పురుషులు తమతో తప్పక ఉంచుకోవలసిన సౌందర్య ఉత్పత్తులు

0

అబ్బాయిలు అందంగా కనపడాలనుకుంటారు. పై నుండి కింది వరకు శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండటం వలన ఆత్మవిశ్వాసంతో పాటూ చుట్టూ ఉండే వారు గౌరవం పొందుతారు. పురుషులు ఎప్పపుడు అందంగా కనబడటానికి ఇక్కడ తెలిపిన వాటిని మీతో ఎల్లపుడు ఉంచుకోండి.
1ఎలక్ట్రిక్ రేజర్ కు బడులుగా బ్లేడ్ రేజర్
ఎలక్ట్రిక్ రేజర్ వెంట్రుకల పెరుగుదలను నియత్రిస్తుంది మరియు బ్లేడ్ రేజర్ తో పోలిస్తే శుభ్రంగా కూడా ఉండదు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ రేజర్ తో పూర్తిగా వెంట్రుకలను తొలగించలేము కానీ బ్లేడ్ రేజర్ తో పూర్తీ వెంట్రుకలను తొలగించుకోవచ్చు.

2నైట్ క్రీమ్స్
ఇలాంటి సౌందర్య ఉత్పత్తులు స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా అవసరమే. ఇలా రాత్రి పడుకునే ముందు తేమను అందించే క్రీములను వాడటం వలన పురుషుల చర్మం కూడా మృదువుగా మారుతుంది.

3సబ్బులకు బదులుగా బాడీ వాష్
సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్ ను కలిగి ఉండి, మీ చర్మాన్ని పొడిగా మారుస్తాయి. బాడీ వాష్ లలో సోడియం హైడ్రాక్సైడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. సబ్బుతో పోలిస్తే బాడీ వాష్ లు శరీరాన్ని పొడిగా మార్చావు.

4పర్ఫ్యూమ్ లేదా స్ప్రే
చెమట వాసన మనల్ని మాత్రమే కాదు చుట్టూ ఉండే వారికి కూడా విసుగు పుట్టిస్తుంది. కావును మంచి పర్ఫ్యూమ్ లేదా స్ప్రే లను ఎల్లపుడు మీతో ఉంచుకోవటం వలన ఎలాంటి సమస్యలు ఉండవు.

5గ్లిసరిన్ లేదా షేవింగ్ జెల్
షేవింగ్ జెల్ లేదా గ్లిసరిన్ క్రీమ్ లు షేవ్ ను మృదువుగా మార్చటమేకాకుండా, చూడటానికి అందంగా కనపడేలా చేస్తాయి. కావున మీతో ఎల్లపుడు వీటిని మీతోపాటే ఉంచుకోండి.