Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఈ అలవాట్లతో మీ సెక్స్ సామర్థ్యం హుష్‌కాకి

ఈ అలవాట్లతో మీ సెక్స్ సామర్థ్యం హుష్‌కాకి


నేటి బిజీ లైఫ్‌లో ఆడా మగా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ ప్రభావం వారి సెక్స్ లైఫ్‌ కూడా పడుతోంది. అందుకే నేటితరం సెక్స్‌ను సరిగా ఎంజాయ్ చేయలేకపోతోంది. పడుకునే ముందు ఏదో రొటీన్ పని కానిచ్చేయడం, తర్వాత పడుకోవడం.. ఇదే దినచర్య అన్నట్లుగా సాగుతోంది వారి లైఫ్. మారిన జీవనశైలితో స్త్రీ, పురుషుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది వారి సెక్స్ సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. కొన్ని ప్రమాదకర అలవాట్లతో సెక్స్ పవర్ క్రమంగా తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ అలవాట్లేమిటో తెలుసుకుందామా..

వ్యాయామం చేయకపోవడం
మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఇది బాడీతో పాటు బ్రెయిన్‌ను షార్ప్‌గా చేస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ జరిగి స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీని ప్రభావంతో వారిలో సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

జంక్ ఫుడ్స్ తినడం
జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఊబకాయం వస్తుంది. దీంతో ఏ పని చేయాలన్నా ఆసక్తి తగ్గిపోతుంది. ఇది సెక్స్ లైఫ్ మీద కూడా ప్రభావం చూపుతుంది. శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోవడంతో పాటు మగాళ్లలో టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదల గాడి తప్పుతుంది. దీంతో వారి సంతానోత్పత్తిపైనా ప్రభావం చూపుతుంది. స్త్రీ, పురుషులు వీలైనంత వరకు జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటే వారి సెక్స్ లైఫ్ సాఫీగా సాగుతుంది.

నిద్రలేమి
నిద్రలేమి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అర్ధరాత్రుళ్లు వరకు మేల్కొని ఉదయం లేటుగా లేచేవాళ్లకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో జీవించే వారికి ఈ విధమైన లైఫ్‌స్టైల్ ఉంటుంది. అలాంటి వారు ఈ అలవాటును మార్చుకుంటే వారి శరీరంలో సెక్స్ హార్మోన్లు సక్రమంగా విడుదలై ఆ సామర్థ్యాన్ని పెరుగుతుంది.

మద్యపానం
నేటి కాలంలో మద్యపానం అలవాటు లేనివారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. పురుషులకు ధీటుగా మహిళలు కూడా మందు తాగేస్తున్నారు. ఈ అలవాటు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మద్యపానం అలవాటున్న వారి శరీరంలో హార్మోన్ల విడుదల గాడి తప్పుతుంది. మగాళ్లలో వృషణాలు దెబ్బతింటాయి. ఇది వారి సెక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

స్మోకింగ్
అన్ని దురలవాట్లలో కంటే స్మోకింగ్ అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి. రక్తనాళాలు డ్యామేజ్ అయి రక్తప్రసరణ తగ్గిపోతుంది. హార్మోన్లు సక్రమంగా విడుదల కావు. స్త్రీ, పురుషులకు మూడ్ వచ్చినప్పుడు వారి అంగం, జననాంగాల వద్ద రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. స్మోకింగ్ అలవాట్లు ఉన్నవారికి రక్తనాళాలు మూసుకుపోయి ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఇది వారి సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది