Templates by BIGtheme NET
Home >> GADGETS >> మార్కెట్‌లోకి మోటో జీ 5G స్మార్ట్‌ఫోన్‌

మార్కెట్‌లోకి మోటో జీ 5G స్మార్ట్‌ఫోన్‌


కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలాడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. క్రయ విక్రయాలు జరగకపోవడంతో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మొన్నటి వరకు దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటూ జవసత్వాలను నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ విపణిలోకి మోటో తన కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. motog 5g పేరుతో యూకే, యూరప్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ధర 349 యూరోలు (మన రూపాయల్లో దాదాపు 30వేలు). అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేది సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. మోటోరోలా g5g స్మార్ట్‌ఫోన్లలో 4gb+64gb, 6gb RAM + 128gb (399యూరోలు, ₹33,730) వేరియంట్లలో దొరుకుతుంది. 

మోటో G 5G ప్లస్‌ ప్రత్యేకతలు

* డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+పౌచ్‌ హోల్‌ డిస్‌ప్లే ఆఫ్‌ 90 హెడ్జ్‌ 

* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 765 5g ప్రాసిసెర్‌ 

* ర్యామ్‌: 6 జీబీ‌, 128 జీబీ స్టోరేజ్‌.. 1టీబీవరకు ఎక్స్‌పాండబుల్‌

* మోటోజీ 5g 4జీ, 5జీ నెట్‌వర్క్స్‌
* ఆండ్రాయిడ్‌ 10

కెమెరా పనితీరు

* 48 మెగా పిక్సల్స్‌ ప్రైమరీ కెమెరా
* 5 మెగా పిక్సల్స్‌ మాక్రో కెమెరా
* 8 మెగా పిక్సల్స్‌ అల్ట్రావైడ్‌ కెమెరా
* 2 మెగా పిక్సల్స్‌ డెప్త్‌ సెన్సార్‌
* 16 మెగా పిక్సల్స్‌ ఫ్రంట్‌ కెమెరా