Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఈ లక్షణాలు ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్లే..

ఈ లక్షణాలు ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్లే..


రావాల్సిన టైం కి పీరియడ్ రాకపోవటం ప్రెగ్నెన్సీ కి మొదటి సూచన. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నవారు ఆనందపడితే, ఆ ఆలోచన లేని వారు కంగారు పడతారు. ఇద్దరికీ కూడా రావాల్సిన డేట్ నుంచి లేట్ అవుతున్న కొద్దీ, ఆందోళన పెరుగుతూ ఉంటుంది. నిజమా కాదా అని. పీరియడ్ రావాల్సిన డేట్ నుంచి కనీసం ఒక పది రోజులైతేనే కానీ, డాక్టర్స్ కూడా ఎలాంటి టెస్ట్ చేయరు. ఈ పది రోజుల్లో మీకు ఒక ఐడియా రావడానికి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇవి పీరియడ్ మిస్ అయిందని మీకు తెలియడానికి ముందు నుంచి కూడా కనిపించే ఛాన్స్ ఉంది.

​​కొన్ని ఫుడ్స్ నచ్చకపోవడం

చాలా మందికి తెలిసే లక్షణాల్లో ఇది ఒకటి. కొన్ని ఫుడ్స్ స్మెల్ కానీ, టేస్ట్ కానీ నచ్చకపోవడం. నచ్చకపోవడమే కాదు, తినలేకపోవడం, తింటే వికారంగా అనిపించడం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈస్ట్రోజెన్ హార్మోన్ కూడా బాగా పని చేస్తుంది. అందువల్ల బాగా ఎఫెక్ట్ అయ్యేది స్మెల్. వీటితో పాటూ బ్లోటింగ్, వికారం, వాంతులు వంటివి ఉంటే ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. బాగా ఎక్కువ ఆకలి వేస్తున్నా, అసలు ఆకలి వెయ్యకపోయినా కూడా ప్రెగ్నెన్సీ గా అనుమానించచ్చు.

​క్రాంప్స్

క్రాంప్స్, కడుపులో నొప్పి వంటివి పీరియడ్ కి ముందు సాధారణంగా అందరూ అనుభవించేదే. అయితే, ఇదే నొప్పి, లేదా క్రాంప్స్ ప్రెగ్నెన్సీ కి కూడా సూచన కావచ్చు. యుటెరస్‌లో పిండం సెటిల్ అయ్యేటప్పుడు కొంత మంది ఈ నొప్పిని ఫేస్ చేస్తారు. అందరికీ ఇలా జరుగుతుందని చెప్పలేం కానీ, దీన్ని ఒక పాజిటివ్ సైన్ గా తీసుకోవచ్చు.

​హార్మోనల్ ఛేంజెస్..

పీఎమెస్ కీ ప్రెగ్నెన్సీ కీ లక్షణాలు ఒకేలా ఉంటాయి. రెండిటికీ హార్మోనల్ ఛేంజెస్ ఉంటాయి కాబట్టి లక్షణాలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే, ఒక చిన్న తేడా ఉంది. పీఎమెస్ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ప్రెగ్నెసీ వల్ల వచ్చే లక్షణాలు ఇంకొన్ని ఛేంజెస్‌తో కలిపి వస్తాయి. అవేంటో తెలుసుకోండి.

​బ్రెస్ట్స్‌లో మార్పు..

బ్రెస్ట్స్ టెండర్ గా, తాకితే నొప్పి గా అనిపించడం ఎస్సెన్షియల్ గా పీఎమెస్ లక్షణం. అలాగే ఇది ప్రెగ్నెన్సీ లక్షణం కూడా. టెండర్ గా ఉండడం తో పాటూ కొద్దిగా సైజ్ పెరిగినా, నిపిల్ చుట్టూ ఉండే ఏరియా కలర్ మారినా, సైజ్ మారినా అది ఈస్ట్రోజెన్ వల్ల జరుగుతుంది. నెలలు గడుస్తున్న కొద్దీ బ్రెస్ట్స్ బాగా సెన్సిటివ్ గా కూడా తయారౌతాయి.

​ఎక్కువసార్లు మూత్రం….

ఎక్కువ సార్లు బాత్ రూం కి వెళ్ళవలసి వస్తుంటే అది డెఫినెట్ గా ప్రెగ్నెన్సీ లక్షణమే. లాస్ట్ పీరియడ్ నించీ మీరు ఈ సమస్యని ఫేస్ చేస్తుంటే మీరు గర్భం ధరించిన అవకాశం ఎక్కువ. ఎందుకంటే, కన్సెప్షన్ జరిగిన రెండు వారాల నించే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మాటి మాటికీ యూరిన్ పాస్ చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది.

​వెజైనల్ డిశ్చార్జ్

వైట్ డిస్చార్జ్ క్వాలిటీ ని బట్టి కూడా ప్రెగ్నెన్సీ అవునా కాదా అని తేల్చుకోవచ్చు. మీరు ప్రెగ్నెంట్ అయితే మీ వైట్ డిస్చార్జ్ కొద్దిగా చిక్కగా ఉంటుంది. మామూలు సమయాల్లో పల్చగా ఉండే డిస్చార్జ్ ఇప్పుడు చిక్కగా తయారౌతుంది.

​బాడీ టెంపరేచర్

విశ్రాంతిగా ఉన్నప్పుడు బాడి టెంపరేచర్ ని చెక్ చేసుకోవడం కూడా ఒక మంచి ఆప్షన్. ఒక పది రోజుల పాటూ ఒకే సమయంలో మామూలు కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటే మీరు గర్భం ధరించిన అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి లక్షణాలు చూసి మీరు ప్రెగ్నెంట్‌ అని భావించొచ్చు. ఒక్కోసారి ఇలాంటి లక్షణాలు ఏం లేకుండా ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. అది శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది.