Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> అందుకే స్వామి వివేకానందలో దుర్బుద్ధి..!?

అందుకే స్వామి వివేకానందలో దుర్బుద్ధి..!?


నేటి యువతకు ప్రేరణ.. స్ఫూర్తి ప్రదాతగా నిలిచే వ్యక్తి స్వామి వివేకానంద. ప్రపంచ దేశాలన్నీ కీర్తించే మహానుభావుడు వివేకానంద. మానవత్వం.. దేవుడి గురించి అన్వేషించి ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని కనుగొన్న అద్వైత యోగి స్వామి వివేకానంద. అహింసావాది.. చీమకు కూడా హాని చేయని ఆ వ్యక్తి ఒకరిని హత్య చేయాలని భావించాడంట. మనిషి కోసమే కాదు మూగజీవుల కోసమూ తపించిన ఆయన ఒకరిని హత్య చేయాలనే ఆలోచన వచ్చింది. ఇది సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా తన పుస్తకాల్లో వివేకానంద తెలిపారు.

ఇంతకీ ఎందుకు హత్య చేయాలనుకున్నారు? ఎవర్ని హత్య చేయాలనుకున్నారు? వివేకానందకు అంత కోపం రావడానికి కారణమేమిటనేది ఆసక్తికరంగా మారింది. వివేకానంద ఒకసారి ఓ హోటల్ లో భోజనం చేశాడు. ఆ సమయంలో ఒకరిని హత్య చేయాలన రేగింది. ఈ ఆలోచన రాగానే వివేకానంద షాక్ కు గురయ్యాడు. తనలో ఈ ఆలోచన రావడానికి కారణమేమిటో తీవ్రంగా ఆలోచించాడు. తనకు ఇంతటి తీవ్రమైన ఆలోచన.. దుర్బుద్ధి కలగడానికి ఏంటి కారణమని ఆలోచించాడు.

అనంతరం వెంటనే ఆ ఆలోచనకు దారి తీసిన పరిస్థితులు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తనకు హోటల్ లో భోజనం వడ్డించిన వ్యక్తి మానసిక పరిస్థితి తెలుసుకున్నాడు. నువ్వు ఎవరినీ హత్య చేయాలనుకుంటున్నావ్? అని ప్రశ్నించాడు. అతడు అలాంటిదేమీ లేదని బదులిచ్చాడు. ఆ వెంటనే వివేకానంద వంట చేసిన వ్యక్తి వద్దకు వెళ్లి ఎవర్ని హత్య చేయాలని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో అతడు ఖంగుతిన్నాడు. ఈ విషయం మీకెలా తెలుసు అని అతడు ప్రశ్నించాడు. దీంతో వివేకానంద మొత్తం విషయం చెప్పాడు.

తాను ధ్యానజీవి అని.. తాను మానసికంగా శక్తిపరుడినని పేర్కొన్నాడు. ఇతరుల ఆలోచనలు తెలుసుకోవచ్చని తెలిపాడు. నువ్వు వండిన భోజనం తాను తినడంతో నీ ఆలోచన నాకు వచ్చిందని తెలిపాడు. భోజనం తన ఆలోచనలో మార్పు చేసిందని వివరించాడు. అందుకే తమలాంటి వారు అందరితో భోజనం వడ్డించుకోరని.. ప్రత్యేక వ్యక్తుల ద్వారా మాత్రమే భోజనం స్వీకరిస్తామని.. వివేకానంద తెలిపారు.