చండీ రివ్యూ

0

chandi-review-in-teluguప్రివ్యూ : చండీ

నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాలంటే మ‌న‌వాళ్లకు ఇంకా మోజు త‌గ్గలేదు. మంత్ర – అరుంధ‌తి లాంటి సినిమా రాక పోతుందా..? అని మ‌రో ప్రయ‌త్నం చేస్తూనే ఉన్నారు. గ్లామ‌ర్ పాత్రల అవ‌కాశాలు త‌గ్గాక ప్రియ‌మ‌ణి కూడా అటువైపు అడుగులు వేసింది. సాధ్యం, క్షేత్రం లాంటి సినిమాల‌తో నేనూ ఈ త‌ర‌హా పాత్రలు చేస్తా – అని చాటి చెప్పే ప్రయ‌త్నం చేసింది. ఇప్పుడు చండీ అవ‌తారం ఎత్తింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని హైలెట్స్ పై ఓ లుక్కేస్తే..?

* ఈ సినిమాకి ఉన్న ప్రధాన ఆక‌ర్షణ ప్రియ‌మ‌ణి. దాదాపు ఓ హీరోలానే త‌న క్యారెక్టర్ తీర్చిదిద్దార‌న్న సంగ‌తి ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్థమ‌వుతోంది.

* పంచ్ డైలాగులూ బాగానే పలికింది. క‌త్తి యుద్దాలూ చేసింద‌ట‌. డూప్ లేకుండా ఫైటింగులు చేసి వారెవా అనిపించింద‌ని చిత్రబృందం చెబుతోంది.

* కృష్ణంరాజు, శ‌ర‌త్ కుమార్‌.. ఇలా భారీ ప్యాడింగు అండ‌గా ఉంది.

* స‌ముద్రకి ఇలాంటి క‌థ‌ల్ని డీల్ చేయ‌డం అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌కూ చాలాయేళ్ల నుంచి హిట్టు లేదాయె. త‌న‌ని తాను నిరూపించుకోవ‌డానికి చేసిన సినిమా ఇది.

* త‌ర‌త‌రాల‌కు చెందిన క‌థ ఇది. సెజ్ నేప‌థ్యం కూడా ఉంటుంద‌ట‌. ప్రభుత్వంపై, క‌బ్జాదారులపై ఓ మ‌హిళ చేసిన పోరాటంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

* అన్నట్టు ఈ సినిమాని హిందీలోకీ తీసుకెళ్తార‌ట‌. ఇక్కడ సినిమా బాగా ఆడితే బాలీవుడ్‌లో రీమేక్ చేస్తామంటున్నారు ద‌ర్శక నిర్మాత‌లు.

చండీ మొదటి షో లైవ్ అప్‌డేట్స్:

 

Updated at 12:47 PM

ఫైట్ అయిపోయిన తరువాత విలన్స్ అందరూ జైలుకు వెళ్లారు. చండీ లీడర్ గా ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యింది. క్లైమాక్స్

Updated at 12:32 PM

నిజంగా జీరో క్లారిటీ… సినిమా మొత్తం ఒక సర్కిల్ లా చుట్టూ తిరుగుతూ ఉంది. ముందుకు వెళ్ళడంలేదు.

Updated at 12:20 PM

ప్రస్తుతం ఫైట్ సన్నివేశాలు వస్తున్నాయి. కృష్ణంరాజు గారు ఒక పెద్ద కత్తితో రౌడీలను చంపుతున్నాడు.

Updated at 12:10 PM

ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు సాంగ్ వస్తోంది.

Updated at 12:05 PM

భూ ఆక్రమణ స్కాం ప్రధాన ఇతి వృత్తంగా సినిమా సాగుతోంది.

Updated at 11:50 AM

సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి ఎంటర్ అయ్యింది. అశోక్ గజపతి రాజు గా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఎంట్రీ ఇచ్చారు.

*****ఇంటర్వల్****

Updated at 11:29 AM

ప్రియమణి అమ్మవారి కాస్ట్యూమ్ లో కనిపించింది. అవినీతి పరుడైన ఒక పోలీసు ఆఫీసర్ ని చంపేసింది. ఇంటర్వల్

Updated at 11:15 AM

మంచి క్రియేటివిటి … గబ్బర్ సింగ్ సినిమాలోని అంత్యాక్షరి సీన్ వస్తోంది. కానీ కాస్త మార్పు చేశారు. ఈ సారి పోలీసులు పాడుతున్నారు. రౌడిలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు… చాలా దారుణంగా షూట్ చేశారు.

Updated at 11:10 AM

పోసాని కృష్ణ మురళీ గబ్బర్ సింగ్ 2టౌన్ ఎస్ఐ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నటులు ఆ సినిమాని డబ్ చేయలేదనిపిస్తోంది

Updated at 11:04 AM

అలీ లవర్ బాయ్ చెర్రీ గా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే తాగుబోతు రమేష్ లిక్కర్ బాయ్ గా తెరకు పరిచయం అయ్యాడు. చండీ మరొక డైలాగ్ ‘సముద్రంలో అలని చూడు సైలెంట్ గా ఉంటది.. సునామిని చూడకు వైలెంట్ గా ఉంటది’

Updated at 10:56 AM

ప్రియమణి రాబిన్ హూడ్ ( వేటగాడు)గా మారింది. ఆమె పేదవారి కోసం ఫైట్ చేస్తోంది. శరత్ కుమార్ ఆమెకు మార్గ దర్శకంగా ఉంటూ చేయవలసిన పనులను తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం రెండవ సాంగ్ ‘యాపిల్ లా వుంటది’ వస్తోంది. ఇది ఒక ఐటం సాంగ్. ఈ సాంగ్ తో ఆశిష్ విద్యార్ధి పరిచయం అయ్యాడు.

Updated at 10:45 AM

నాగబాబు సిబీఐ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఒక మంచి డైలాగ్ ‘పోలీసు డిపార్టుమెంట్ సి సి కెమెరా లాంటిది.. కనపడితే పట్టుకుంటుంది… సిబీఐ మెటల్ డెరెక్టర్ లాంటిది… కనబడకపోయినా పట్టుకుంటుంది’

Updated at 10:39 AM

ఇప్పుడే తమిళ స్టార్ శరత్ కుమార్, సత్యం రాజేష్ లు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. ప్రియమణి దేనికోసమో అథ్లెట్ లా ట్రైనింగ్ అవుతోంది. అనుకోకుండా ‘చల్ చల్’ సాంగ్ వస్తోంది. క్రియేటివ్ ప్లేస్ మెంట్

Updated at 10:35 AM

హలో ఫ్రెండ్స్ మేము మీకు ‘చండీ’ సినిమా లైవ్ అప్ డేట్స్ అందిస్తున్నాము. సినిమా ఇప్పుడే మొదలైంది. ప్రియమణి చండీ గా తెరకు పరిచయమయ్యింది. వినోద్ కుమార్ పై చిత్రీకరించిన హింసాత్మక సన్నివేశాలు వస్తున్నాయి.