పిల్లల ముందు ఇలా చేయొద్దు.. నిపుణుల సలహా..

0

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా చిన్న చిన్న తగువులు సహజమే. అదే విధంగా భార్యాభర్తల విషయంలోనూ.. అయితే, గొడవ పడడంలో తప్పులేదు. కానీ, అది అందరి ముందు.. ముఖ్యంగా మీ పిల్లల ముందు గొడవ పడడం అంత మంచిది కాదు. దీని వల్ల వారి పెరుగుదలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

పిల్లల పెంపకం విషయంలో ప్రతీ ఒక్క విషయంలోనూ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా విషయాలు చూడ్డానికి చిన్నగా ఉంటాయి. కానీ, అవి మనకి చిన్న విషయాలు.. చిన్న పిల్లలకి అవే పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోతాయి.. కాబట్టి వారి ముందు అన్ని విషయాలు చర్చించకపోవడమే మంచిది. ఇంట్లో జరిగే వ్యవహారాలు పిల్లల దీర్ఘాకాలిక మానసికాభివృద్ధి, ఆరోగ్యం వంటి అంశాలపై ఎంతో ప్రభావం చూపుతాయి..

ఆ ఆలోచనలే పిల్లల్ని వెంటాడుతాయి..

ఏదైనా విషయంలో పిల్లల ముందు మనం చర్చిస్తే.. వారు అదే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది వారి చిన్ని మనసులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా.. మానసిక ఆరోగ్యం నుంచి చదువుల్లో రాణించటం వరకూ అనేక అంశాల్లోనూ ప్రభావం చూపుతాయి. కాబట్టి వారి ఎదుట ఏవీ మాట్లాడాలి.. ఏం మాట్లాడకూడదు.. ఇలాంటి అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలి.

పిల్లల ముందు అరవొద్దు..

గొడవలు పెట్టుకోకుండా ఎవరూ ఉండరు. అయితే, అవి కూడా హద్దుల్లో ఉండాలి. ఉదాహారణకి చాలా మంది భార్యాభర్తలు గొడవలు పెట్టుకున్నప్పుడు పెద్దగా అరుచుకుంటారు. పిల్లలు ఉన్నది కూడా చూడరు. దీంతో పిల్లలు ఆందోళనకు గురవుతారు. ఓ రకంగా చెప్పాలంటే.. వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరగటం, ఒత్తిడి హార్మోన్లు స్పందించటం వంటి వాటికి లోను కావొచ్చు. ఇది వారి మానసిక, శారీరక ఎదుగుదలపైనే తీవ్ర ప్రభావం చూపొచ్చు.

ఎదురయ్యే పరిణామాలు..

అధ్యయనాల ప్రకారం పిల్లల పెంపకం సరిగ్గా ఉంటే వారు.. భవిష్యత్‌లోనూ అన్ని చక్కగా సమకూర్చుకోగలరు. అలా కాకుండా ఉంటే.. ఇలాంటి వాతావరణంలోనే పిల్లలు పెరిగితే.. వారి ఆలోచనా విధానం కూడా ఇలానే ఉంటుంది. వారు సమాజానికి వ్యతిరేకంగా ఆలోచించడం, అలాంటి ఆలోచనా విధానం కలిగి ఉంటారు. హింసాత్మక ప్రవర్తన వారిలో ఎక్కువగా ఉంటుంది. ప్రేమకు చాలా దూరంగా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులను అసహ్యించుకుంటారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

ఇలా చేయండి..

ఏ గొడవలు అయినా సరే, మీరు చర్చించుకునేటప్పుడు పిల్లలు లేకుండా చూసుకోండి. ఒకవేళ మీ మధ్య మనస్పర్థలు వచ్చినా అది వారి ఎదుట బయటపెట్టకండి. దీంతో మీ గదిలోనే అలాంటి గొడవలను పరిష్కరించుకోండి. అప్పుడే పిల్లల అభివృద్ధికి మీరు బాటలు వేసిన వారవుతారు. ఇలాంటి చిన్న విషయాలు పాటించడం వల్ల నేటి చిన్నారులే.. రేపటి ఆరోగ్యవంతమైన బాటలు వేసేందుకు కారణం అవుతారని మరిచిపోవద్దు.

పిల్లల్ని పెంచే విషయంలో చాలా మంది మేము వారికి ఇంత ఖరీదు చేసే వస్తువులని కొనిచ్చాం.. ఇన్ని విలువైనవి బహుమతిగా ఇచ్చాం.. పెద్ద పెద్ద స్కూళ్లల్లో చదివిస్తున్నాం.. ఇలా చెబుతుంటారు. కానీ, అవన్నిటికంటే.. మన విధానం ఎలా ఉంది.. వాటి ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు.. ఇలాంటి విషయాలన్నీ గమనించడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-