విజయ్ అన్న : రివ్యూ

0

 

చిత్రం : అన్న
దర్శకుడు : ఎ.ఎల్. విజయ్
నిర్మాత : బీ కాశీ విశ్వనాథం
సంగీతం : జీ.వి. ప్రకాష్ కుమార్
నటీనటులు : విజయ్, అమలా పాల్

అన్న రివ్యూ: చిత్రకథ
ముంబై ధారావి లో రామ మూర్తి (సత్యరాజ్) మరియు కొంతమంది తెలుగు వాళ్ళు నివశిస్తుంటారు అక్కడ లోకల్ మరాఠీ వారు తెలుగు ప్రజల మీద దాడులు చేస్తుంటారు. ఇలా మరాఠీ లకు మరియు తెలుగు ప్రజలకు జరుగుతున్న గొడవల మూలంగా రామ్మూర్తి “అన్న ” గా మారుతాడు ఈ గొడవల్లో తన కొడుకు విశ్వా (విజయ్) కి ఎం కాకూడదు అని నాజర్ కి ఇచ్చి ఆస్ట్రేలియా పంపేస్తాడు. ఆస్ట్రేలియా లో మినరల్ వాటర్ బిజినెస్ చేసుకునే విశ్వా కి డాన్స్ చెయ్యడం హాబీ అందుకే “తెలుగు బాయ్స్” అని ఒక గ్రూప్ తో డాన్స్ చేస్తుంటాడు. ఇలా నడుస్తుండగా విశ్వా జీవితంలోకి మీరా (అమల పాల్ ) ప్రవేశిస్తుంది. మీరా తో ప్రేమలో పడ్డ విశ్వా మీరా తండ్రిని కలవడానికి ముంబై వస్తాడు. కథ ఇలా నడుస్తుండగా రామమూర్తి మరియు భీమ ( అభిమన్యు సింగ్) కి మధ్య జరుగుతున్న గొడవలో రామమూర్తి చనిపోతాడు ఇక్కడ నుండి కథ ప్రధాన మలుపు తీసుకుంటుంది అసలు రామూర్తి ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు ? భీమ నుండి ధారవి ప్రజలను ఎవరు ఎలా కాపాడారు? విశ్వా మీరాను పెళ్లి చేసుకున్నాడా లేదా? అనేది మిగిలిన కథ

అన్న రివ్యూ: నటీనటుల ప్రతిభ
తమిళ నాట భారీ క్రేజ్ ఉన్న విజయ్ ఈ చిత్రంలో అదే స్థాయికి నటించారు. చిత్రం మొత్తాన్ని తన భుజాల మీద మోసుకొచ్చారు. అలానే అమలా పాల్ పాత్ర ఈ చిత్రంలో చాలా కీలకం పాత్రకు తగ్గట్టు గానే అమలా పాల్ కూడా తన నటనతో ఆకట్టుకుంది , ఇక వన్ లైనర్ లతో సంతానం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సత్యరాజ్ తన స్థాయికి తగ్గ నటన కనబరిచి ఆకట్టుకోగా పోన్ వన్నాన్ కూడా చాల బాగా నటించారు . ఇక సురేష్ మరియు అభిమన్యు లు ఆహర్యమ్ బాగున్నా పాత్రలో బలం లేకపోవడంతో తేలిపోయారు. మిగిలిన వారందరు తెర మీద కనిపించడానికే కాని నటించడానికి కాదు అన్నట్టు అల వచ్చి వెళ్ళిపోయారు.

అన్న రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

దర్శకుడు కె ఎల్ విజయ్ “నాన్న ” మరియు “తాండవం ” చిత్రంతో మన ప్రేక్షకులకు బాగా పరిచయమే వైవిధ్యమయిన కాన్సెప్ట్ లతో మన ముందుకి వచ్చినా గత చిత్రాలలో లానే ఈ చిత్రలో కూడా వేగవంతమయిన కథనంతో రాలేకపోయారు. కొసమెరుపుగా ఈ చిత్ర కథ కూడా రొటీన్ గ ఉంది , మాస్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ని స్టైలిష్ గ చూపెట్ట గలిగారు కాని మాస్ కి నచ్చేలా తెరకెక్కించ లేకపోయారు. మొదటి అర్ధభాగంలో పరవాలేదనిపించిన దర్శకుడు రెండవ అర్ధ భాగం వచ్చేసరికి దారుణంగా విఫలం అయ్యాడు. కథనం విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది లొకేషన్స్ ని చాలా అందంగా చూపించారు నటీనటులను కూడా చాలా అందంగా చూపించారు. నేను తీసే అన్ని సన్నివేశాలు ముఖ్యమయినవే కత్తిరించడానికి వీల్లేదు అని దర్శకుడు చెప్పినట్టు ఉన్నాడు కాబోలు ఎడిటర్ ఒక్క సన్నివేశాన్ని కూడా కత్తిరించకుండా ప్రేక్షకుల ముందు అలానే ఉంచేసాడు. పాటలు బానే ఉన్న హీరో ఎలివేషన్ సన్నివేశాలలో జి వి ప్రకాష్ నేపధ్య సంగీతం దారుణం.

అన్న రివ్యూ: హైలెట్స్

  • విజయ్ నటన
  • సంతానం కామెడీ
  • సినిమాటోగ్రఫీ

అన్న రివ్యూ: డ్రా బాక్స్

  • బాగా పొడవయిన చిత్రం
  • నెమ్మదయిన స్క్రీన్ ప్లే
  • కీలక సన్నివేశాలలో నేపధ్య సంగీతం

అన్న రివ్యూ: విశ్లేషణ

తెలుగులో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయిన విజయ్ తుపాకితో తన ఉనికిని చాటుకున్నాడు. దాని క్రేజ్ తో “అన్న” చిత్రాన్ని తెలుగులో విడుదల చేసారు తమిళంలో కన్నా ముందే తెలుగులో వచ్చిన ఈ చిత్ర ఫలితం అక్కడ ఫలితం మీద ప్రభావం చూపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటె తుపాకి చిత్రంతో వచ్చిన క్రేజ్ ని కాపాడుకోవాలన్న ప్రయత్నం విజయ్ నటనలో కనిపిస్తుంటుంది. ఒకానొక సమయంలో ప్రేక్షకుడికి విజయ్ తప్ప మరెవరు కనిపించరు అంతలా భుజాన వెసుకొచ్చారు చిత్రాన్ని, దర్శకుడు ఏ ఎల్ విజయ్ గతంలో తెరకెక్కించిన నాన్న మరియు తాండవం లానే ఈ చిత్రంలో కూడా కథకి “కట్” చెప్పకుండా ఎంతవరకు వస్తే అంతవరకు తీసేద్దాం అన్నట్టు తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ కామెడీ తో గడిపేసి అయిపోనిచ్చాం అనుకున్నాడు కాని కీలకమయిన రెండవ అర్ధభాగంలో అసలు సమస్య వచ్చింది, చెప్పాల్సిన విషయం ఎక్కువ ఉండిపోయింది, ప్రతి విషయాన్ని చెప్పాలి అన్న దర్శకుడి తాపత్రయం లేని సాగాదీతను తెర మీదకు తీసుకొచ్చింది.

కీలక సన్నివేశాలలో హీరో ఎలివేషన్ అసలు బాగోలేదు ఇదే సన్నివేశాన్ని మన తెలుగు దర్శకుడు అయ్యుంటే అరిపించేవాడు అని ప్రతి తెలుగు హృదయం అనుకుంటుంది. మంచి ఎమోషనల్ సన్నివేశం నడుస్తున్న సమయంలో జి వి ప్రకాష్ నేపధ్య సంగీతం వర్ణనాతీతం సన్నివేశాన్ని ఎలివేట్ చెయ్యకపోగా నీరసించేలా చేసింది. తమిళ దర్శకులు కొత్తగా ప్రయత్నించగలరు కాని మాస్ చిత్రాలు చెయ్యాలంటే తెలుగు వాళ్ళే కరెక్ట్ అని ఈ చిత్రం చూస్తే ఎవరయినా ఒప్పేసుకుంటారు. చిత్ర నిడివి మూడు గంటలకు పైగా ఉండటం మరో డ్రా బ్యాక్, నిజానికి తుపాకి చిత్రం కూడా పెద్దదే కాని అందులో స్క్రీన్ప్లే ప్రేక్షకుడికి ఆ ఫీల్ రానివ్వదు కాని ఈ చిత్ర స్క్రీన్ప్లే క్లైమాక్స్ వచ్చే సరికి ప్రేక్షకుడికి నీరసం వచ్చేలా ఉంటుంది. ఇకనయిన దర్శకుడు కె ఎల్ విజయ్ కథ చిన్నదిగా రాసుకోవాలి లేదా స్క్రీన్ప్లే వేగంగా ఉండేలా చూసుకోవాలి.
చివరగా
ఇక కథ విషయానికి వస్తే “జయం మనదేరా చిత్రంలో ” ఆంధ్రావాలా” మిక్స్ చేసి సైడ్ డిష్ గా ” శంఖం” చిత్రాన్ని వాడుకున్నట్టు కనిపిస్తుంది. అలా అని కాపీ అనలేము కాని తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళకి ఇది కచ్చితంగా వచ్చే ఫీల్. ఈ చిత్రంలానే దీని విశ్లేషణ కూడా చాలా పొడవుగా వచ్చింది. మూడు గంటల సేపు ఒర్చుకోగలం అనుకునేవాళ్లు డిన్నర్ ప్యాక్ చేసుకొని ఫస్ట్ షో కి వెళ్లిపోవచ్చు లేని వాళ్ళు రెండు రోజులు ఆగితే కొన్ని సన్నివేశాలు కత్తిరిస్తారు తరువాత వెళ్ళండి.

 

విజయ్ అన్న : రివ్యూ – Live Updates in Telugu

……….. సినిమా సమాప్తం ……….

1:45 : చెడుపై మంచి గెలుస్తుంది. భారత దేశం ప్రజలు అందరూ ఒక్కటే బారతీయులం అనే సందేశం

1:40 : రిజలీం ఇష్యూ బీమాకి, విశ్వలకు టర్న్ అవుతుంది.

1:38 : విశ్వ కు ఫాదర్ లేడు. నేను గాడ్ ఫాదర్ లా ఉంటా సంతానం ఫన్నీ డైలాగ్

1:37: భీమా బాయ్ మతకల్లోలను ఆసరాగ తీసుకోవాలనే చూస్తాడు. విశ్వ వచ్చే సమయానికి కంట్రోల్ దాటి పోతుంది.

1:35: నాకు చంపడానికి కారణం మాత్రమే ఉంది. నీకు హక్కు ఉంది డైలాగ్

1:30 : ‘దళపతి దళపతి’ అనే పాట ద్వారా రాంమూర్తి స్థానం విశ్వ(విజయ్) తీసుకుంటాడు.

1:28 pm : నాయకత్వం అనేతి మనం కోరుకుంటే వచ్చేది కాదు. జనం కోరుకుంటే వచ్చేది లాయర్ విశ్వతో చెప్పే డైలాగ్ చాలా బాగుంది.

1:25 pm : మీరా(అమలాపాల్) విజయ్ ను జైళు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సీన్ సూపర్ గా ఉంది.

1:15 pm: దరావై ప్రజలు విశ్వ (విజయ్) పై నమ్మకంతో తిరిగి వస్తారు. ఇంటర్వెల్ తర్వాత మంచిగా అనిపిస్తున్న సీన్ ఈ సీన్ చాలా బాగుంది.

1:10 pm: భద్ర గ్యాంగ్ విశ్వ ఫ్యామిలీపై ఎటాక్ చేస్తాడు. దారవై లీడర్ షిప్ కోసం

1:05 pm: మన వల్ల పది మంది బాగు పడాలి కానీ పాడై పోవొద్దు డైలాగ్

1:oo pm: రాంమూర్తి బిజినెస్ మొత్తం భద్ర ఆక్రమించుకుంటాడు.

….. విశ్రాంతి…..

12:44 pm : ఇప్పటి వరకు సినిమా రొటీన్ గానే ఉంది. కానీ  ఇంటర్వెల్ కు ముందు సీన్లు కొంచెం బిల్డప్ బాగుంది.

12:38 pm : ఒక్కసారి కత్తి పట్టాక చంపనైనా చంపాలి లేదా చావనైనా చావాలి రాంమూర్తి డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.

12:34 pm : విశ్వ అనుకోకుండా ముంబాయి కి వెళుతాడు. అక్కడ తన తండ్రికి ఉన్న సెక్యూరిటీ, పరిస్థితులు చూసి ఆశ్చర్యపోతాడు. ఈ బిల్డప్ మొత్తం సినిమాలో సూపర్ గా చూపించారు.

12:28pm : విశ్వ ఫైనల్ డ్యాన్స్ తెలుగు బాయ్స్  కాంపిటీషన్ లో విన్ అవుతాడు.

12:22 pm: మీరా(అమలాపాల్) కు చిన్న యాక్సిడెంట్ అవుతుంది. కానీ ఫైనల్ డ్యాన్స్ కాంపిటీషన్ లో గెలుస్తుంది.

12:16 pm : అవతలి వాడి ఆయుధానికి ఆయుధపూజ చేయడం తప్పు బ్రదర్ సంతానం డైలాగ్ విజయ్ లవ్ గురించి చెబుతాడు.

12:11 pm: ‘ ఎం మాయ చేసావే’ పాట చాలా బాగా తీశారు. విజయ్ స్టెప్పులు అదిరిపోయాల ఉన్నాయి.

11:58 am: మీర (అమలాపాల్) ఫేక్ హస్బెండ్ చూడటానికి సంపూర్ణేష్ బాబు లా ఉన్నాడు.

11:50 am:  రెస్టారెంట్ ఓపెనింగ్ సీన్ చాలా కామెడిగా ఉంది. సంతోష్ పంచ్ డైలాగ్స్ చాలా కామెడీగా ఉంది.

11:45 am: అమలాపాల్ ఆస్టేలియాలో ఒక రెస్తారెంట్ ఒనర్ కూతరు. అనుకోకుండా విశ్వను కలుస్తుంది.

11: 38 am : ‘ సూపర్ బాయ్స్’ పాట వస్తుంది.. చాలా బాగా తీశారు.

11:35 am : మనం ఒకదానిలో అడుగు పెడితే గెలిచి తీరాలి రాంమూర్తి విశ్వతో చెప్పే డైలాగ్

11:32 am : రాంమూర్తి (సత్యరాజ్) ముంబాయి లో పేద ప్రజల కోసం మరో ప్రభుత్వాన్ని నడుపుతుంటాడు.

11: 29 am : సినిమా టైటిల్స్ పడుతున్నాయి. టైటిల్స్ బ్యాగ్ గ్రౌండ్ లో రెవెల్యూష్ నరీ పిక్చర్స్ కనబడుతున్నాయి. చాలా బాగుంది.

11: 26 am : భ్రద నుంచి కాపడటానికి రాంమూర్తి తన బాబు విశ్వ (విజయ్)ను నాజర్ వద్ద ఉంచి వెళుతాడు.

11:22 am : రాంమూర్తి ముంబాయి హెర్బర్ లో లేబర్.. తెలుగు ప్రజలను రక్షించడానికి వేదాబాయ్ గా మారుతాడు.

11:20 am : హాయ్!  గుడ్ మార్నింగ్  విజయ్ నటించిన అన్న సినిమా ట్విట్ రివ్యూకి స్వాగతం ..

Anna Movie Review in Telugu, Anna Movie Review, Vijay Anna Movie Review in Telugu, Anna Movie Review Ratings in Telugu, Anna Movie Live updates in Telugu,

విజయ్ అన్న : రివ్యూ | Thalaivaa Live Updates |Thalaivaa Review