఖంపై వేసుకున్న మేకప్ ను తొలగించుకోవచ్చు. అదేవిధంగా వేడి నూనె చర్మాన్ని మరియు చేతులను శుభ్రపరుస్తుంది. ఇలా వేడి నూనెలతో మసాజ్ చేయటం వలన చర్మం ఎక్సోఫోలేషణ్ క్రియకు గురై, బహిర్గత పొరలో ఉండే నిర్జీవ కణాలు తొలగించబడతాయి.

పురుషులకు కూడా మంచిది
ఇదే కాదు అన్ని రకాల మానిక్యూర్ పద్దతులు సౌందర్య ప్రయోజనాలను చేకూర్చటానికే. ఈ హాట్ ఆయిల్ మానిక్యూర్ ద్వారా చేతి చర్మం మరియు గోళ్ల ఆరోగ్యం పెరగటానికి సహాయపడుతుంది మరియు దీనిని పురుషులు కూడా వినియోగించవచ్చు. పురుషులు ఎక్కువగా కఠినమైన చర్మాన్ని కలిగి ఉంటారు. కావున పురుషులు రోజు ఈ పద్దతిని అనుసరించటం వలన వారి చర్మం కూడా మృదువుగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.