పొడవైన జుట్టును అందించుటలో పసుపు చేసే మ్యాజిక్

0

టర్మరిక్ పౌడర్, తెలుగులో పసుపుగా పిలువబడే సమ్మేళనం వలన ఆరోగ్యానికి మరియు అందాని కలిగే ప్రయోజనాల గురించి దాదాపు అందరికి తెలిసిందే. అద్భుతమైన ఔషదం నయం చేసే మరియు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. ముఖ చర్మం మరియు శరీరంపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించే మంచి ఔషదంగా దీనిని పేర్కొనవచ్చు. అంతేకాకుండా, దీని వలన జుట్టుకు వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? పొడవైన జుట్టు అందించుటలో పసుపు ఏ విధంగా సహాయపడుతుందో ఇక్కడ తెలుపబడింది.

చుండ్రుకి చికిత్స
పసుపు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండి చుండ్రును నివారిస్తుంది. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను తీసుకొని, కొద్దిగా పసుపును కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను తలపై చర్మానికి అప్లై చేసి, కొద్ది సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో జుట్టును కడిగి వేయాలి. ఈ మిశ్రమం తలపై చర్మాన్ని శుభ్రపరచటమే కాకుండా, చుండ్రును కూడా నివారించి, తలపై చర్మంలో రక్త ప్రసరణ పెంచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టు రాలటాన్ని నివారిస్తుంది
జుట్టు సంరక్షణ నియమాలలో ఈ అద్భుతమైన ఔషదాన్ని కలుపుకోవటం వలన జుట్టు రాలటం తగ్గి, వెంట్రుకల పెరుగుదల కూడా ప్రోత్సహించబడుతుంది. దీని కోసం గానూ పచ్చి పాలలో పసుపును కలపండి. ఒకవేళ మీరు పొడి వెంట్రుకలను కలిగి ఉంటే, ఈ మిశ్రమానికి 2 చెంచాల తేనెను కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై చర్మానికి మసాజ్ చేయండి. కొద్ది సమయం తరువాత తేలికపాటి షాంపూతో వెంట్రుకలను కడిగి వేయండి. మంచి ఫలితాల కోసం, ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు వాడటం ద్వారా పొడవైన, మెరిసే జుట్టును పొందవచ్చు.

మంచి హెయిర్ కలర్
మీ జుట్టు రంగు మారటకు హెన్నాను వాడుతున్నారా? వాడే హెన్నాకు కొద్దిగా పసుపు కలపటం ద్వారా జుట్టుకు మంచి షైనింగ్ అందించిన వారవుతారు. పసుపు కలిపిన హెన్న ప్యాక్ ను కు కనీసం 3 నుండి 4 గంటల వరకు ఉంచి తరువాత చల్లటి నీటితో కడిగి వేయండి. తేలిక పాటి గాడతలు గల షాంపూ మరియు కండిషనర్ లను వాడండి.
Please Read Disclaimer