తమిళ హీరో కార్తీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘బిరియాని’ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ఈ రోజు విడుదలైంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్ గా కనిపించింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజ నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజ సంగీతం అందించాడు. చాలా కాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న కార్తీకి ఈ బిర్యానిలో అన్నీ చక్కగా కుదిరి విజయాన్ని అందించిందో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ :
యంగ్ బాయ్ అయిన సుదీర్(కార్తీ)కి అమ్మాయిలను అమితంగా ఆకట్టుకునే స్పెషల్ టాలెంట్ ఉంటుంది. సుదీర్ ఒక ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తూ ఇండస్ట్రియలిస్ట్ అయిన వరదరాజన్(నాజర్) దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. ఒక రోజు వరదరాజన్ ఇచ్చిన ఓ పార్టీకి వచ్చిన సుదీర్ అతని ఫ్రెండ్ పరశురాం(ప్రేంజీ అమరెన్) లకి హాట్ బ్యూటీ అయిన మాయ(మాండీ తఖర్) పరిచయం అవుతుంది. మాయ లుక్ కి పడిపోయిన సుదీర్ ఆ నైట్ మాయతో కలిసి తన ఇంటికి వెళతాడు. ఆ రాత్రి బాగా తాగి ఎంజాయ్ చేసిన సుదీర్ ఉదయం లేచి చూసే సరికి మాయ కనిపించదు. కట్ చేస్తే సుదీర్ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అక్కడి నుంచి ఆ మర్డర్ కేసు నుండి తనని రక్షించు కోవడానికి ప్రియాంక (హన్సిక) మరియు అతని స్నేహితుల సాయం తీసుకుంటాడు. ఆ మర్డర్ ఎవరు చేసారు అనే విషయాన్ని సుదీర్ ఎలా చేదించాడు? దానికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? చివరికి ఆ కేసు నుంచి బయటపడ్డాడా? లేదా? అనేదే మిగిలిన కథాంశం..
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో కార్తీ లుక్ మరియు అతని పెర్ఫార్మన్స్ చాలా డీసెంట్ గా ఉంది. సినిమాలో అమ్మాయిలను ఇంప్రెస్ చేసే సీన్స్ లో కార్తీ నాచురల్ లుక్ సీన్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. హన్సిక చూడటానికి చాలా బాగుంది. కానీ తన పాత్ర మాత్రం చిన్నది. రిచ్ ఇండస్ట్రియలిస్ట్ పాత్రలో నాజర్ సరిపోయాడు. మాండీ తఖర్ ఉన్నది కొద్ది సేపే అయినప్పటికీ గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది.
ప్రేంజీ కొన్ని సీన్స్ లో బాగా చేసాడు కానీ అక్కడక్కడా కావాలసిన దానికన్నా ఎక్కువ చేసాడనిపిస్తుంది. ఇంటర్వెల్ కి 15 నిమిషాల ముందు నుంచి బాగా వేగం పంచుకుంటుంది, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. సెకండాఫ్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ని బాగా చూపించాడు.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అంత బాలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో అర్థం పర్ధం లేని ఎన్నో సీక్వెన్స్ లు వచ్చి ‘అసలేం జరుగుతోంది’? అనేలా చిరాకు పెడతాయి. హన్సికకి డబ్బింగ్ చెప్పినచిన అమ్మాయి వాయిస్ అస్సలు సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వారు పెద్దగా ఎవ్వరూ లేరు. తమిళ వారికి నచ్చేలా ఉండే కామెడీ ఎపిసోడ్స్ ఇక్కడి వారిని అంతగా నవ్వించలేదు. కామెడీ కోసం ఇక్కడి కమెడియన్స్ వాయిస్ ఉపయోగించి ఉండాల్సింది. సెకండాఫ్ లో కొన్ని మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ వచ్చాక క్లైమాక్స్ మళ్ళీ రొటీన్ గా తయారయ్యింది. మాములుగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే బి, సి సెంటర్ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా నచ్చదు.
సాంకేతిక విభాగం :
శక్తి సరవనన్ సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. యువన్ శంకర్ రాజ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కానీ పాటలే ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి. వెంకట్ ప్రభు డైరెక్షన్ కొన్ని చోట్ల బాగుందనిపిస్తుంది, ఓవరాల్ గా అయితే అతని బెస్ట్ కాదనిపిస్తుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
బిర్యానికి కావాల్సిన అన్ని పదార్థాలను దగ్గర పెట్టుకొని కాస్త శ్రద్దగా వండితే మంచి రుచికరమైన బిరియాని తయారవుతుంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ‘బిరియాని’ సినిమా విషయంలో అన్నీ కుదరలేదు. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగా వీక్ అవ్వడంతో ‘బిరియాని’ సరిగా కుదరలేదు. మన హైదరాబాద్ బావర్చి బిరియానిలానే బిరియాని సినిమా కూడా ఉంటుందనుకోని వెళ్తే మీకు నిరాశే కలుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘బిరియాని’ మూవీ బిరియానిలా కాకుండా జస్ట్ ఫ్రైడ్ రైస్ లా ఉంది.
………………. సినిమా సమాప్తం ………… 12:15 pm : కొన్ని కొన్ని ట్విస్టులు, ఫైటింగ్ సీన్లు మాత్రమే ఆకట్టుకున్నాయి.
12:05 pm : వరదరాజులు మర్డర్ క్లియర్డ్. సీన్లు ప్రొఫెషనల్ గా ఉన్నాయి.
11:55 am : ద్వారా(మధుమతి) మళ్లి కిడ్నాప్ అవుతుంది. సుధీర్ చంపడానికి ప్లాన్ జరగుగుంది.
11:50 am : ద్వారా(మధుమతి) మళ్లి కిడ్నాప్ అవుతుంది. సుధీర్ చంపడానికి ప్లాన్ జరగుగుంది.
11:44 am : పుట్టిన రోజు సందర్భంగా వగలాడి సాంగ్ వస్తుంది. మ్యూజిక్ బాగుంది. కొరియోగ్రఫి కూడా నైస్
11:40 am : రియాజ్ (సంపత్) ను ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా బాగున్నాయి. ఇంతలో మాయ (మాండీ) తప్పించుకొని ముంబాయి వెళ్లిపోతుంది.
11:40 am : రియాజ్ (సంపత్) ను ఇన్వెస్టిగేషన్ సీన్లు చాలా బాగున్నాయి. ఇంతలో మాయ (మాండీ) తప్పించుకొని ముంబాయి వెళ్లిపోతుంది.
11:36 am : పరుశరామ్ ఓ పులి వేశం వేస్తాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంది.
11:34 am : సుధీర్, పరుశరామ్ లను పోలీస్ వాళ్లు పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లు పారిపోతారు. వెంటనే సాంగ్ బిర్యానీ ర్యాప్ సాంగ్
11:14 am : వరదరాజులు కిడ్నాప్ అవుతాడు. ఆ సన్నివేశంలో సుధీర్, పరుశరామ్ లు ఉంటారు.
……….విశ్రాంతి……….
10:48 am : మండే టక్కర్ బిర్యానీ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడో మాస్ సాంగ్ ఇందులో చూడటానికి మండే టక్కర్ చాలా హాట్ గా ఉంది.
10:40 am : జయ్ కాంత్ కామెడీ సీన్లు చాలా ఫన్నీగా ఉన్నాయి. సుధీర్, పరుశరామ్ లు బిర్యానీ పాయింట్ దగ్గరికి వెళుతారు.
10:39 am : సుధీర్ ప్రియాంక ‘పంపం పిల్లా’ పాట తో ఆమె లవ్ లో పడిపోతాడు. వరదరాజు సుధీర్ కి ఇంప్రెస్ అయ్యి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు.
10:33 am : మూవీ చాలా స్లోగా మూవ్ అవుతుంది. తర్వాత ఒక పాట
10:25 am : రాజమండ్రిలో ఓ షాపింగ్ ఓపెనింగ్ కి వరదరాజులు వెళతాడు. ప్రియాంక(హంసిక) కు వరదరాజులు ఇంటర్ఫ్యూ తీసుకోవడానికి సహాయం చేస్తాడు కార్తీ
10:22 am : కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపడాటానికి రాజమండ్రిని వదిలి సుదీర్(కార్తీ) పరుశరామ్ వెళ్లిపోతారు.
10:18 am : రియాజ్ సిబిఐ ఆఫీసర్ వరదరాజులు రాజకీయ నాయకుడు అరెస్టు చేయడానికి వస్తాడు.
10:05 am : సుధీర్ (కార్తీ) సిస్టర్ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. తర్వాత కార్తీతో హంసిక విడిపోతుంది.
10:05 am : సుధీర్ (కార్తీ) సిస్టర్ ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. తర్వాత కార్తీతో హంసిక విడిపోతుంది.
10:00 am : పరుశురామ్ ( ప్రేమగీ అమరన్) ఒక క్లాస్ స్టూడెంట్ సుధీర్ (కార్తి) కి ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తాడు. ఇంతలో ఫ్లాష్ బ్యాక్ చూడటానికి చాలా బాగుంది. దీని తర్వాత ప్రజెంట్ సీన్ కాస్త స్లో గా రన్ అవుతున్నట్లుంది.
9:55 am : పరుశురామ్ ( ప్రేమగీ అమరన్) ఒక క్లాస్ స్టూడెంట్ సుధీర్ (కార్తి) కి ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తాడు. ఇంతలో ఫ్లాష్ బ్యాక్ చూడటానికి చాలా బాగుంది. దీని తర్వాత ప్రజెంట్ సీన్ కాస్త స్లో గా రన్ అవుతున్నట్లుంది.
9:45 am : హాయ్! గుడ్ మార్నింగ్ కార్తీ నటించిన బిర్యాని సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్వాగతం
 TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
				



 
											 
							