బెడ్రూమ్‌లో రెచ్చిపోయిన ప్రియురాలు.. అక్కడ కొరికేయడంతో..

0

బెడ్రూమ్‌లో ఉద్రేకంతో రెచ్చిపోయిన మహిళ.. బాయ్‌ఫ్రెండ్‌కి ముద్దుపెట్టి జైలుపాలైన ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. ముద్దుల దాడిలో ప్రియుడిని దారుణంగా గాయపరచడంతో పోలీసులు ప్రియురాలిని అరెస్టు చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ లేడీ ముద్దు ఘాటుకి ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మిచిగాన్‌లో వెలుగుచూసింది.

మిచిగాన్‌కి చెందిన యులెట్ వెడ్జ్‌వర్త్ అనే 52 ఏళ్ల మహిళ కామోద్రేకంలో ప్రియుడిని గాయపరిచింది. బెడ్రూమ్‌లో ఉన్న సమయంలో ప్రియుడిపై ముద్దుల వర్షం కురిపించిన ప్రియురాలు.. స్మూచ్ కిస్ చేసింది. అయితే కాస్త మొరటుగా ప్రవర్తించడంతో ఇబ్బందులు కొనితెచ్చుకుంది. ముద్దు పెడుతూ ప్రియుడి నాలుకను కొరికేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి నోరంతా రక్తంతో నిండిపోయింది.

వెడ్జ్‌వర్త్ కొరికిన దెబ్బకి బాధితుడి నాలుక ఒక అంగుళం మేర తెగి కిందపడిపోయింది. మహిళ మొరటు ప్రవర్తనని భరించలేని ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు బెడ్రూమ్‌లో సీన్ చూసి ఒకింత షాక్‌కు గురయ్యారు. తెగిపడిన నాలుకను సేకరించి.. నోటి నిండా రక్తంతో బాధపడుతున్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

వెడ్జ్‌వర్త్‌ని అరెస్టు చేసిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మిచిగాన్ చట్టాల ప్రకారం ఆమెకు ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏడాది జైలుతోపాటు వెయ్యి డాలర్ల జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-