గర్భం దాల్చడానికి సరైన వయస్సు..

0

ప్రశ్న : నాకు పెళ్లయి మూడు నెలలు అవుతుంది. నా వయస్సు 21 సంవత్సరాలు. నాకు ఇప్పుడే పిల్నల్ని కనాలని లేదు. మా ఆయన మాత్రం రోజూ నాతో తెగ సెక్స్ చేసేస్తుంటాడు. ఆయన్ని కండోమ్ వాడమంటే కూడా వాడడు. నాకేమో భయం వేస్తూ ఉంది.

అప్పుడే పిల్లల్ని కంటే తర్వాత ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదని నా అభిప్రాయం. ఎక్కడికి వెళ్లడానికి ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాదు బాడీ కూడా మొత్తం షేప్ మారిపోతుంది. అప్పుడు మా ఆయనకు నాపై ఇంట్రెస్ట్ కూడా పోతుంది.

బాగా ఎంజాయ్ చేసి..
అందుకే కొన్నాళ్లు బాగా ఎంజాయ్ చేసి తర్వాత పిల్లల్ని కనాలని నేను అనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ అయితే ఆ బాధలు కూడా భరిచలేం. ఇవన్నీ ఇప్పుడే అవసరమా అని నాకు అనిపిస్తూ ఉంటుంది.

గర్భంరావాలి అనుకున్నప్పుడు..
మా ఆయనేమో ఇప్పుడు నువ్వు గర్భం రాకుండా ఏవైనా జాగ్రత్తలు పాటిస్తే తర్వాత నీకు గర్భంరావాలి అనుకున్నప్పుడు అసలుకే రాదు అని భయపెడుతున్నాడు. గర్భం దాల్చే వయస్సు దాటిపోయిన తర్వాత నేను ఎంత సెక్స్ చేసినా కూడా నువ్వుప్రెగ్నెంట్ కాలేవని చెబుతున్నాడు. అసలు గర్భం దాల్చడానికి సరైన వయస్సు ఏమిటో చెప్పండి.

ఇరవై నుంచి ఇరవై ఐదు

సమాధానం : ప్రెగ్నెన్సీ విషయంలో చాలా మంది భార్యాభర్తలు చాలా ప్లాన్స్ వేసుకోవడం సహజం. సాధారణంగా అమ్మాయిలు గర్భం దాల్చడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అనువైన వయస్సు. ఆ వయస్సులో శారీరకపరంగా, మానసికంగా సిద్దంగా ఉన్న తర్వాత గర్భం దాల్చొచ్చు.

30 ఏళ్ల తర్వాత వద్దు

ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల వయస్సులో ఫెర్టిలిటీ బాగా వుంటుంది. అమ్మాయిలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. గర్భం పోవడాలు వంటి సమస్య కూడా ఉండదు. 30 ఏళ్ల తర్వాత ఫెర్టిలిటీ సామర్థ్యం తగ్గిపోతుంది.

సో కొన్నాళ్లు ఎంజాయ్ చేసి ప్లాన్ చేసుకుని సరైన సమయంలో గర్భం దాల్చడానికి ప్రయత్నించండి. ఎంజాయ్ పేరుతో ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తే మీ ఆయన చెప్పినట్లుగా తర్వాత గర్భం దాల్చడం కష్టం అవుతుంది.
Please Read Disclaimer