అత్తారింటికి దారేది మొదటి షో – లైవ్ రివ్యూ

0

అత్తారింటికి దారేది మొదటి షో – లైవ్

అత్తారింటికి దారేది రివ్యూ

Attarintiki Daredi Review, Ratings – Live Updates

 

Updated at 09:27 AM

క్లైమాక్స్ . సినిమా ముగిసింది. ఈ సినిమా రివ్యూని కాసేపట్లో మీకు అందజేస్తాం.

Updated at 09:17 AM

ఎమోషనల్ డైలాగ్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన పవర్ ను చూపిస్తున్నాడు

Updated at 09:11 AM

సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది. రైల్వే స్టేషన్ లో ఫైట్ సన్నివేశాలు జరుగుతున్నాయి.

Updated at 09:04 AM

పవన్, అలీ, బ్రహ్మానందం, సమంతల మద్య కామెడీ సన్నివేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘కాటమ రాయుడా’ సాంగ్ వస్తోంది.

Updated at 08:53 AM

‘కెవ్వు కేక’ సాంగ్ లో అత్తాపూర్ బాబా గెటప్ లో పవన్ కళ్యాణ్ డాన్స్ చాలా బాగా చేశాడు. ఇది బ్రహ్మానందం ను ఫూల్ చేయడానికి పన్నిన ఒక పథకం .

Updated at 08:45 AM

బ్రహ్మానందం ఇప్పుడే సినిమాలోకి హాస్యాస్పదంగా ఎంట్రీ ఇచ్చాడు. గ్లాడియేటర్, 300 ప్రదర్శనలకు భాస్కర్ అవార్డ్స్ పొందినట్లు

Updated at 08:40 AM

ప్రస్తుతం ‘కిరాకు’ సాంగ్ వస్తోంది. ఈ పాటని పవన్, సమంతలపై చిత్రీకరించారు.

Updated at 08:38 AM

ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సమంత ల మద్య రొమాన్స్ సన్నివేశాలు వస్తున్నాయి. ఈ సినిమాలో చక్కని డైలాగ్స్, మంచి కామిడి ఉంది.

Updated at 08:23 AM

సీన్ గ్రామానికి షిఫ్ట్ అయ్యింది. కోట శ్రీనివాస్ రావు ఇప్పుడే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వైలేంట్ చేజ్ సన్నివేశాలు మొదలైయ్యాయి

Updated at 08:16 AM

ప్రస్తుతం ‘నిన్ను చూడగానే’ సాంగ్ వస్తోంది. ఈ పాటలో సమంత చాలా అందంగా ఉంది. ఈ పాట కోసం దేవీ శ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తిసుకున్నాడు .

Updated at 08:12 AM

పవన్ సిగ్గుపడుతున్నాడు …. థియేటర్ లో ఫాన్స్ విసిల్స్ వేస్తున్నారు… కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

Updated at 07:45 AM

ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు. అవి బాగా పనిచేస్తున్నాయి. ఇంటర్వల్…… సినిమాని చాలా చక్కగా నిర్మించారు. ఇప్పుడు సెకండాఫ్ ఎలా ఉందో చూద్దాం.

Updated at 07:40 AM

ప్రస్తుతం బైక్ చేజ్ సన్నివేశాలు వస్తున్నాయి. పవన్ తో పాటు సమంత ఈ రైడింగ్ లో వుంది.

Updated at 07:34 AM

హీరోయిజం బాగుంది. పవన్ ఇప్పుడే నదియని దివాలా తీయకుండా కాపాడుతాడు. ప్రణీత చూడటానికి చాలా క్యూట్ గా ఉంది. ప్రస్తుతం సూపర్బ్ సాంగ్ ‘బాపు గారి బొమ్మ’ వస్తోంది. ఈ పాటని పవన్, ప్రణీతలపై చిత్రీకరించారు.

Updated at 07:17 AM

సమంత చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండవ పాట ‘ఓరి దేవుడో దేవుడో’ వస్తోంది. హంస నందిని , ముంతాజ్ లు ఈ పాటలో వున్నారు. ఈ పాటని పబ్ లో షూట్ చేశారు.పవన్ ఇక్కడ సూపర్బ్ డాన్స్ చేశాడు.

Updated at 07:08 AM

మిలియనీర్ అయిన పవన్ కళ్యాణ్ సునంద ఇంట్లో కారు డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు. ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు మొదలయ్యాయి.

Updated at 07:00 AM

ఎన్.టి.ఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి లను సినిమాలో కొద్దిసేపు చూపించారు. అలీ మగ నర్స్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 06:57 AM

త్రివిక్రమ్ డైలాగ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ పేరు సిద్దు… రఘుబాబు, బ్రహ్మాజీ మొదలగు వారు తెరకు పరిచయం అయ్యారు.

Updated at 06:52 AM

పోసాని కృష్ణ మురళి ఫైనాన్షియర్ గా తెరకు పరిచయం అయ్యాడు. నదియ చూడటానికి చాలా అందంగా ఉంది.

Updated at 06:47 AM

పోసాని కృష్ణ మురళి ఫైనాన్షియర్ గా తెరకు పరిచయం అయ్యాడు. నదియ చూడటానికి చాలా అందంగా ఉంది.

Updated at 06:43 AM

నదియ పవన్ కళ్యాణ్ అత్తయ్య సునంద గా పరిచయం అయ్యింది. ఎం.ఎస్ నారాయణ ఆమె పర్సనల్ సెక్రెటరీ గా కనిపించడు. రావు రమేష్ సునంద భర్త గా పరిచయం అయ్యాడు.

Updated at 06:38 AM

ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ ‘ఆరడుగుల బుల్లెట్’ వస్తుంది. పవన్ కళ్యాణ్ అతని ‘అత్తా’, బోమన్ ఇరానీల కూతురు కోసం ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యాడు.

Updated at 06:29 AM

బోమన్ ఇరానీ ఇప్పుడే వచ్చాడు. పవన్ కళ్యాణ్ పేరు గౌతం నంద. అతను చాలా స్టైలిష్ గా తెరకు పరిచయం అయ్యాడు. ఓపెనింగ్ ఫైట్ సన్నివేశాలు జరుగుతున్నాయి.

Updated at 06:26 AM

సమంత ని కిడ్నాప్ చేశారు. ధన్ రాజ్ కు ఆమె ఫ్లాష్ బ్యాక్ ని చెపుతోంది. స్టోరీ మిలన్ కు షిఫ్ట్ అయ్యింది.

Updated at 06:24 AM

మొత్తానికి సినిమా మొదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ లో వారి ఆనందన్ని వ్యక్తం చేస్తున్నారు . సమంత సినిమాలోకి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. తను అప్సెట్ గా ఉంది.

Updated at 06:21 AM

టొబాకో వల్ల వచ్చే నష్టాలు అడ్వటైస్మెంట్స్, ప్రభుత్వం షో రీల్స్ ప్లే అవుతున్నాయి. సినిమా కొద్దిసేపట్లో మొదలవుంది.

Updated at 06:15 AM

సంపూర్నేష్ బాబు సినిమా ధియేటర్ లో నడుచుకుంటూ వెళ్తుంటే జనం మొత్తం ఆయన్ని చూస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంపూకు వున్నా క్రేజ్ చూస్తుంటే నమ్మశక్యం కావడం లేదు

Updated at 06:10 AM

హలో ఫ్రెండ్స్ …. మేము మీకు కాసేపట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా లైవ్ అప్డేట్స్ ని అందించబోతున్నాం … సినిమా కొద్ది నిమిషాల ముందే మొదలైంది.