1000 అబద్దాలు రివ్యూ

0

 

1000 Abaddalu Live Updates – Tweet Review in Telugu

…………..సినిమా సమాప్తం ………. 1000 Abaddalu Full Movie Review Follows in a Short while from now

1:30 pm : మినిస్టర్ డిఎన్ఎ కోసం సత్య (సాయిరాం శంకర్) తన ప్రాణాలకు తెగిస్తాడు.

1:25 pm : సాయిరాం శంకర్ తన ప్రాణాలు రిస్కులో పెట్టి హీరోయిన్ సేవ్ చేస్తాడు.

1:16 pm : ఒకరిని సంతోషం కోసం అబద్దాలు చెబితే నమ్మించడం కాదు సాయిరాం శంకర్ డైలాగ్

1:08 pm : నాగబాబు చైనా, ఇండియా కంపారిజన్ కొంచెం లిమిట్ దాటి చేసినట్లు అనిపిస్తుంది.

12:58 pm: నాగబాబు, సాయిరాంశంకర్ ఫృద్వి తో పోలీస్ స్టేషన్ లో సీన్ బాగుంది.

12:47 pm: ‘ భూకంపమే వచ్చిన’ కొంత ఊపినిచ్చింది. థియేటర్లో చాలా ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు

12:38 pm : మందు ఫిలాసఫీ : 20-30 వాళ్లు ఇష్టంతో తాగుతారు, 30-40 కష్టంతో తాగుతారు,40-50 నష్టంతో తాగుతారు,50-60 వాళ్లు సిస్టం కోసం తాగుతారు

12:26 pm : హీరోయిన్ సత్య ను లైన్లో పెట్టడానికి హీరో సత్య ఆడిన అబద్దాలన్నీ మెల్ల మెల్లగా తెలిసి పోతున్నాయి.

12:23 pm: విశ్రాంతి వరకు ఇది అసలు తేజ సినిమానేనా అనిపించేలా ఉంది. సెకండ్ ఆఫ్ లో అయిన తన మార్క్ చూపిస్తాడో లేదో అని ఎదురుచూపులు థియేటర్లో

……. విశ్రాంతి ……….

12:05 pm : జీనా హై తో మర్నా సీకో ఫస్ట  ఆఫ్ లో బెస్టు డైలాగ్ ఇదే

12:03 pm : చెవికి రింగు లేని అమ్మాయి అయినా ఉంటుంది కానీ చేతిలో సెల్ లేని అమ్మాయి ఉంటుందా సత్య డైలాగ్

11:50 am: టవర్ స్టార్ (నాగబాబు) పవర్ స్టార్ ఫ్యాన్ గా ఎంట్రీ థియేటర్లో కాస్తంత నవ్వులు పండించాయి.

11:45 am : సినిమాలో హీరో, హీరోయిన్ల పేర్లు సత్య అందుకే కామెడీ గా ఉంది.

11:39 am : చిన్నగ్యాప్ లోనే మరో పాట ‘ నువ్వు అగ్గిపుల్ల అయితే ’ పాట బాగానే ఉంది.

11:30 am: షాప్ కీపర్ (సత్యం రాజేష్) సాయరాం శంకర్ కు సహాయం చేస్తాడు. హేమ కస్టమర్లను ఎలా ఎట్రాక్ట్ చేయాలో బాయ్స్ కు వివరిస్తుంది.

11:25 am : ఫస్టు సాంగ్ ‘ అయ్యయ్యో ఏం పిల్లరోయ్ ’ పాట కొరియోగ్రఫీ బాగానే ఉంది. కానీ కొంచెం  జానీ ట్రాక లో ఉంది.

11:20 am : సాయి రాం శంకర్ ప్రయాణిస్తున్న ప్యాసింజ్ రైల్ సీన్లు మరీ సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుంది. కామెడీ అంతగా లేదు

11:17 am : జోష్ రవి, బాబు మోహన్ ప్యాసింజర్ మెట్రో రైల్లో ప్రయాణం చేస్తుండగా సత్య (సాయిరాంశంకర్ ) కనిపిస్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెబుతాడు.

11:15 am : డ్రైవర్ (వేణు) క్లీనర్ (నవీన్) ల కామెడీ సీన్ అదిరిపోయింది. థియేటర్లో నవ్వులే నవ్వులు

11:10 am : పెళ్లి చూపుల సీన్ తో సినిమా మొదలు, అంతలోనే పోలీసు ఎంట్రీ స్మగ్లింగ్ కేసులో సత్యను అరెస్టు చేయడానికి వస్తారు.

11:05 am : హాయ్ ! గుడ్ మార్నింగ్. రీడర్స్ కు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాయిశంకర్ నటించిన 1000 అబద్దాలు సినిమా ట్విట్ రివ్యూకి స్వాగతం

ప్రివ్యూ: 1000 అబద్దాలు

చిన్న సినిమాల‌కు ఓ సరికొత్త ఇమేజ్ తెచ్చిన ద‌ర్శకుడు తేజ‌. చిత్రం సినిమాతో చిన్న సినిమా రూపురేఖ‌ల్ని పూర్తిగా మార్చేశారాయ‌న‌. చిన్న సినిమా ఇలాక్కూడా తీయొచ్చు.. అని నిరూపించారు. ఆయన ద‌య‌వ‌ల్లే – కొత్త మొఖాల‌తో సినిమా తీయొచ్చు అనే న‌మ్మకం ద‌ర్శకుల‌కు క‌లిగింది. జ‌యం, నువ్వు నేను ఇలా హ్యాట్రిక్ విజ‌యాల‌తో త‌న ప్రస్థానాన్ని మొద‌లుపెట్టారు. అయితే ఆ త‌ర‌వాత ఊహించ‌ని ప‌రాజ‌యాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. అటు ద‌ర్శకుడిగా, ఇటు నిర్మాతగా విఫ‌ల‌మ‌య్యారు. త‌న‌కు తాను నిరూపించుకోవ‌ల‌సిన ద‌శ‌లో వ‌స్తున్న సినిమా…. 1000 అబ‌ద్దాలు. ఈ గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని హైలెట్స్ ఓసారి ప‌రిశీలిస్తే…

* ఏ ఫిల్మ్ నాట్ బై తేజ – అనే క్యాప్షన్‌తో తీసిన సినిమా ఇది. తేజ త‌న శైలి నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చి తీసిన సినిమా ఇది. ఆయ‌న ప్రేమ క‌థ‌లు చాలా తీసినా వాటిలో హింస‌, వినోదం స‌మ ఉజ్జీగా నిలిచాయి. ఈసారి పూర్తిగా వినోదాత్మక సినిమానే తీశార‌ట‌. టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వ‌ర‌కూ న‌వ్వుతూనే ఉంటార‌ని తేజ న‌మ్మకంగా చెబుతున్నారు.

* సాయిరామ్ శంక‌ర్, ఎస్తేర్ జంట‌గా న‌టించారు. బంప‌ర్ ఆఫ‌ర్ త‌ర‌వాత ఆ జోరు కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు సాయి. ఎస్తేర్ కూడా అందంగానే క‌నిపిస్తోంది. ఈ సినిమా త‌ర‌వాత త‌న‌కు మ‌రిన్ని అవ‌కాశాలు అందుతాయ‌ని భ‌రోసా పెట్టుకొంది.

* ర‌మ‌ణ గోగుల ఈ సినిమాకి సంగీతం అందించారు. చాలా కాలం త‌ర‌వాత ర‌మ‌ణ‌గోగుల పనిచేసిన సినిమా ఇది. ఆయ‌న కూడా త‌న స్టైల్‌ని మార్చుకొన్నార‌ట‌. ఓ పాట కూడా రాశారు.

* ఈ సినిమాలోని ఓ పాట సింగిల్ టేక్‌లో తీశారు. ఆ పాట కోసం చాలా రోజులు రిహార్స‌ల్స్ జ‌రిపారు. ఆ పాట ఎలా ఉంటుందో చూడాలి.

* సినిమా అంతా స‌త్య అనే పేరు చుట్టూ తిరుగుతుంది. ఇంత‌కీ స‌త్య ఎవ‌రు? ఆమె వెనుక ఉన్న క‌థేమిటి? అనేది సస్పెన్స్‌.

* నాగ‌బాబు పాత్ర ప్రత్యేక ఆక‌ర్షణ అని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయ‌న ట‌వ‌ర్ స్టార్ గా న‌వ్వులు పంచ‌బోతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ గా క‌నిపిస్తారు.

* ఈ సినిమాకి యు/ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది.

* మిగ‌తావారి సంగ‌తేమోగానీ.. తేజ‌, ర‌మ‌ణ‌గోగుల‌కు ఈ సినిమా విజ‌యం కీల‌కం. వారిద్దరినీ ఈ సినిమా ఏ దారిలో న‌డిపిస్తుందో చూడాలి.