Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> మీరు తినే ఆహరం లావుగా చేయుటకు గల కారణాలు

మీరు తినే ఆహరం లావుగా చేయుటకు గల కారణాలు


మనం తినే ఆహర పదార్థాలు బరువును పెంచవు. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే శక్తి రోజు విదులకు సహాపడుతుంది. కానీ కింద తెలిపిన కారణాల వలన ఆహర పదార్థాలు బరువు పెంచేలా ప్రోత్సహించబడతాయి.

1సంవిధాన పరచిన ఆహారం
డైటింగ్ లేదా బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్న సమయంలో క్యాలోరీలు ఎక్కువగా గల సంవిధాన పరచిన ఆహర పదార్థాలను తినటం వలన బరువు తగ్గే ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడటమేకాకుండా, బరువు కూడా పెరుగుతుంది. ఇలాంటి ఆహార పదార్థాలను తక్కువగా తిన్నను, క్యాలోరీలు అధికంగా శరీరానికి అందించబడతాయి.

2ఆహార సేకరణ లోపాలు
కొన్ని సందర్భాలలో, ఆరోగ్యమైన ఆహార ప్రణాళిక కాకుండా, ఆహరాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. డైటింగ్ లేదా ఆహార నియంత్రణ లేదా పథ్యంగా పిలువబడే ఈ ప్రక్రియలో ఆహరం తక్కువగా తీసుకోవటం వలన జీవక్రియ నెమ్మదిగా మారుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పదార్థాలు నిల్వ అధికం అవుతుంది.

3భావోద్వేగ ఆహారపు అలవాట్లు
కొంత మంది అసంతృప్తిగా లేదా డిప్రెషన్ సమయంలో ఎక్కువగా తింటూ ఉంటారు. చాక్లెట్, స్వీట్లు మరియు ఇతర ఆహర పదార్థాలు డిప్రెషన్ ను తగ్గించుటకు సహాయపడతాయని ఎక్కువ తింటారు. ఇలా డిప్రెషన్ సమయంలో తినే ఆహార పదార్థాల వలన పెరిగిన అదనపు బరువు తగ్గించుటకు ఎక్కువ సమయం పడుతుంది మరియు కష్టం కూడా.

4నిద్రలోపాలు
పనులు, డిప్రెషన్ మరియు బిజీ షెడ్యూల్ ల వలన సరైన సమయం పాటూ నిద్ర ఉండదు. ఫలితంగా, శరీరంలో తిరిగి కొవ్వు పదార్థాల నిల్వ ప్రారంభం అవుతుంది. నిద్రలేని ఎడల మన శరీరం సాధారణంగా పని చేయలేదు మరియు కొవ్వు పదార్థాల నిల్వ కూడా అధికం అవుతుంది.

5ఒత్తిడి
ఒత్తిడి వలన మన శరీరం రక్షణ మోడ్ లోకి బదిలీ అవుతుంది, ఫలితంగా శరీర విధులు నెమ్మదిగా మారటం వలన శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వ రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోవటం, శరీర విధులు నెమ్మదిగా మారటం, కొవ్వు పదార్థాల నిల్వ వంటి వరుస పనుల వలన బరువు పెరుగుతుంది.