Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ధూమ్ 3 రివ్యు

ధూమ్ 3 రివ్యు


ధూమ్ 3..త్వరలో దుమ్మురేపటానికి రెడీ గా వుంది. అమీర్ ఖాన్, కత్రినా జంట గా నటించిన ఈ సినిమా విడుదల కు ముందే ట్రైలర్స్ లో వావ్ అనిపిస్తంది. చిత్రం కోసం ఆమీర్ కత్రినా చేసిన హార్డ్ వర్క్ కూడ సూపర్ అనిపిస్తుంది. సాదార‌ణంగానే అమీర్ ఖాన్ ..సినిమాలో త‌న క్యారెక్టర్ కోసం.. క‌థ డిమాండ్ మేర‌కు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాడు. ధూమ్ 3 కోసం కూడా ఆమీర్ ఆస్ట్రేలియా వెళ్లి కొన్ని పోరాట విద్యలు, ఓ విలక్షణ నృత్యం నేర్చుకున్నాడు. ఇక ధూమ్ త్రీ మేకింగ్ విడియో లో అమీర్ , క‌త్రీనాలు చేసిన ఆక్రోబాటిక్స్ ఫీట్స్ చూస్తే.. హ‌ట్సాఫ్ అన‌కుండ ఉండ‌లేం. 5 కోట్ల ఖ‌ర్చు పెట్టి .. చాలా వైవిధ్యంగా చేసిన ఒక పాట లో ఆక్రోబాటిక్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండ‌టంతో.. దీని కోసం వీరిద్దరు ఎరో బాటిక్స్ నిపుణ‌ల స‌మక్షంలో కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సాంగ్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఔరా అనిపిస్తుంది. ట్రైలర్స్, మేకింగ్ విడియోలతో రికార్డ్స్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

దొంగతనం అనే కాన్సెప్ట్ మీద వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ధూమ్, ధూమ్ 2 సినిమాలకు సీరీస్ గా భారీ అంచనాల నడుమ ధూమ్ 3 సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధూమ్ కి సీక్వెల్ అనగానే భారీ అంచనాలుంటాయి, అందులోనూ ఆ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చేస్తున్నాడంటే అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంటాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు. ధూమ్ 3 ప్రేక్షకుల అంచనాలను అందుకునే రేంజ్ లో ఉందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఇక్బాల్ హరూన్ ఖాన్(జాకీ ష్రాఫ్) చికాగోలో ఇండియన్ సర్కస్ షోని నడుపుతుంటాడు. కానీ అది నష్టాల్లో నడుస్తుండడం వల్ల ఇక్బాల్ హరూన్ ఖాన్ సర్కస్ షో చేసే ప్లేస్ ని వెస్ట్రన్ బ్యాంకు అఫ్ చికాగో వారు సొంతం చేసుకుంటారు. అది తట్టుకోలేక ఇక్బాల్ ఆత్మ హత్య చేసుకుంటాడు. ఇక్బాల్ కొడుకైన సాహిర్ ఎప్పటికైనా మళ్ళీ అక్కడే తిరిగి ఇండియన్ సర్కస్ ఓపెన్ చెయ్యాలనుకుంటాడు. అలాగే తన తండ్రి మరణానికి కారణమైన చికాగో బ్యాంకు పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.

అందులో భాగంగానే చికాగోలోని వెస్ట్రన్ బ్యాంకు అఫ్ చికాగో కి చెందిన పలు బ్రాంచ్ లను చోరీచేస్తుంటాడు. కానీ డబ్బు దోచుకోకుండా నాశనం చేస్తుంటాడు. అప్పుడే ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి జై(అభిషేక్ బచ్చన్), అలీ (ఉదయ చోప్రా) రంగంలోకి దిగుతారు. అప్పుడే జైకి ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది. ఆ నమ్మలేని నిజం ఏంటి? సాహిర్ కి బ్యాంకులోని డబ్బుని మాత్రమే ఎందుకు నాశనం చేస్తున్నాడు? చివరికి సాహిర్ ని జై పట్టుకున్నాడా లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ప్లస్ పాయింట్స్ లో చెప్పాల్సిన మొదటి వ్యక్తి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. ధూమ్ 3 అనేది అమీర్ ఖాన్ వన్ మాన్ షో. అమీర్ ఖాన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేసాడు. అలాగే అమీర్ ఖాన్ రెండు గెటప్స్ లో వైవిధ్యంగా కనిపించారు. ఆ వైవిధ్యం ఏంటనేది మీరు తెరపై చూసి థ్రిల్ అవ్వాల్సిందే. ఇక అమీర్ ఖాన్ ఎన్నడూ చూడని విధంగా స్టంట్స్ చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. అలాగే సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసాడు.

అభిషేక్ ఎప్పటిలానే జై పాత్రలో మెప్పించాడు. ఉదయ చోప్రా అలీ పాత్రలో అక్కడక్కడా నవ్వించాడు. కత్రినా కైఫ్ చూడటానికి చాలా గ్లామరస్ గా ఉంది. అలాగే డాన్సులు, రిస్కీ స్టంట్స్ బాగా చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా వేగంగా సాగుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో చేజింగ్ సీక్వెన్స్ లు ఉండటంతో అందరూ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ కి అందరూ కచ్చితంగా థ్రిల్ అవుతారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది.

సర్కస్ లో చూపించే కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సౌత్ ఇండియన్ స్టైల్లో కంపోజ్ చేసిన కొన్ని స్టంట్స్ బి, సి సెంటర్ వారిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా అభిషేక్ ఇంట్రడక్షన్ ఫైట్. సినిమాలో విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన ట్విస్ట్ తో ప్రేక్షకులు సెకండాఫ్ ని ఓ రేంజ్ లో ఊహిస్తారు. కానీ ఫస్ట్ హాఫ్ సాగినంత వేగంగా సెకండాఫ్ సాగకపోవడం, చేజింగ్ సీక్వెన్స్ లు కూడా పెద్దగా లేకపోవడం, కాస్త ఊహాజనితంగా సాగడం ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరుస్తాయి. అలాగే సినిమాలో రాబరీ ఎపిసోడ్స్ లో ప్రతిసారీ రాబరీ ఎలా చేసారో చూపించకుండా ఎలా తప్పించుకున్నాడు అనేది మాత్రమే చూపించడం బాలేదు. ఒక్కసారైనా రాబరీ ఎలాచేసి ఎలా తప్పించుకున్నాడు అనేది చూపించి ఉంటే బాగుండేది. అలాగే ప్రతి ధూమ్ సీరీస్ లోనూ హీరోయిన్ కి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇందులో కత్రినా కైఫ్ పాత్రకి పెద్ద ప్రాముఖ్యత లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.

సాంకేతిక విభాగం :

ముందుగా సినిమాని చాలా రిచ్ లుక్ తో గ్రాండ్ విజువల్స్ తో తీసిన ప్రొడక్షన్ వాల్యూస్ కి హాట్సాఫ్ చెప్పాలి. ఆదిత్య చోప్రా ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా సినిమాని హాలీవుడ్ తరహాలో తీసాడు. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. చికాగోలోని ప్రతి ఫ్రేంని బాగా చూపించాడు. స్పీడ్ గా సాగే యాక్షన్ సీక్వెన్స్ లను బాగా షూట్ చేసాడు. ఎడిటింగ్ బాగుంది. ప్రీతం మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉన్నా పాటలకి మంచి విజువల్స్ తోడవడంతో చూడటానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను విజయ్ కృష్ణ ఆచార్య డీల్ చేసాడు. కథ సింపుల్ గానే ఉంది కానీ దానికి స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే సూపర్బ్ అనేలా రాసుకున్న విజయ్ కృష్ణ సెకండాఫ్ ని కూడా అదే రేంజ్ లో రాసుకొని ఉంటె బాగుండేది. ఇక డైరెక్టర్ గా విమర్శకులను పెద్దగా మెప్పించలేకపోయినా ఇండియన్ ప్రేక్షకులను మాత్రం బాగా మెప్పించాడు.

తీర్పు :

బాగా క్రేజ్ ఉన్న ‘ధూమ్’ కి సీక్వెల్ గా వచ్చిన ‘ధూమ్ 3′ సినిమా వన్ అండ్ ఓన్లీ అమీర్ ఖాన్ షో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమీర్ ఖాన్ నటన, చేజింగ్ సీక్వెన్స్ లు, సర్కస్ స్టంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తే, కాస్త స్లోగా సాగే సెకండాఫ్ ఆడియన్స్ ని కాస్త నిరుత్సాహ పరుస్తుంది. ఓవరాల్ గా ధూమ్ 3 సినిమా అమీర్ ఖాన్ మార్క్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ‘ధూమ్’ సిరీస్ ఓ ప్రత్యేక స్థానం వుంది. ధూమ్ సీరిస్ లో ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్ హిట్సే. హై వోల్టేజ్ యాక్షన్, ఇంటలిజెన్స్, వావ్ అనిపించే ప్లాన్స్, కళ్ళు చెదిరే ఫీట్స్ , రోమాన్స్ ఇవన్నీ కలిపితే ‘ధూమ్’. అందుకే ఈ ‘సిరీస్’ లో వచ్చే చిత్రాలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ వుంటుంది. ఇప్పడు ఈ సీరిస్ లో మూడో చిత్రంగా ‘ధూమ్3′ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘ధూమ్ 3′ హైలెట్స్ ను పరిశీలిస్తే…

* ‘ధూమ్ 3′ …ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌ కత్రినా కైఫ్, ఉదయ్‌చోప్రా లాంటి హేమాహేమీలు నటించిన చిత్రమిది.

*ధూమ్, ధూమ్ 2లో నటించిన అభిషేక్ బచ్చన్, ఉదయ్‌చోప్రా లు ‘ధూమ్ 3′లో నటించారు. ఎప్పటిలాగే అభిషేక్ బచ్చన్ ( జైదీక్షిత్) , ఉదయ్‌చోప్రా (అలీ అక్బర్‌) పాత్రలలో కనిపిస్తారు.

* అమీర్ ఖాన్, కత్రినా లు ఈ సిరీస్ లో నటించడం ఇదే తొలి సారి. ప్రధాన ఆకర్షణ కూడా వీళ్ళే. ఈ చిత్రం కోసం అమీర్, కత్రినా లు డ్యాన్స్, ఫైట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ట్రైలర్స్ లో అది కనిపిస్తుంది. అమీర్ ఈ చిత్రంలో ద్విపాత్రభినయం చేస్తున్నాడు. విలన్ పాత్రను రివిల్ చేశారు. మరో పాత్ర ఏంటనేది తెలుసుకోవాలంటే ధూమ్ 3 చూడాల్సిందే.

* ఈ చిత్రానికి మరో హైలెట్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం. ‘ధూమ్’ చిత్రాన్ని తెరకెక్కించి బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు ఈయన. ధూమ్, ధూమ్2 లు తీసి ఓ ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ‘ధూమ్ 3′ ఈ సిరీస్ ను ఎలాంటి లెవల్స్ కు తీసుకువెళ్తుందో చూడాలి.

* ఇక ఈ చిత్రం చిత్రీకరణ గురించి.. అధునూతన టెక్నాలజీ ని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రాఫి ఈ చిత్రానికి మరో హైలెట్.

* బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. కేవలం ‘మలాంగ్’ అనే పాటకే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటేనే ఆ సినిమా మేకింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

* డిజిటల్ రీ మాస్టరింగ్, డాల్బీ ఆట్మోస్ టెక్నాలజీత, ఐమాక్స్ ఫార్మాట్ లో ఈ చిత్రాన్ని విదులద చేస్తున్నారు. ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అవుతున్న మొదటి భారతీయ చిత్రం ఇదే.

* అత్యంత భారీ బడ్జెట్ తో తెరకిక్కిన ఈ చిత్రం పై అంతే రేంజ్ లో అంచనాలు వున్నాయి. ప్రస్తుతం సినీ ట్రేడ్ అనలిస్టులు, విమర్శకులు దృష్టంతా ‘ధూమ్ 3’ చిత్రంపైనే ఉంది.

* ‘ధూమ్ 3′ ని తెలుగు లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘ఈగ’ చిత్ర నిర్మాత కొర్రపాటి సాయి ‘ధూమ్ 3′ ఆంధ్రా సీడెడ్‌ పంపిణీ హక్కులను అత్యధిక మొత్తం చెల్లించి సొంతం చేసుకొన్నారు.

*భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమైన ఈ చిత్రం 1000 కోట్ల వసూళ్ళు సాదిస్తుందని బాలీవుడ్ లో హాట్ టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచ సినీచరిత్రలోనే ‘ధూమ్3′ ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది.

 

మరో వైపు ధూమ్ 3 విడుద‌ల అవ్వక ముందే నాలుగో సీక్వెల్ కు స‌న్నాహాలు జరిగిపోతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.

 

ధూమ్ 3 రివ్యు, ధూమ్ 3 : రివ్యు, రివ్యు ధూమ్ 3,  రివ్యు : ధూమ్ 3, dhoom 3 review in telugu, dhoom 3 telugu movie review, dhoom 3 telugu review, dhoom 3 kannada review, dhoom 3 tamil review, dhoom 3 review in tamil, dhoom 3 review, dhoom 3 movie review, dhoom 3 oriya review, dhoom 3 bengali reveiw, dhoom 3 bollywood movie review, dhoom 3 collection, dhoom 3 1st day collection, dhoom 3 fisrt day collection, dhoom 3 box office collection, dhoom 3 income, dhoom 3 ratings, dhoom 3 review ratings, dhoom 3 hit or flop, dhoom 3 websites review, dhoom 3 overseas collection,