తిప్పతీగ వలన కలిగే దుష్ప్రభావాలు

0

హృదయం ఆకారంలో ఉండే ఆకులను కలిగి ఉండే తిప్పతీగ భారత ఉపఖండంలో ఒక ప్రముఖ వృక్షంగా చెప్పవచ్చు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చాలా రకాల ప్రయోజనాల కోసం వాడుతున్నారు. యాంటీ పైరెటిక్, యాంటీ ఆర్థరైటిస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్నందు వలన జీర్ణాశయ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ సమస్యలు, రక్తం శుద్ధి మరియు నొప్పి వంటి రుగ్మతలను సహజంగా తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. ఇలా ఇన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చినప్పటికి, దీని వలన కూడా దుష్ప్రభావాలు కలుగుతాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

తిమ్మతీగను సరైన స్థాయిలో తీసుకోవటం వలన ఎలాంటి సమస్యలు ఉండవు కానీ, మితిమీరిన మోతాదులో దీని వాడకం వలన చాలా రకాల సమస్యలను కలిగిస్తుంది. వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి.

అల్పరక్త పీడనం
వివిధ కారణాలను పరిగణలోకి తీసుకుంటే, తిప్పతీగ ఆరోగ్యానికి మంచిదే. కానీ, ఎంత మేరకు ఆరోగ్యానికి మంచిదో, అదే స్థాయిలో అనారోగ్యాన్ని లేదా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలో సమస్యలను కలిగి ఉండే వారు తిప్పతీగకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితపరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది కావున, గుండె సంబంధిత సమస్యలను కలిగించవచ్చు. కావున దీనిని వాడకానికి ముందు వైద్యుడిని కలవటం చాలా మంచిది.

శస్త్ర చికిత్సకు హానికరం
పైన తెలిపిన విధంగా తిప్పతీగ రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రభావితపరుస్తుంది కావున శస్త్ర చికిత్స సమయంలో మరియు తరువాత దీనిని వాడటం వలన సమస్యలు అధికం అవుతాయి. అందువలన శస్త్ర చికిత్సకు కొన్ని రోజుల ముందు మరియు తరువాతి వారకి తిప్పతీగను వాడకండి.

మలబద్దకానికి దారి తీస్తుంది
జీర్ణాశయ సమస్యలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా, కొన్ని సార్లు కడుపులో కలతలను కూడా కలిగిస్తుంది. సరైన రూపంలో తీసుకొని ఎడల, మలబద్దకానికి కూడా దారితీయవచ్చు. తిప్పతీగ తరువాత మలబద్దకం లేదా పొట్టలో ఎవైన సమస్యలు కలిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

స్వయం నిరోధిత వ్యాధి లక్షణాలు ప్రోత్సహిస్తుంది
కొన్ని సార్లు తిప్పతీగ రోగ నిరోధక వ్యవస్థను అధికంగా ఉద్దీపనలకు గురి చేస్తంది. ఫలితంగా, స్వయం నిరోధిత వ్యాధి లక్షణాలు బహిర్గతం అవుతుంటాయి. వీటిలో లూపస్, మల్టిపుల్ స్క్లేరోసిస్, మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి రుగ్మతలు బహిర్గత లక్షణాలుగా గమనించవచ్చు. స్వయం నిరోధిత వ్యాధులు కలిగి ఉన్నవారు తిప్పతీగకు దూరంగా ఉండాలి.